సమంత లాగే ఫ్యామిలీ మ్యాన్ 3లో రచ్చ రచ్చ 43 ఏళ్ళ చేసిన బోల్డ్ నటి, పురుషుడిని అనుకుని లేడీగా మార్చేశారు

Published : Nov 21, 2025, 12:17 PM IST

ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ మొదలైంది. ఈ క్రేజీ సిరీస్ లో నటించిన 43 ఏళ్ళ బోల్డ్ నటి సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. ఆ నటి గురించి ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
ఫ్యామిలీ మ్యాన్ 3 స్ట్రీమింగ్ షురూ 

 ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ పాయి హీరోగా తెరకెక్కిన సెన్సేషనల్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ సరికొత్త సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ 3 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆడియన్స్ నుంచి కొత్త సీజన్ కి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ప్రియమణి, మనోజ్ బాయ్ పాయి జంటగా నటించారు. నటుడు షరీబ్ ఈ సీజన్ లో కూడా కీలక పాత్రలో కొనసాగారు. 

25
నెగిటివ్ రోల్ లో 43 ఏళ్ళ బోల్డ్ నటి 

జైదీప్ ఆహ్లావత్, నిమ్రత్ కౌర్ నెగిటివ్ పాత్రల్లో నటించారు. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో సమంత విలన్ రోల్ లో నటించారు. సమంత రాజీ పాత్రలో బోల్డ్ గా విశ్వరూపం ప్రదర్శించింది.  అదే తరహాలో సీజన్ 3లో 43 ఏళ్ళ బోల్డ్ నటి నిమ్రత్ కౌర్ పోషించిన మీరా పాత్ర వైరల్ అవుతోంది. 

35
పురుషుడిని అనుకుని లేడీగా మార్చేశారు 

నిమ్రత్ కౌర్ బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది. వెబ్ సిరీస్ లు, టీవీ సీరియల్స్ లో కూడా నిమ్రత్ కౌర్ నటించింది. ఫ్యామిలీ మ్యాన్ 3 ఆమెకి కెరీర్ ఛేంజింగ్ ఆఫర్ అనే చెప్పాలి. ఫ్యామిలీ మ్యాన్ 3లో ఆమె పాత్రకి సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. నిమ్రత్ పాత్రని ముందుగా దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే పురుషుడిగా రాసుకున్నారట. కానీ చివరికి లేడీగా మార్చేసి కథలో మార్పులు చేశారు. 

45
సీజన్ 2 సమంత ఫార్ములా రిపీట్ 

దీనితో నిమ్రత్ కి ఆ పాత్రలో నటించే అవకాశం దక్కింది. ఫ్యామిలీ మ్యాన్ 2 విషయంలో కూడా ఇదే జరిగింది. ఫ్యామిలీ మ్యాన్ 2 కథలో లేడి విలన్ అనే ప్రస్తావన ముందుగా లేదట. కొత్తదనం కోసం విలన్ పాత్రని లేడీగా మార్చాలని అనుకున్నారు. ఆ విధంగా రాజీ పాత్రని సృష్టించి అందులోకి సమంతని తీసుకున్నారు. 

55
రాజ్ తో రిలేషన్ లో సమంత 

మొత్తంగా రాజ్ అండ్ డీకే ల ఫార్ములా వర్కౌట్ అయింది. ఫ్యామిలీ మ్యాన్ దర్శకులలో ఒకరైన రాజ్ నిడిమోరుతో సమంత ప్రస్తుతం రిలేషన్ లో ఉంది. ఇద్దరూ తరచుగా జంటగా కనిపిస్తున్నారు. సమంత తన సోషల్ మీడియాలో ఫ్యామిలీ మ్యాన్ 3 ని ప్రమోట్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories