Chiranjeevi: చిరంజీవి సినిమా ఫ్లాప్ అయితే మందు పార్టీ చేసుకున్న హీరో.. చివరికి ఆంజనేయస్వామిపై ఒట్టేసి..

Published : Dec 28, 2025, 03:14 PM IST

మెగాస్టార్ చిరంజీవి సినిమా ఫ్లాప్ అయితే మరో అగ్ర హీరో మందు పార్టీ చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ అగ్ర హీరో స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఈ కథనంలో.. 

PREV
15
చిరంజీవి, మోహన్ బాబు మధ్య స్నేహం 

మెగాస్టార్ చిరంజీవి నటించిన కెరీర్ బిగినింగ్ లో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, తన ప్రతిభ చాటుకుంటూ ఎదిగారు. చిరంజీవి ప్రారంభంలో కృష్ణ, కృష్ణంరాజు లాంటి హీరోలతో కలిసి నటించారు. మోహన్ బాబు, చిరంజీవి కలిసి హీరోగా నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత చిరంజీవి సినిమాల్లో మోహన్ బాబు విలన్ గా నటించారు. మోహన్ బాబు, చిరంజీవి మధ్య టాలీవుడ్ వజ్రోత్సవ వేడుకల్లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. 

25
సూపర్ హిట్ సినిమాలు 

ఆ వేడుకల్లో మోహన్ బాబు మాట్లాడుతూ..చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. నేనంటే కూడా చిరంజీవికి ఇష్టం ఉంది. కానీ అప్పుడప్పుడూ ఇద్దరం ముభావంగా ఉంటాం. మేమిద్దరం కలిసి నటించిన కిరాయి రౌడీలు సూపర్ హిట్ అయింది. పట్నం వచ్చిన పతివ్రతలు సూపర్ హిట్, బిల్లా రంగా సూపర్ అని మోహన్ బాబు అన్నారు. ఆ తర్వాత చిరంజీవికి నాకు మధ్య గ్యాప్ వచ్చింది. శత్రువులు ఎక్కడో ఉండరు. మన పక్కనే ఉంటారు. 

35
చిరంజీవి, మోహన్ బాబు మధ్య చిచ్చు పెట్టింది ఎవరో తెలుసా.. 

 నాకు, చిరంజీవికి మధ్య చిచ్చు పెట్టింది ఒక డ్యాన్స్ మాస్టర్. మీ సినిమా ఫ్లాప్ అయింది అని మోహన్ బాబు విజీపీ గార్డెన్స్ లో మందు పార్టీ చేసుకుంటున్నాడు అంటూ ఆ డ్యాన్స్ మాస్టర్ చిరంజీవి గ్రూపులో ఒకరికి చెప్పాడు. చిరంజీవికి లేదా అల్లు అరవింద్ కి చెప్పి ఉండొచ్చు. ఒకరు చెప్పినంత మాత్రాన సినిమా హిట్ కాదు, ఒకరు కోరుకున్నంత మాత్రాన సినిమా ఫ్లాప్ కాదు. అంతా భగవంతుడి చేతుల్లో ఉంది. ఒకరి సినిమా ఫ్లాప్ కావాలని కోరుకునే మనస్తత్వం నాది కాదు. 

45
చిరంజీవి సినిమాలో నటించను 

ఆ తర్వాత చిరంజీవి చక్రవర్తి అనే సినిమాలో నటించమని అల్లు అరవింద్ నన్ను అడిగారు. నేను నటించను అని చెప్పా. లేదు మీరు నటించాలి అని రిక్వస్ట్ చేశారు. సరే అని ఒప్పుకున్నా. స్టూడియో నుంచి ఇంటికి వెళుతూ చిరంజీవి నన్ను పిలిచాడు. కారు ఎక్కి ఇద్దరం వాళ్ళ ఇంటికి వెళుతున్నాం. మధ్యలో ఎందుకు చిరంజీవి ముభావంగా ఉన్నావు, నా మీద ఏమిటి కోపం అని అడిగా. దీనితో చిరంజీవి.. నువ్వు నా సినిమా గురించి అలా చేశావు, ఇలా అన్నావు అని తెలిసింది అని చెప్పాడు. 

55
ఆంజనేయస్వామిపై ఒట్టేసిన మోహన్ బాబు 

చిరంజీవి కారులో ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది. దానిపై ఒట్టేసి చిరంజీవి నేను అలా అనలేదు. నీకు నా గురించి చెడుగా చెప్పినవాడు సర్వనాశనం అవుతాడు అని చెప్పా. అలా అన్నవాడు అడుక్కుతినే పొజిషన్ కి చేరుకున్నాడు. చిరంజీవికి ఏమైనా జరిగితే రాత్రి 12 గంటలకు అయినా నేను వెళాతాను. కానీ నాకు ఏమైనా జరిగితే చిరంజీవి వస్తాడా రాడా అనేది నాకు తెలియదు. నేను నా సినిమా ప్రతి ఫంక్షన్ కి చిరంజీవిని పిలుస్తాను. కొన్నింటికి వచ్చాడు. అల్లుడు గారు సినిమా ఓపెనింగ్ కి చిరంజీవి వచ్చాడు. ఆ సినిమా 100 రోజులు ఆడింది. కానీ చిరంజీవి మాత్రం నన్ను ఎప్పుడూ పిలవలేదు. బహుశా అల్లు అరవింద్ పిలవనివ్వలేదు ఏమో అంటూ వజ్రోత్సవ వేడుకల్లో మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Read more Photos on
click me!

Recommended Stories