
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తెలగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు. ఇండస్ట్రీలో వారసత్వంగా ఎంతో మంది హీరోలు వచ్చినా.. ఎటువంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా, సొంతంగా ఎదిగి చూపించారు చిరంజీవి. ఎన్నో కష్టనష్టాలను దాటుకుని మెగాస్టార్ రేంజ్ ను అందుకున్నారు. దాసరి మరణం తరువాత తెలుగు పరిశ్రమకు సబంధించిన ప్రతీ సమస్యను ఆయన పరిష్కరిస్తూ వస్తున్నారు. పరిశ్రమలోని 24 శాఖలలో ఎటువంటి సమస్య వచ్చినా.. వారు వెంటనే మెగాస్టార్ ఇంటికి వెళ్తున్నారు. ఇక గతంలో రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవిని సీఎంగా చూడాలని అభిమానులు ఆశించారు. కానీ అది కుదరలేదు. కానీ త్వరలో ఆయనను సీఎం పాత్రలో ఫ్యాన్స్ చూడబోతున్నట్టు సమాచారం.
మెగాస్టార్ చిరంజీవిని సీఎంగా చూడాలని అభిమానులు కోరకున్నారు. రియల్ లైఫ్ లో అది సాధ్యం కాలేదు. కానీ రీల్ లైఫ్ లో మాత్రం పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో మెగాస్టార్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా చిరంజీవి అతిధి పాత్ర చేయబోతున్నారట. అది కూడా టాలీవుడ్ కింగ్ నాగార్జున లాండ్ మార్క్ మూవీలో మెగా గెస్ట్ అపీరియన్స్ ను ఫ్యాన్స్ చూడబోతున్నారని సమాచారం. ప్రస్తుతం నాగార్జున 100 సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో చిరు చేత సీఎం పాత్ర చేయించబోతున్నారట నాగ్.
అక్కినేని నాగార్జున తన 100వ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు. హీరోగా సూపర్ హిట్ సినిమాలు చేసిన నాగ్.. తన లాండ్ మార్క్ మూవీని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఈమధ్య కాలంలో నాగార్జునకు హీరోగా సరైన హిట్ పడకపోవడంతో, క్యారెక్టర్ రోల్స్ వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో కూలీ, కుబేర సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు నాగ్. ఇక ఇప్పుడు 100వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో టబు, అనుష్క శెట్టి లాంటి టాప్ హీరోయిన్‌లు నటిస్తున్నారన్న టాక్ ఫిల్మ్ నగర్ లో హల్‌చల్ చేస్తోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, నాగార్జున 100 సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి పాత్రలో గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనున్నట్టు టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. అందుతోంది. నాగార్జున – చిరంజీవి మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉంది. అన్నదమ్ముల కంటే ఎక్కువ ఆప్యాయంగా ఉంటారు ఈ ఇద్దరు హీరోలు. సినిమా ఈవెంట్స్, టీవీ ప్రోగ్రామ్స్ లో కూడా ఇద్దరు కలిసి సందడి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఈ స్నేహంతోనే నాగ్ తన సినిమాలో నటించడానికి చిరంజీవిని ఒప్పించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరంజీవి కోసం తన సినిమాలో స్పెషల్ ఎలివేషన్ సోలో సీన్స్ ను పెట్టించాడట నాగార్జున.
చిరంజీవి ముఖ్యమంత్రి పాత్రలో కనిపించడంపై అఫిషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు కానీ.. మెగా, అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఈ న్యూస్ వినిపించడంతో పండగ చేసుకుంటున్నారు. ఆనందంతో ఊగిపోతున్నారు. నిజంగా ఈ కాంబినేషన్ కనిపించాలని వారు కోరకుంటున్నారు. ఈ ఇద్దరు హీరోలు కలిసి బ్లాక్ బస్టర్ హిట్ కొడితే చూడాలని ఆశపడుతున్నారు. మరి చిరంజీవి నిజంగా ఈ సినిమాలో నటించబోతున్నారా? నటిస్తే ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వరకూ ఆగాల్సిందే.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. లాంగ్ గ్యాప్ తరువాత ఆయన నటించిన విశ్వంభర సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తోన్న మనశంకరవరప్రసాద్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. మరో వైపు బాబీ డైరెక్షన్ లో మరో సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈక్రమంలోనే మరో రెండు సినిమాలు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇక నాగార్జున మాత్రం తన 100వ సినిమాను తమిళ డైరెక్టర్ కార్తీక్ తో చేయబోతున్నారు. ఈసినిమాను నాగార్జున అన్నపూర్ణ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో చిరంజీవి గెస్ట్ రోల్ చేస్తే, అక్కినేని – మెగా ఫ్యాన్స్‌కి ఇది ఒక గొప్ప విజువల్ ట్రీట్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.