సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ ఒకే సినిమాలో నటించినా లేదా తరచూ కలిసి కనిపించినా, వారి మధ్య ఏదో ఉందనీ, సంథింగ్, సంథింగ్ అంటూ పుకార్లు క్రియేట్ అవుతాయి. నిత్యం వారు వార్తల్లో హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మీడియాకు అడ్డంగా దొరికిపోయింది. తాజాగా వీరిద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో కలిసి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందిఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఈ ముద్దుగుమ్మ బాయ్ ఫ్రెండ్ ఎవరు? మీరు కూడా ఓ లూక్కేయండి.
26
టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్!
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. టాలీవుడ్ సార్ట్ హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఈ భామ ప్రస్తుతం హీరోయిన్‌గా వరుస అవకాశాలు అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ మారింది. ఈ అమ్మడు వరుస విజయాలను అందుకుని ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా స్థానం సంపాదించుకుంది.
మీనాక్షి 2021లో వచ్చిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడీలో నటించింది. సినిమాలో మీనాక్షి గ్లామరస్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నా, సినిమా డిజాస్టర్ కావడంతో నిరాశ ఎదురైంది. కానీ అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ 2తో మంచి విజయం సాధించింది.
36
స్టార్ హీరోయిన్ మీనాక్షి
‘గుంటూరు కారం’లో రెండో హీరోయిన్‌గా నటించినా, ఆమె అందం, నటనతో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత వరుసగా హిట్‌లు అందుకుంటూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అలాగే దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ కూడా మంచి విజయం సాధించడంతో మీనాక్షి స్టార్‌డమ్ మరింత పెరిగింది.
ఇక తాజాగా మీనాక్షి చౌదరి మరో బంపర్ ఆఫర్‌ను అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్‌గా ఆమె నటించనుందని సమాచారం. వశిష్ట్ మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి దేవకన్య పాత్రలో కనిపించనుందని ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇలా వరుస విజయాలతో, వరుస ఆఫర్లతో ప్రస్తుతం మీనాక్షి టాలీవుడ్‌లో హాట్‌ఫేవరెట్ హీరోయిన్‌గా నిలిచింది.
56
ఎయిర్‌పోర్ట్‌లో కలిసి కనిపించిన జంట.. మళ్లీ హాట్ టాపిక్!
ఇదిలా ఉంటే, మీనాక్షి వ్యక్తిగత జీవితం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె అక్కినేని హీరో సుశాంత్‌తో డేటింగ్‌లో ఉందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాలో నటించగా, ఆ షూటింగ్ సమయంలో పరిచయం ప్రేమగా మారిందని టాక్. తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరూ కలిసి కనిపించడంతో ఈ రూమర్స్‌కు మరింత బలమొచ్చింది. తాజాగా టాలీవుడ్ యాక్టర్ సుశాంత్ , నటి మీనాక్షి చౌదరి జంట మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తాజాగా వీరిద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో కలిసి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
66
మీనాక్షి క్లారిటీ
ఆ వీడియోలో మీనాక్షి ముఖానికి మాస్క్ వేసుకొని హ్యాండ్‌బ్యాగ్‌తో నడుస్తుండగా, సుశాంత్ లగేజ్ ట్రాలీని తోసుకుంటూ మరో బ్యాగ్ పట్టుకుని వస్తున్నాడు. వీరిద్దరూ క్లోజ్‌గా మాట్లాడుకుంటూ నడుస్తున్న దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ ఇద్దరి మధ్య నిజంగానే రిలేషన్ ఉందా? అనే చర్చ మళ్లీ ఊపందుకుంది.
అయితే ఈ విషయంపై మీనాక్షి ఇప్పటికే స్పష్టతనిచ్చింది. “సుశాంత్ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. ఆ మించి ఏమీ లేదు” అని ఆమె చెప్పినా, పుకార్లు మాత్రం ఆగడం లేదు. మరి ఈసారి ఎయిర్‌పోర్ట్‌లో కలిసి దర్శనమిచ్చిన సుశాంత్ – మీనాక్షి జంటపై వారు ఏదైనా అధికారిక క్లారిటీ ఇస్తారా? లేక ఈ రూమర్స్ కొనసాగుతాయా? అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.