ఈ పోటీలు గచ్చిబౌలి స్టేడియం, శిల్పకళా వేదిక, ట్రైడెంట్ హోటల్ వంటి ప్రసిద్ధ స్థలాల్లో నిర్వహించబడ్డాయి. స్పోర్ట్స్ చాలెంజ్‌లో ఎస్తోనియాకు చెందిన ఎలీస్ రాండ్‌మా నాయకత్వంలోని యూరప్ బ్లూ టీమ్ విజేతగా నిలిచింది. టాలెంట్ షోకేస్‌లో ఇండోనేషియా ప్రతినిధి మోనికా కేజియా అద్భుతమైన ప్రదర్శనతో టాప్ 10లో స్థానం సంపాదించింది. మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ మోడల్ ఛాలెంజ్ లో విజేతగా నిలిచింది.
హెడ్ టు హెడ్ చాలెంజ్‌లో ఆసియా-ఓషియానా నుంచి మిస్ టర్కీ, యూరప్ నుంచి మిస్ వేల్స్, ఆఫ్రికా నుంచి మిస్ జాంబియా, అమెరికాస్-కరేబియన్ నుంచి మిస్ ట్రినిడాడ్ అండ్ టొబాగో విజేతలుగా నిలిచారు. టాప్ మోడల్ కాంపిటీషన్‌లో మిస్ ఇండియా (నందిని గుప్తా), మిస్ ఐర్లాండ్, మిస్ నమీబియా, మిస్ మార్టినిక్ తమ ఖండాల్లో విజేతలుగా ఎంపికయ్యారు.