భద్రతా వలయంలో మిస్ వరల్డ్ పోటీలు, ఎంతమంది పోలీసులు రంగంలోకి దిగారో తెలుసా

Published : May 10, 2025, 07:18 AM IST

మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ వేదికగా మారింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు.

PREV
15
భద్రతా వలయంలో మిస్ వరల్డ్ పోటీలు, ఎంతమంది పోలీసులు రంగంలోకి దిగారో తెలుసా
Miss World 2025

మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ వేదికగా మారింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. మే 10 శనివారం అంటే నేటి నుంచి హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం అవుతాయి. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకలు నిర్వహించనున్నారు.

25
Miss World 2025

హైదరాబాద్ లో జరిగే మిస్ వరల్డ్ పోటీలు కోసం 110 పైగా దేశాల నుంచి సుందరీమణులు, అతిథులు, నిర్వాహకులు హైదరాబాద్ కు చేరుకున్నారు. వీరి భద్రత విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడడం లేదు. ఇండియా పాకిస్తాన్ మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తల నేపథ్యంలో ఏకంగా 5000 మందితో తెలంగాణ ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేసింది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని కంటెస్టెంట్లు బస చేసే హోటల్ వద్ద సాయుధ పోలీసులు, నిఘా వర్గాల లతో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.

35
Miss World 2025

గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియం ప్రాంతాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకొని భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్ ఇలా మొత్తం 5000 మందితో భద్రత ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరిమణులు బసచేసే హోటల్ వద్ద మల్టీ ఎమర్జెన్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. హోటల్ వద్ద ఎక్కువ మంది మహిళా పోలీసులు డ్యూటీలో ఉన్నారు.

45
Miss World 2025

మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకల్ని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి తెలిసేలా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాట్లు పర్యవేక్షించారు. మిస్ వరల్డ్ పోటీల కోసం హైదరాబాద్ కి చేరుకున్న ఎమ్మా మారిసన్, క్రిస్టినా పిస్కోవా లాంటి సుందరి మణులకు అధికారులు ఎయిర్ పోర్ట్ నుంచి ఘనస్వాగతాలు ఏర్పాటు చేశారు.

55
Miss World 2025

పోటీల్లో పాల్గొనే సుందరీమణులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వీటికోసం హోటల్ వద్దే రెండు వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు సందడి మే 31 వరకు ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories