నాలుక కంట్రోల్ లో పెట్టుకో.. అలీకి మోహన్ బాబు మాస్ వార్నింగ్

Published : Oct 21, 2025, 09:50 AM IST

టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీకి డైలాగ్ కింగ్ మంచు మోహాన్ బాబు మాస్ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? నవ్వుకుంటూనే అలీని ఎన్ని మాటలు అన్నాడంటే? మోహన్ బాబుకు అలీ ఇచ్చిన కౌంటర్ ఏంటి? 

PREV
15
కాంట్రవర్సీ కింగ్ మోహన్ బాబు

టాలీవుడ్ లో సీనియర్ హీరో మోహాన్ బాబు, ఆయన కెరీర్ లో కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ బిరుదులతో పాటు కాంట్రవర్సీ కింగ్ అనే బిరుదు కూడా సాధించుకున్నాడు. మోహాన్ బాబు విలన్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసి, ఆతరువాత హీరోగా టాలీవుడ్ లో తన సత్తా ఏంటో నిరూపించకున్నాడు మోహన్ బాబు. ఎంత పెద్ద డైలాగ్ అయినా సింగిల్ టేక్ లో ఒకే చేయగలగడం మోహన్ బాబు ప్రత్యేకత. అంతే కాదు ఆయన సినిమాలు వరుస విజయాలు సాధించడంతో పాటు భారీకా కలెక్షన్స్ కూడా రాబట్టేవి. దాంతో మోహన్ బాబు పేరు పక్కన డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ లాంటి బిరుదులు వచ్చి చేరాయి. ఆతరువాత కాలంలో కాంట్రవర్సీ కింగ్ కూడా అయ్యారు మోహన్ బాబు.

25
మంచు వారి వివాదాలు

మోహన్ బాబు కెరీర్ లో కాంట్రవర్సీలు ఎన్నో. మెగాస్టార్ చిరంజీవితో విభేదాల దగ్గర నుంచి సినిమా ఈవెంట్స్ లో నోరు జారిన సందర్భాలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వరకూ మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోహన్ బాబుతో పాటు, ఆయన తనయుడు విష్ణు, మంచు లక్ష్మీలు కూడా ట్రోలింగ్ కు గురవ్వడం తెలిసిందే. స్టార్ యాక్టర్స్ ను కూడా ముఖం మీదనే విమర్శిండం, ముక్కు సూటిగా మాట్లాడటం, మోహన్ బాబకు అలవాటు. దాంతో ఆయన ఎక్కువగా వివాదాల్లో నానుతూ ఉంటారు. ఈమధ్య కాలంలో మంచు మనోజ్ విషయంలో మోహన్ బాబు పెద్ద వివాదాన్ని ఫేస్ చేశారు. రిపోర్టర్ ను కొట్టి వైరల్ అయ్యారు. ప్రస్తుతం మోహన్ బాబు తన విద్యాసంస్థల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటూ..మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.

35
అలీపై నోరు జారిన సందర్భాలు

మోహన్ బాబుకు ముక్కు మీద కోపం ఉంటుందని ఇండస్ట్రీలో అందరికి తెలుసు. ముక్కుసూటిగా మాట్లాడే ఈ హీరో, చాలా సందర్బాల్లో చాలామందితో వివాదాలు తెచ్చుకున్నారు. ఇక తన సినిమాల్లో నటించే కమెడియన్స్ పై మోహన్ బాబు చేసే కామెంట్స్ కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరంగా అనిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా కమెడియన్ అలీని పలు సందర్భాల్లో చాలా మాటలు అన్నారు మోహన్ బాబు. అలీ మీద చనువుతో, నవ్వుతూనే చురకలు అంటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మామ మంచు అల్లుడు కంచు సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అలీ పై ఫైర్ అయ్యారు, ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి, నాలుక కాస్త కంట్రోల్ లో పెట్టుకుని మాట్లాడు అంటూ వార్నింగ్ ఇచ్చారు. అలీ ఆ విషయాన్ని కామెడీగానే తీసుకున్నా.. చూసే ఆడియన్స్ మాత్రం షాక్ అయ్యారు.

45
అందరి ముందు ఫైర్ అయిన మోహన్ బాబు

ఒకటి కాదు రెండు కాదు అలీపై మోహన్ బాబు ఫైర్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మోహన్ బాబు కామెంట్స్ ను అలీ సరదాగా తీసుకున్నా.. ఆడియన్స కు మాత్రం కాస్త విచిత్రంగానే అనిపిస్తుంటుంది. ఓ సినిమా ఈవెంట్ లో మోహన్ బాబు మాట్లాడుతుండగా.. అలీ ఒకసారి ఫోన్ చూసుకున్నారు, ఆ విషయం గమనించిన మోహన్ బాబు.. అలీపై ఒక్క సారిగా ఫైర్ అయ్యారు. ''కామన్ సెన్స్ ఉందా నీకు, వేదిక మీదకు వచ్చి ఇలా ఫోన్ చూస్తే ఎలా, నేను మాట్లాడుతుండగా ఫోన్ చూస్తుంటే.. చెప్పేది ఏలా అర్ధం అవుతుంది. మాట్లాడేటప్పుడు డిస్ట్రబ్ చేస్తున్నావ్ '' అంటూ ఫైర్ అయ్యాడు.

55
మోహన్ బాబుకు అలీ కౌంటర్

మరో సందర్భంలో మోహన్ బాబు మాట్లాడుతూ.. ''ఎక్కువగా మాట్లాడుతున్నావ్, బార్డర్ దాటుతున్నావు.. అధిక ప్రసంగం చేయకు'' అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. సినిమా ఈవెంట్ లో రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ.. ''అలీని సినిమాలోకి తీసుకున్నాం.. డబ్బులిస్తేనే వస్తా అన్నాడు.. ఇచ్చాము వచ్చాడు'' అని మోహన్ బాబు నవ్వుతూ అనడంతో.. అలీవెంటనే మోహన్ బాబుకు కౌంటర్ ఇచ్చారు. చిన్నప్పుడే ఒక సారి జైలుకు వెళ్లి వచ్చాను.. మళ్లీ మిమ్మల్ని పొడిచి జైలుకు వెళ్తా.. అన్ని సరదా కామెంట్స్ చేశారు. ఇలా పలు సందర్భాల్లో మోహన్ బాబు నవ్వుతూనే అలీకి వార్నింగ్ ఇచ్చారు. కొన్ని సార్లు మోహన్ బాబు కామెంట్స్ కు అలీ స్ట్రాంగ్ కౌంటర్లు కూడా ఇచ్చాడు.

Read more Photos on
click me!

Recommended Stories