Meera Vasudevan: మలయాళ నటి మీరా వాసుదేవన్ ఇటీవల తన మూడో భర్త నుంచి విడిపోయినట్టు ప్రకటించింది. 20 ఏళ్ల కెరీర్‌లో మూడు వివాహాలు చేసుకుని, తాజాగా మూడో భర్త విపిన్‌తో విడిపోయినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మలయాళ సినీ నటి మీరా వాసుదేవన్ తన వ్యక్తిగత జీవితంలోని పరిణామాలతో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. టీవీ సీరియల్స్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన మీరా.. మలయాళ, తమిళ చిత్రాలలో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మాధవన్ హీరోగా, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన 13B సినిమాలో నటించడం ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైంది.
25
సినీ ప్రస్థానం కన్నా పర్సనల్ లైఫ్‌నే..
అయితే, తన సినీ ప్రస్థానం కన్నా ఆమె వివాహాల ద్వారానే మీరా వాసుదేవన్ మరింత పాపులారిటీని సంపాదించుకుంది. మీరా గత 20 ఏళ్లలో మూడు వివాహాలు చేసుకొని, మూడు సార్లు విడాకులు తీసుకోవడం సినీ పరిశ్రమలో పెద్ద సంచలనంగా మారింది. తాజాగా ఆమె సింగిల్ అని ప్రకటించడంతో మూడో భర్తతో కూడా విడిపోయినట్లు స్పష్టమైంది.
35
మొదటి వివాహం అప్పుడు..
ఆమె మొదటి వివాహం 2005లో విశాల్ అగర్వాల్‌తో జరిగింది. ఈ దంపతులు ఐదేళ్ల తర్వాత 2010లో విభేదాల కారణంగా విడిపోయారు. రెండేళ్లు సింగిల్‌గా ఉన్న తర్వాత, మీరా 2012లో నటుడు జాన్ కొక్కెన్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. కేజీఎఫ్ సినిమాలో విలన్‌గా గుర్తింపు పొందిన జాన్, తెలుగు సినిమాలలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మీరా, జాన్ దాంపత్యం నాలుగు సంవత్సరాలు సాగింది, అనంతరం 2016లో వారు విడిపోయారు.
ఈ రెండు విడాకుల తర్వాత, మీరా గతేడాది సినిమాటోగ్రాఫర్ విపిన్‌ను వివాహం చేసుకుంది. ఈ వివాహం కనీసం కొద్దికాలమైనా కొనసాగుతుందని అందరూ భావించారు. కానీ, వారి బంధం ఒక సంవత్సరం కూడా పూర్తి కాకుండానే విడిపోయింది. తాజాగా మీరా తన సోషల్ మీడియా ఖాతాలో తాను సింగిల్‌గా ఉన్నట్లు ప్రకటించింది.
55
ఆగస్టు నుంచి నేను సింగిల్..
ఆమె పోస్ట్‌లో, "హాయ్, నేను మీరా వాసుదేవన్. ఆగస్టు నుంచి నేను సింగిల్‌గా ఉంటున్నాను. నేను నా జీవితంలో అత్యంత అద్భుతమైన, ప్రశాంతమైన దశలో ఉన్నాను" అని పేర్కొంది. ఈ ప్రకటనతో విపిన్‌తో కూడా ఆమె విడిపోయిందని స్పష్టమైంది. 43 ఏళ్ల వయస్సులో మీరా వాసుదేవన్ తన 20 ఏళ్ల సినీ ప్రస్థానంలో మూడు పెళ్లిళ్లు చేసుకొని, ముగ్గురు భర్తలకు విడాకులు ఇచ్చి మళ్లీ సింగిల్‌గా మారడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.