ఇక బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి వెళ్లే కంటెస్టెంట్ల జాబితాలు గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి. కానీ కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆ పేర్లు మారిపోతున్నాయి. ఎవరు ఫైనల్ అనేది క్లారిటీ మిస్ అయిన నేపథ్యంలో కన్ఫమ్ కంటెస్టెంట్ల లిస్ట్ మాత్రం లీక్ అయ్యింది. అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మాయి రమ్య, రీతూ చౌదరీ, దేబ్జానీ, శివ కుమార్, నటుడు భరణి, కమెడియన్ ఇమ్మాన్యుయెల్, రాము రాథోడ్, టీవీ నటి తనూజా గౌడ, సుమన్ శెట్టి, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, ఆశా సైనీ, సంజనా గాల్రానీ ఫైనల్ అయినట్టు సమాచారం. వీరితోపాటు సింగర్ శ్రీతేజ, దీపికా, సుధాకర్ కోమాకుల కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.