బాలకృష్ణ, నాగార్జున ఇంత ఫ్రెండ్లీగా ఉండటం ఎప్పుడైనా చూశారా? ఫోటో వెనుక స్టోరీ.. బ్లాక్‌ బస్టర్‌ మూవీ సెట్‌లో నవ్వులు

Published : Sep 05, 2025, 09:10 PM IST

బాలకృష్ణ, నాగార్జున మధ్య ఏవో గొడవలు ఉన్నాయనేది కామెంట్‌ వినిపిస్తుంది. అది వారి మధ్య దూరానికి కారణమంటారు. కానీ ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉండటం ఎప్పుడైనా చూశారా? 

PREV
15
కెరీర్‌ బిగినింగ్‌లో ఫ్రెండ్లీగా బాలకృష్ణ-నాగార్జున

నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తొలి తరం నటులు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అదే సమయంలో సినిమాల పరంగా పోటీ కూడా ఉంది. వీరి సినిమాలు బాక్సాఫీసు వద్ద నువ్వా నేనా అనేట్టుగా ఆడేవి. అయితే ఆ స్నేహం వారి వారసుల విషయంలోనూ కొనసాగింది. బాలకృష్ణ, నాగార్జున కూడా ఎంతో స్నేహంగా ఉండేవారు. తమ సినిమాల ఫంక్షన్లకి గెస్టులు గా కూడా వెళ్లేవారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో ఇద్దరి మధ్య గ్యాప్‌ వచ్చింది. తెలియని దూరం కనిపిస్తుంది. ఓ సందర్భంలో తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. కానీ ఆ గ్యాప్‌ మాత్రం ఇప్పటికీ కనిపిస్తుందనేది అభిమానుల నుంచి వినిపించే మాట.

25
బాలకృష్ణ నాగార్జున రేర్‌ ఫోటో వైరల్‌

అయితే ఈ విభేదాలు అనేది పక్కన పెడితే ఈ ఇద్దరు ప్రారంభంలో మంచి స్నేహితులు. ఒకరి సినిమా సెట్‌కి మరొకరు వెళ్లేంత స్నేహం వీరి మధ్య ఉందంటే అతిశయోక్తి కాదు. తాజాగా వీరికి సంబంధించిన ఒక అరుదైన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో బాలకృష్ణ, నాగార్జున కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక సినిమా సెట్‌లో కావడం విశేషం. ఏదో విషయం గురించి ఇద్దరూ సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారు. ఇది ఇద్దరు హీరోల అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఫుల్‌ ఖుషీ చేస్తుంది. మరి ఇది ఏ సినిమా సెట్‌లో జరిగింది? సందర్భం ఏంటనేది చూస్తే.

35
`ఆదిత్య 369` సెట్‌లో కలుసుకున్న బాలయ్య, నాగార్జున

బాలకృష్ణ, నాగార్జున ఇలా కలిసి మాట్లాడుకుంటూ సరదాగా కనిపించింది `ఆదిత్య 369` మూవీ సెట్‌లో. బాలయ్య హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. తెలుగులోనే కాదు, ఇండియాలోనే మొదటి సారి వచ్చిన సైన్స్ ఫిక్షన్‌ మూవీ కావడం విశేషం. అప్పట్లో ఇది సంచలన విజయం సాధించింది. ఈ మూవీ సెట్‌కి నాగార్జున వచ్చారు. బ్రేక్‌ సమయంలో ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. సినిమా విశేషాలు పంచుకున్నారు. మరో ఫోటోలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కూడా ఉండటం విశేషం. బాలయ్య ఏదో జోక్‌ చేస్తున్నారు, నాగార్జున విరగబడి నవ్వుతున్నారు. ఇది ఎంతగానో ఆకట్టుకుంటుంది. అభిమానులను ఆద్యంతం అలరిస్తుంది. ఇప్పుడు కూడా ఈ ఇద్దరు ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అని ఫ్యాన్స్ కోరుకోవడం విశేషం.

45
ఇండియన్‌ తొలి సైన్స్ ఫిక్షన్‌ మూవీ `ఆదిత్య 369`

బాలకృష్ణ `ఆదిత్య 369` చిత్ర షూటింగ్‌లో ఉండగా, అదే సమయంలో నాగార్జున కూడా `నిర్ణయం` సినిమా చిత్రీకరణలో ఉన్నారట. పక్కపక్కనే ఈ రెండు సినిమాల చిత్రీకరణలు జరిగాయని, దీంతో ఇద్దరు ఇలా కలుసుకున్నారని సమాచారం. ఏదేమైనా ఈ ఫోటో మాత్రం ఇప్పుడు అటు బాలయ్య అభిమానులను, ఇటు నాగ్‌ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. ఇక `ఆదిత్య 369` మూవీ 1991 జులై 18న విడుదలైంది. సంచలన విజయం సాధించింది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఓ పాత్రలో కృష్ణ కుమార్‌గా, మరో పాత్రలో శ్రీకృష్ణదేవరాయగా మెప్పించారు. ఇందులో హీరో అప్పటి ప్రస్తుతం నుంచి శ్రీకృష్ణదేవరాయ కాలంలోకి వెళ్లడమే ఈచిత్ర కథ. సినిమాకి అప్పట్లో జనం బ్రహ్మరథం పట్టారు. ఇది ఆర్ట్, కాస్ట్యూమ్స్ విభాగాల్లో నంది అవార్డులు అందుకుంది.

55
`అఖండ 2`తో బిజీగా బాలయ్య.. మరి నాగ్‌?

ఇక ప్రస్తుతం బాలయ్య `అఖండ 2`లో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. వీఎఫ్‌ఎక్స్ కారణంగా డిలే అవుతుంది. రిలీజ్‌ వాయిదా పడింది. డిసెంబర్‌లో రాబోతున్నట్టు సమాచారం. మరోవైపు నాగార్జున ఇటీవల `కుబేరా`, `కూలీ` చిత్రాల్లో నటించారు. `కూలీ`లో నెగటివ్‌ రోల్‌ చేశారు. ఆయన సోలో హీరోగా ఇంకా మరే మూవీని ప్రకటించలేదు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories