నేను బతికే ఉన్నా.. దయచేసి అలా చేయొద్దు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎమోషనల్

Published : Sep 09, 2025, 06:59 AM IST

Kajal Aggarwal accident news: తనపై వస్తున్న ఈ తప్పుడు వార్తలపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ స్వయంగా స్పందించారు. తనకు ఎలాంటి జరగలేదని, తాను క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశారు.

PREV
15
ఫేక్ న్యూస్ కు బలైన స్టార్ హీరోయిన్

సోషల్ మీడియాలో వ్యూస్ కోసం కొంతమంది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. తమకు నచ్చినట్టు వార్తలు రాసుకుంటున్నారు. అందులో ఎంత నిజం ఉంటుందో? తెలుసుకోవడం కష్టంగా మారింది. అలా ఓ ఫేక్ న్యూస్ కు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బలైంది. ఆమెకు రోడ్డు ప్రమాదం జరిగిందంటూ సోమవారం (సెప్టెంబర్ 8) సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. 

ఆమె తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉందని, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ మరింత ముందుకు వెళ్లి, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇక లేరని కూడా రూమర్స్ సృష్టించాయి. ఈ వార్తలు చూస్తూనే అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ ప్రియమైన నటి పరిస్థితి ఏమైందో అని ఆందోళన చెందారు.  

25
కాజల్ అగర్వాల్ కి యాక్సిడెంట్

ఫేక్ న్యూస్ బలైన హీరోయిన్ ఎవరో కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. సోషల్ మీడియాలో సోమవారం సాయంత్రం నుంచి “కాజల్ అగర్వాల్ ప్రమాదంలో చిక్కుకుపోయింది, ఆమె పరిస్థితి విషమం” అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. కొందరు యూట్యూబ్ ఛానల్స్ ఆమె ఇక లేరని కూడా రూమర్స్ పుట్టించాయి. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

35
ఫేక్ న్యూస్ పై స్పందించిన కాజల్

ఫేక్ న్యూస్ పై హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్వయంగా స్పందించారు. తన ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తూ ఈ వార్తలు పూర్తిగా తప్పుడు అని ఖండించారు. ఆమె మాట్లాడుతూ “నాకు ప్రమాదం జరిగిందని, నేను ఇక లేను అని కొన్ని వార్తలు వస్తున్నాయి. అవి పూర్తిగా నిరాధారమైనవి. నిజం చెప్పాలంటే నాకు అవి చాలా ఫన్నీగా అనిపించాయి. దేవుడి దయవల్ల నేను బాగానే ఉన్నాను. సురక్షితంగా ఉన్నాను. ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మవద్దు, పాజిటివ్ విషయాలపై దృష్టి పెట్టండి. ప్రేమతో మీ కాజల్” అని ట్వీట్ చేశారు. 

45
అభిమానులకు ఊరటనిచ్చిన చందమామ

కాజల్ అగర్వాల్‌ను అభిమానులు ప్రేమగా టాలీవుడ్ చందమామ అని పిలుస్తారు. ఆమెపై తప్పుడు వార్తలు రావడం వల్ల అభిమానులు బాగా కలవరపడ్డారు. అయితే స్వయంగా కాజల్ క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. “మా కాజల్ బాగానే ఉందని తెలిసి హ్యాపీగా ఉంది” అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆమె ట్వీట్‌ను షేర్ చేస్తూ హ్యాష్‌ట్యాగ్స్‌తో ట్రెండ్ చేస్తున్నారు. “ఫేక్ న్యూస్ కు బలవ్వొద్దు, కాజల్ క్వీన్ సేఫ్‌గానే ఉంది” అంటూ పోస్ట్ చేస్తున్నారు.

55
కాజల్ కెరీర్ జర్నీ

కాజల్ అగర్వాల్‌ 2007లో వచ్చిన లక్ష్మీ కల్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. చందమామ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత మగధీర, ఆర్య 2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 2020లో గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకున్నాక సినిమాలకు కొంత విరామం తీసుకుంది. అప్పుడప్పుడు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన కన్నప్ప మూవీలో పార్వతి పాత్రలో నటించారు. ఇక ది ఇండియా స్టోరీలోనూ కీలక పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో మండోదరి పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తోంది – మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళి, రెండో భాగం 2027 దీపావళి సందర్భంగా విడుదల కానుంది.

Read more Photos on
click me!

Recommended Stories