Karthika Deepam 2 Latest Episode: జ్యోకు షాక్ ఇచ్చిన శౌర్య.. దీపకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిన జ్యోత్స్న

Published : Oct 21, 2025, 09:46 AM IST

కార్తీక దీపం 2 లేటెస్ట్ ఎపిసోడ్ (Karthika Deepam 2 Latest Episode) లో సుమిత్ర దీప ఇంట్లో నిద్రపోతూ ఉంటుంది. జ్యోత్స్న తన తల్లి కోసం వెతుకుతుంది. కార్తీక్ మాత్రం కూల్ గా ఉంటాడు. కార్తీకదీపం అక్టోబర్ 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

PREV
15
కార్తీక దీపం 2 లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీకదీపం లేటెస్ట్ ఎపిసోడ్ లో సుమిత్రకు దీప టిఫిన్ తినిపిస్తుంది. తర్వాత టాబ్లెట్ వేస్తుంది. ఈ లోపు జ్యోత్స్నా.. పారిజాతం మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంట్లో ఇదంతా జరగడానికి దీపే కారణమని దానిని ఏం చేయాలో ఆలోచించాలని జ్యోత్స్న అంటుంది. తన ఇంట్లోనే తనకు విలువ లేదని డాడీకి కూడా తన మీద అనుమానం ఉందని పారిజాతంతో చెబుతుంది. తాను ఆ ఇంటికి వారసురాలని కాదేమోనని డాడీకి అనుమానం ఉందని అంటుంది. ఈ లోపు పారిజాతం కల్పించుకొని లేనిపోనివి ఆలోచించి నువ్వు భయపడొద్దు.. ఇప్పటికే నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు దాన్ని నేను సమర్థిస్తే నాకు కూడా తిట్లు పడతాయని చెబుతుంది.

25
సుమిత్రకు వెతుకులాట

పారిజాతం అన్నమాటకి జ్యోకి కోపం వస్తుంది. అయినా కూడా పారిజాతం వెనక్కి తగ్గకుండా మీ తాతకి కోపం వచ్చిందంటే మీ అమ్మ వెళ్లిపోవడం కాదు.. మన ఇద్దరినీ బయటికి గంటేస్తాడు జాగ్రత్త అని హెచ్చరిస్తుంది. సుమిత్ర రాకపోతే జరిగేది కూడా ఇదేనని అంటుంది. జ్యో మాత్రం నమ్మకంగా తన మమ్మీ తిరిగి వస్తుందని చెబుతుంది. నిన్నటి నుంచి కార్తీక్, దశరథ, దీప.. సుమిత్ర కోసం వెతుకుతున్న దొరకడం లేదు ఏంటని పారిజాతం అనుమానిస్తుంది. మమ్మీ దొరికిందని జ్యోత్స్న అనగానే పారిజాతం షాక్ అవుతుంది. దీపా, కార్తీక్ లు కూల్ గా ఉన్నారంటే మమ్మీ క్షేమంగా ఉందని అర్థం అని చెబుతుంది. సుమిత్ర మీద దీపకు ఎందుకంత ప్రేమ అని పారిజాతం అడుగుతుంటే జ్యో సమాధానం చెప్పదు. కానీ మనసులో మాత్రం సుమిత్రకు అసలైన కూతురు దీపే కాబట్టి అని అనుకుంటుంది. తాను తన తల్లిని వెతికి తెస్తానని పారుకు చెప్పి బయలుదేరుతుంది జ్యోత్స్న.

35
జ్యోకు షాక్ ఇచ్చిన శౌర్య

మరోవైపు దీపా, కాంచన మాట్లాడుకుంటూ ఉంటారు. ఎన్ని రోజులు సుమిత్రను ఇంట్లో ఉంచుకుంటామని అడుగుతుంది కాంచన. అప్పుడు దీప.. గాయం తగ్గేంత వరకు ఉంచుకోక తప్పదని చెబుతుంది. ఇంతలో దీప ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది. అది చూసి కాంచన, దీప టెన్షన్ పడతారు. కారులో నుంచి జ్యో బయటికి రావడంతో దీప షాక్ అవుతుంది. శౌర్య దగ్గర నుంచి వివరాలను లాగాలని చూస్తుంది. శౌర్య దగ్గరకు వెళ్లి మీ అమ్మమ్మ ఎక్కడ ఉంది అని అడుగుతుంది. వెంటనే శౌర్య ఇంట్లోనే ఉందని చెబుతుంది. అమ్మమ్మ రెండు రోజుల నుంచి మీ ఇంట్లోనే ఉంది కదా.. నాకు చూపిస్తావా అని అడుగుతుంది. శౌర్య జ్యోత్స్న ను లోపలికి తీసుకెళ్లి దీపను పెంచిన అమ్మ ఫోటోని చూపిస్తుంది. అది చూసి జ్యో షాక్ అవుతుంది.

45
శౌర్య తెలివి

శౌర్య తెలివిగా ప్రవర్తించడం చూసి దీప కూడా సంతోషిస్తుంది. ఆ ఫోటోలో ఉన్నది ఎవరు అని అడిగితే దీపా తన తల్లి అని చెబుతుంది. ఇల్లంతా వెతికినా కూడా జ్యోత్స్నకు సుమిత్ర కనిపించదు. తన మమ్మీ గురించి తెలిస్తే ఫోన్ చేయమని చెబుతుంది. దీప ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతూ జ్యో.. ‘మా మమ్మీ తిరిగి రాకపోతే అందుకు కారణమైన వారిని వదిలిపెట్టను’ అని వార్నింగ్ ఇచ్చి వెళుతుంది. గదిలో సుమిత్ర లేకపోవడంతో కాంచన టెన్షన్ పడుతుంది. గదంతా వెతికితే సుమిత్ర మంచం కింద పడిపోయి కనిపిస్తుంది. దీంతో అందరూ ఉలిక్కిపడతారు. ఆమెను మళ్ళీ జాగ్రత్తగా మంచం మీద పడుకోబెడతారు.

55
అనసూయతో దీప ఏమంటి?

జ్యోత్స్నకు మన మీద అనుమానం వచ్చి ఉంటే తిరిగి ఇంటికి రాదని గ్యారెంటీ ఏంటని దీపను ప్రశ్నిస్తుంది అనసూయ. సుమిత్ర మనం ఎవరి కంటా కనిపించకుండా ఎన్నాళ్ళు దాయగలమని అంటుంది అనసూయ. కార్తీక్ వచ్చాక ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని సర్ది చెబుతుంది దీప. ఈ లోపు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న దశరథకు సుమిత్ర గుర్తుకు వస్తుంది. దీంతో తన భార్యను తానే వెతుక్కుంటానని బయలుదేరుతాడు. సుమిత్ర లేని ఇంట్లో ఉండలేకపోతున్నానని చెబుతాడు. అప్పుడు కార్తీక్ నువ్వెంత వెతికినా అత్త దొరకదని చెబుతాడు. ఇంతలో జ్యో అక్కడికి వచ్చేస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగిసిపోతుంది

Read more Photos on
click me!

Recommended Stories