మెగాస్టార్‌ ఫస్ట్ పాన్‌ ఇండియా చిత్రం షురూ.. చిరంజీవి మైండ్‌ బ్లోయింగ్‌ ప్లాన్‌?

First Published Aug 13, 2021, 7:36 AM IST

మెగాస్టార్‌ చిరంజీవి సైతం పాన్‌ ఇండియా చిత్రాలపై మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తెలుగులో ఓ పది వరకు పాన్‌ ఇండియా చిత్రాలు రూపొందుతున్నాయి. నెక్ట్స్ చేయబోతున్న సినిమాని పాన్‌ ఇండియా లెవల్‌లో ప్లాన్‌ చేస్తున్నారట. 

`ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌`, `సలార్‌`, `ఆదిపురుష్‌`, `లైగర్‌`, `మేజర్‌`, `పుష్ప`, రామ్‌చరణ్‌-శంకర్‌, ఎన్టీఆర్‌-కొరటాల వంటి చిత్రాలు భారీగా పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో తాను కూడా పాన్‌ ఇండియాచిత్రాలు చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట మెగాస్టార్‌ చిరంజీవి. 

ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది తెలుగులోనే రూపొందుతుంది. కాజల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ షూటింగ్‌ పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీ అవుతుంది. 

నెక్ట్స్ చిరంజీవి `లూసీఫర్‌` రీమేక్‌లో నటిస్తున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి `గాడ్‌ ఫాదర్‌` అనే టైటిల్‌ని అనుకుంటున్నట్టు టాక్‌. ఇదిలా ఉంటే ఇందులో కాస్టింగ్‌ పరంగా భారీగా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు చిరంజీవి. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ని ఒరిజినల్‌లో పృథ్వీరాజ్‌ చేసిన పాత్ర కోసం సంప్రదించినట్టు తెలుస్తుంది. 

అదే సమయంలో తమిళ నటుడు విక్రమ్‌ని కూడా సంప్రదించారని ప్రచారం జరుగుతుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందట. ఇదిలా ఉంటే ఒరిజినల్‌లో వివేక్‌ ఒబెరాయ్‌ పాత్రలో తెలుగు హీరో సత్యదేవ్‌ కనిపించబోతున్నారట. అయితే ఈ చిత్రాన్ని ప్రారంభం నుంచే పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందించాలని చిరు గట్టిగా అనుకుంటున్నట్టు తెలుస్తుంది. 
 

Ram Charan

ఇదిలా ఉంటే చిరు `సైరా నరసింహారెడ్డి` చిత్రాన్ని పాన్‌ ఇండియా లెవల్‌లోనే తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదల చేశారు. కానీ అది వర్కౌట్‌ కాలేదు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో రిజల్ట్ ని సాధించలేకపోయింది. దీంతో `లూసీఫర్‌` రీమేక్‌ని మాత్రం ప్రారంభం నుంచే పాన్‌ ఇండియా సినిమాగా ప్రమోట్‌ చేయాలని భావిస్తున్నారు. ఆ బాధ్యతలను చిరు తన భుజాలపై వేసుకున్నట్టు టాక్.

ఇదిలా ఉంటే ఈ సినిమా నేడు(శుక్రవారం) ప్రారంభం కాబోతుంది. ఈ విషయాన్ని గురువారం చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే ఓ సాంగ్‌ కంపోజింగ్‌ కూడా పూర్తయ్యిందట. ఈ సందర్భంగా చిరంజీవి, మోహన్‌రాజాతో దిగిన ఫొటోను చిత్రసంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. తమన్‌ షేర్‌ చేశారు. `జీవితంలో గుర్తుంచుకోదగిన రోజు ఇది. చిరు153 కోసం పాట పూర్తి చేశాం. ఓ వీరాభిమానిగా చిరంజీవిగారి విషెస్‌ అందుకోవడం చాలా చాలా ప్రత్యేకంగా ఉంది` అని తమన్‌ పేర్కొన్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ సంస్థలపై ఆర్‌.బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

click me!