ఒక్క హీరోయిన్ తోనే 4 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన చిరంజీవి, పదేళ్లలో 19 సినిమాలు.. చివరికి శత్రువులుగా మారారు

Published : May 28, 2025, 07:33 AM IST

చిరంజీవి కెరీర్ లో 8 ఇండస్ట్రీ హిట్ చిత్రాలు ఉన్నాయి. అందులో సగం చిత్రాల్లో ఓ క్రేజీ హీరోయిన్ నటించింది. ఆమె ఎవరు ? ఆ చిత్రాలు ఏంటి ? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్ 

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో రాధిక, రాధా, విజయశాంతి లాంటి హీరోయిన్లతో అత్యధిక చిత్రాల్లో నటించారు. వీళ్ళ ముగ్గురిని చిరంజీవి కెరీర్ లో స్పెషల్ హీరోయిన్లుగా ఫ్యాన్స్ భావిస్తారు. చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్ కి అయితే ఫ్యాన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.

26
పదేళ్లలో 19 చిత్రాలు 

చిరంజీవి, విజయశాంతి తొలిసారి 1983లో సంఘర్షణ అనే చిత్రంలో నటించారు. ఆ మూవీ హిట్ అయింది. ఆ తర్వాత కేవలం పదేళ్లలోనే వీళ్లిద్దరి నుంచి 19 చిత్రాలు వచ్చాయి. వీటిలో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్లు, సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. విజయశాంతి తర్వాత చిరంజీవితో అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోయిన్ రాధ. వీళ్ళిద్దరి కాంబోలో 16 చిత్రాలు వచ్చాయి. హిట్ చిత్రాల పరంగా చూస్తే చిరంజీవికి విజయశాంతి చాలా లక్కీ హీరోయిన్ అనే చెప్పాలి.

36
4 ఇండస్ట్రీ హిట్లు

చిరంజీవి, విజయశాంతి చివరగా 1993లో మెకానిక్ అల్లుడు చిత్రంలో నటించారు. చిరంజీవి కెరీర్లో మొత్తం 8 ఇండస్ట్రీ హిట్ చిత్రాలు ఉన్నాయి. వీటిలో నాలుగు చిత్రాలు విజయశాంతి నటించినవే కావడం విశేషం. అందుకే చిరంజీవికి విజయశాంతి లక్కీ హీరోయిన్.

46
రాజకీయాల్లో శత్రువులు

చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్ లో పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇంతటి అద్భుతమైన చిత్రాల్లో నటించిన చిరంజీవి, విజయశాంతి రాజకీయాల్లో మాత్రం శత్రువులుగా మారారు. చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు విజయశాంతి తీవ్ర విమర్శలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.

56
విజయశాంతికి చిరు ప్రశ్న

విజయశాంతి.. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. వేదికపైనే చిరంజీవి విజయశాంతితో.. రాజకీయాల్లో నన్నెందుకు తిట్టావు అంటూ సరదాగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు విజయశాంతి కూడా హుందాగా సమాధానం ఇచ్చింది. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు తప్పవు.. ఏది ఏమైనా మీరు మా హీరో అని బదులిచ్చింది.

66
చిరంజీవి, విజయశాంతి చిత్రాల లిస్ట్

చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన 19 చిత్రాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

1. సంఘర్షణ

2. దేవాంతకుడు

3. మహానగరంలో మాయగాడు

4. ఛాలెంజ్

5. చిరంజీవి

6. కొండవీటి రాజా

7. ధైర్యవంతుడు

8. చాణక్య శపథం

9. పసివాడి ప్రాణం

10. స్వయంకృషి

11. మంచి దొంగ

12. యముడికి మొగుడు

13. యుద్ధభూమి

14. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు

15. రుద్రనేత్ర

16. కొండవీటి దొంగ

17. స్టువర్టుపురం పోలీస్ స్టేషన్

18. గ్యాంగ్ లీడర్

19. మెకానిక్ అల్లుడు.

Read more Photos on
click me!

Recommended Stories