Bigg boss Inaya Sultana: బిగ్ బాస్ ఇనయా సుల్తానాను మర్చిపోవడం అంత సులువు కాదు. ఆడపులిగా బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో అద్భుతంగా ఆడింది. ఆమెను ఎలిమినేట్ చేసినప్పుడు అన్‌ఫైర్ ఎలిమినేషన్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. ఇప్పుడు ఇనయా ఏం చేస్తుందో తెలుసా?
ఇనయా సుల్తానా బిగ్ బాస్‌కు రాకముందు ఎవరికీ తెలియదు. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో 13వ పోటీదారుగా హౌస్ లోకి వచ్చాక ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అంతకుముందే ఆమె చిన్న చిన్న సినిమాల్లో నటించినప్పటికీ అవి చాలా చిన్న పాత్రలు కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్ బాస్‌లో మాత్రం ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అన్ని టాస్కుల్లో ధైర్యంగా పోరాడటం, ధైర్యంగా మాట్లాడడం వంటివి ఆమెను అందరికీ దగ్గర చేశాయి. ఆమె టాప్ ఫైవ్ లో ఉంటుందని అందరూ భావించారు. కానీ టాప్ ఫైవ్‌కి చేరకముందే ఆమె షో నుంచి ఎలిమినేట్ అయింది. ఆ సమయంలో ఎంతోమంది అన్‌ఫైర్ ఎలిమినేషన్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఇనయా సుల్తానాకు ఆ సమయంలో ఫ్యాన్ బేస్ అధికంగానే ఉంది .ఇక షో నుంచి బయటకు వచ్చాక ఇనయా జీవితం ఎన్నో మలుపులు తిరిగింది.
24
ప్రేమ పేరుతో మోసపోయా
తనకు బిగ్ బాస్ నుంచి వచ్చిన గుర్తింపు వల్ల కొన్ని సినిమాలలో ఆఫర్లు వచ్చాయి. కానీ ఆ సినిమాలో తక్కువ ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లు ఇవ్వడం, కొన్నిచోట క్యారెక్టర్లను తీసేయడం వంటివి చేయడం వల్ల ఇనయాకు రావాల్సిన గుర్తింపు రాలేదు. అదే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఇనయా సుల్తానా. అలాగే కొన్ని షాప్ ఓపెనింగులకు కూడా వెళ్లినట్టు చెప్పింది. కానీ ప్రేమ పేరుతో ఘోరంగా మోసపోయానని తన బాధను పంచుకుంది. అనుకోకుండా పరిచయమైన ఒక వ్యక్తి తన జీవితాన్ని నరకప్రాయం చేశాడని చెప్పింది. గతంలో ఇనయా సుల్తానా.. గౌతమ్ అనే వ్యక్తితో డేటింగ్ లో ఉన్నట్టు ఇన్‌స్టాలో పోస్టు పెట్టింది. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు అప్పట్లో చాలా ట్రెండ్ అయ్యాయి.
34
బంగారం అమ్మేసి డబ్బు ఇచ్చా
తన బ్రేకప్ లవ్ స్టోరీని తాజా ఇంటర్వ్యూలో చెప్పింది ఇనయా సుల్తానా. కేవలం పేరు, డబ్బు, శారీరక సుఖం కోసమే అతడు తనను ట్రాప్ చేశాడని చెప్పింది ఇనయా. అందరి ముందు తనను తిట్టడం వంటివి చేసేవాడని, అవి తాను భరించలేకపోయానని.. అందుకే బ్రేకప్ చెప్పేసాను అని తెలిపింది. ఆ వ్యక్తి బిజినెస్ చేసేందుకు తన బంగారాన్ని కూడా అమ్మి డబ్బులు ఇచ్చినట్టు వివరించింది. దీనివల్ల తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయినట్టు చెప్పింది. ప్రస్తుతం కొంచెం కూడా బంగారం తన దగ్గర లేదని.. ఐదు లక్షల అప్పుతో ఉన్నానని చెప్పింది. తెలిసిన స్నేహితులు, ప్రైవేటు ఫైనాన్షియర్ల దగ్గర నుంచి డబ్బులు అప్పు తీసుకుని బతుకుతున్నట్టు వివరించింది. అతడినే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలన్న నమ్మకంతో శారీరకంగా కూడా దగ్గరైనట్టు బహిరంగంగా చెప్పింది. ఇప్పుడు సర్వం కోల్పోయి మిగిలిపోయానని బాధపడింది
ప్రస్తుతం ఇనయా సుల్తానా చేతిలో చిన్న చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉన్నాయి. వాటితోనే కాలం గడుపుతున్నట్టు వివరించింది. కానీ అప్పులు మాత్రం ఐదు లక్షల దాకా ఉన్నాయని అవి తీర్చుకోవాలని వివరించింది. తాను చనిపోయినా కూడా కనీసం ఎవరికైనా తెలిసే పరిస్థితి లేదని, తన కుటుంబమంతా నగరిలో ఉంటోందని, వారు తనను అంతంతమాత్రంగానే పట్టించుకుంటారని చెప్పింది. రెండు రోజులు పాటు ఎవరితో మాట్లాడకుండా ఉన్నానని, ఆ రెండు రోజులు ఎవరూ కనీసం తనకు ఫోన్ కూడా చేయలేదని చెప్పింది. ఒకవేళ రెండు రోజుల్లో తాను మరణించి ఉంటే ఆ విషయం కూడా కనీసం ఎవరికీ తెలిసేది కాదేమో అని బాధ పడింది. ఇప్పుడు తన హృదయం రాయిలా మారిపోయిందని, ఇక దేనికీ భయపడడం, బాధపడడం చేయనని వివరించింది. బ్రేకప్ అయిపోయాక కూడా తన మాజీ ప్రియుడితో కలిసి ఒక సినిమాలో నటించానని, అది త్వరలో విడుదలవుతుందని చెప్పింది. తానే అతడికి ఈ సినిమా అవకాశం ఇప్పించానని చెప్పింది. తమ ఇద్దరి ఇళ్లల్లో తమ ప్రేమ విషయం కూడా తెలుసని, అది కూడా పెద్ద సమస్య గానే మారిందని వివరించింది.