ఏఎన్నార్‌ నో చెప్పాడు, కృష్ణ పోటీకి దిగాడు, 10 లక్షలతో సినిమా తీసి ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ఎన్టీఆర్‌

Published : May 28, 2025, 08:49 AM IST

సూపర్‌ స్టార్‌ కృష్ణ, సోగ్గాడు శోభన్‌బాబు, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు ఈ ముగ్గురు కలిసి ఎన్టీఆర్‌కి పోటీగా సినిమా తీశారు. కానీ నెల రోజుల్లోనే వారికి పోటీగా సినిమా తీసి ఈ ముగ్గురు స్టార్లకి మైండ్‌ బ్లాక్‌ చేశారు ఎన్టీరామారావు.

PREV
17
కృష్ణకి పోటీగా ఎన్టీఆర్‌ సినిమా

చిత్ర పరిశ్రమలో చాలా చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఒకరితో అనుకున్న సినిమాని మరొకరు చేయడం, ఒకే కథతో ఇద్దరు హీరోలు పోటీగా సినిమా తీయడం, ఒప్పుకున్న ఆర్టిస్ట్ లు మధ్యలో తప్పుకోవడం, కొన్ని సార్లు సినిమాలే ఆగిపోవడం జరుగుతుంది. సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్‌కి వచ్చేంత వరకు తెరవెనుక చాలా జరుగుతుంటాయి. ఎన్టీ రామారావు సినిమాల విషయంలోనూ అలాంటివే చాలా జరిగాయి. ఏఎన్నార్‌ రిజెక్ట్ చేయడం, కృష్ణ పోటీకి దిగడం, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సినిమా తీసి ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్‌ చేసిన ఘనత నందమూరి తారక రామారావు సొంతం.

27
పౌరాణిక చిత్రాలకు కేరాఫ్‌ ఎన్టీ రామారావు

ఎన్టీఆర్‌ పౌరాణిక చిత్రాలకు పెట్టింది పేరు. మైథలాజికల్‌ మూవీస్‌ ఆయన తప్ప మరెవ్వరు తీయలేరు, సక్సెస్‌ కొట్టలేరు అనేంతగా రామారావు అలాంటి సినిమాలు చేసి సంచలనాల క్రియేట్‌ చేశారు. అలా తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన మూవీ `దానవీర శూరకర్ణ`. ఈ సినిమా స్టార్ట్ కావడం, షూటింగ్‌ పూర్తి కావడం చాలా విచిత్రంగా జరిగింది.

37
ఏఎన్నార్‌ రిజెక్ట్ చేయడంతో అన్నీ తానై చేసిన ఎన్టీఆర్‌

`దానవీర శూరకర్ణ` సినిమాని మహాభారతంలోని కర్ణుడి పాత్రని బేస్‌ చేసుకుని తీశారు ఎన్టీఆర్‌. ఈ సినిమాకి ఆయనే దర్శకుడు, ఆయనే రైటర్‌, ఆయనే నిర్మాత. అంతేకాదు ఏకంగా మూడు(కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు) పాత్రలు పోషించాడు. కృష్ణుడి పాత్రకి మొదట ఏఎన్నార్ ని అనుకున్నారు, కానీ ఆయన నో చెప్పాడు. దీంతో అన్నీ తానై ఈ మూవీని తీశారు రామారావు. అలా చేయడానికి బలమైన కారణం ఉంది. ఈ కథతో సినిమా చేయాలని ఎన్టీఆర్‌ చాలా రోజులుగా అనుకుంటున్నారు. ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయమే.

47
కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌ బాబు హీరోలుగా `కురుక్షేత్రం`

కానీ సినిమా ప్రారంభానికి చాలా టైమ్‌ పట్టింది. ఇక ఎన్టీఆర్‌ ఈ మూవీ తీయడని భావించిన కృష్ణ సేమ్‌ ఇదే కథతో తాను `కురుక్షేత్రం` సినిమాని తీశాడు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఇందులో అర్జునుడిగా కృష్ణ, కృష్ణుడిగా శోభన్‌బాబు, కర్ణుడిగా కృష్ణంరాజు నటించారు. ఇలా ముగ్గురు స్టార్స్ నటించిన ఈ మూవీని జనవరి 14 1977లో విడుదల చేశారు.

57
కృష్ణపై కోపంతో నెల రోజుల్లోనే `దానవీర శూరకర్ణ` పూర్తి

సూపర్‌ స్టార్‌ కృష్ణ తాను అనుకున్న కథతో తనకంటే ముందే సినిమా ప్రారంభించడంతో రగిలిపోయిన ఎన్టీఆర్‌ `దానవీర శూరకర్ణ` మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేవలం నెల రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి చేశాడు. అంతేకాదు కేవలం 10 లక్షల బడ్జెట్‌తోనే ఈ మూవీని రూపొందించారు. పౌరాణిక చిత్రాలు తీస్తే తానే తీయాలని పట్టుదలతో ఈ చిత్రాన్ని కృష్ణకి పోటీగా రూపొందించారు రామారావు. ఈ మూవీని కూడా 1977 జనవరి 14నే కృష్ణ `కురుక్షేత్రం`కి పోటీగా రిలీజ్‌ చేశారు. ఒకే కథతో రూపొందిన రెండు సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి.

67
`దానవీర శూరకర్ణ` ముందు నిలవలేకపోయిన `కురుక్షేత్రం`

పౌరాణిక పాత్రలకు రామారావు పెట్టింది పేరు. ఆ డైలాగులు, పద్యాలు, పాటలు పాడటం కూడా ఆయనకు ఆయనే సాటి. జనం కూడా అదే ఫిక్స్ అయ్యారు. రామారావు సినిమాకి బ్రహ్మరథం పట్టారు. కానీ కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు కలిసి చేసిన `కురుక్షేత్రం` సినిమాని పట్టించుకోలేదు. రామారావు డామినేషన్‌ ముందు ఈ ముగ్గురు నిలవలేకపోయారు. `కురుక్షేత్రం` డిజాస్టర్‌ అయ్యింది.

77
టాలీవుడ్‌ ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసిన `దానవీర శూరకర్ణ`

అదే సమయంలో రామారావు తీసిన `దానవీర శూర్ణకర్ణ` మూవీ సంచలన విజయం సాధించింది. పది లక్షలతో రూపొందిన ఈ మూవీ ఏకంగా మూడు కోట్లకుపైగా(గ్రాస్‌) వసూళ్లని రాబట్టింది. కేవలం డిస్ట్రిబ్యూటర్ల షేరే దాదాపు రెండు కోట్లు వచ్చిందంటే ఈ మూవీ ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చు. పెట్టిన ఖర్చుకి ముప్పై రెట్లు ఎక్కువ వసూళ్లని రాబట్టి అప్పటికి టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచి ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం విశేషం. నేడు ఎన్టీరామారావు 102వ జయంతి అనే విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories