Kayadu Lohar: కోలీవుడ్ నటి కయదు లోహర్ ఇటీవల తనపై వచ్చిన విమర్శలు, ఆరోపణలను తిప్పి కొట్టింది. టాస్మాక్ కుంభకోణంతో తనకు ముడిపెట్టారని.. ఆ తప్పుడు వార్తలు తనను తీవ్రంగా బాధించాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వివరాలు ఇలా..
ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది కోలీవుడ్ బ్యూటీ కయదు లోహర్. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ సినిమాతో కయదుకి మంచి గుర్తింపు లభించింది. అంతకుముందు కయదు లోహర్ తెలుగులో అల్లూరి సినిమాతో ఎంట్రీ ఇచ్చినా.. ఆ సినిమా గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియదు. అయితే, ఇటీవల కయదుకు ఉన్న ఫేం వల్ల.. పలు రూమర్స్ కూడా వచ్చిపడ్డాయి. గత కొన్ని రోజులుగా కయదుపై వివిధ రకాల ట్రోల్స్ సోషల్ మీడియాలో వస్తున్న విషయం తెలిసిందే.
25
ఆ కుంభకోణంలో హీరోయిన్ పేరు..
తమిళనాడులో పెద్ద సంచలనం సృష్టించిన టాస్మాక్ కుంభకోణంలో కయదు లోహర్ పేరు వినిపించిన స్సంగతి తెలిసిందే. టాస్మాక్ స్కామ్‌లో ఉన్నవారు నిర్వహించిన పార్టీలకు కయదు హాజరయ్యిందని, అందుకుగానూ ఆమె రూ. 35 లక్షలు తీసుకుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపధ్యంలో కయదుపై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ వచ్చాయి.
35
రూమర్స్ ఖండించిన హీరోయిన్
దీన్ని తాజాగా ఆమె ఖండించింది. ఒక ఇంటర్వ్యూలో కయదు లోహర్ మాట్లాడుతూ..' సినీ పరిశ్రమలో ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చిన తనపై బ్లాక్ మార్క్స్ వేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి విషయాలు తనను ఇంతగా దెబ్బతీస్తాయని తాను ఎప్పుడూ అనుకోలేదని తెలిపింది. నిద్రలో కూడా జనాలు తన గురించి మాట్లాడుకుంటున్నవే గుర్తొస్తున్నాయని పేర్కొంది. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు అసలు బాధ లేకుండా ఈజీగా తీసుకుంటారని అనుకుంటారు. కానీ అది చాలా కష్టమని ఆమె వివరించింది.
తన కలలను నెరవేర్చుకోవడం కోసమే తాను కష్టపడుతున్నానని కయదు లోహర్ తెలిపింది. అంతకు మించి తాను ఏం తప్పు చేశానో తనకు తెలియదని ఆమె చెప్పింది. ఇప్పుడు ఇప్పుడే ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో ఈ ఆరోపణలు రావడం తనకు చాలా బాధ అనిపించిందని పేర్కొంది.
55
ఆరోపణలు హద్దులు దాటకూడదు..
తాను ఈ సినిమా సర్కిల్ నుంచి రాలేదని తనకు తెలుసని, జనాలు తన లాంటి కళాకారులపై సులభంగా ఆరోపణలు చేయగలరని, కానీ అది హద్దులు దాటి వెళ్లకూడదని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం కయదు లోహర్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి