4 నెలల్లో 3 హిట్లు, 850 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన లక్కీ హీరోయిన్ ఎవరోొ తెలుసా..?

Published : Feb 02, 2025, 04:38 PM IST

నాలుగే నాలుగు నెలలు.. ముగ్గురు హీరోలు, మూడు సినిమాలు.. దాదాపు 1000 కోట్ల కలెక్షన్లు, హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీ ఎవరోతెలుసా..? 

PREV
15
4 నెలల్లో 3 హిట్లు, 850 కోట్ల కలెక్షన్స్  కొల్లగొట్టిన లక్కీ హీరోయిన్ ఎవరోొ తెలుసా..?
లక్కీ హీరోయిన్

బాక్సాఫీస్ విజయం హీరోలకే ఎక్కువగా ఉపయోగపడుతుంది. సినిమా హిట్టైనా ఫ్లాప్ అయినా దాని ప్రభావం హీరోలపైనే ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో, హీరోయిన్లు బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయాన్ని అందించినా వారికి క్రెడిట్ ఇవ్వరు. కాని లక్కీ అన్ లక్కీ అన్న పేర్లు మాత్రం పెట్టేస్తారు. ఈక్రమంలో ఈమద్య వరుస విజయాలను అందిస్తున్న ఓ హీరోయిన్ గురించి  చూద్దాం.

Also read: వాలెంటైన్స్ డే కోసం OTTలో.. 6 రొమాంటిక్ కొరియన్ సినిమాలు

25
3 సినిమాలు ₹850 కోట్లు

ఈ హీరోయిన్  గత నాలుగు నెలల్లో మూడు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను  అందించింది. అది కూడా ఒకే భాషలో కాదు, మూడు వేర్వేరు భాషల్లో. ఈ మూడు సినిమాలు.. పండుగ కానుగకా రిలీజ్ అయ్యాయి.  అందులో ఒకటి వినాయక చవితికి, మరొకటి దీపావళికి, మూడో ది సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి.

Also read: జిమ్ములో కుమ్మేస్తోన్న నాని, నేచురల్ స్టార్ కష్టం అంతా ఆ సినిమా కోసమేనా?

 

35
మీనాక్షి చౌదరి

ఇంతకీ ఆ నటి మరెవరో కాదు  మీనాక్షి చౌదరి. ఈమె గత నాలుగు నెలల్లో మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుంది.  అందులో ఆమెకు మొదటి బ్లాక్ బస్టర్ విజయం గోట్'. విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈసినిమా 450 కోట్లకు పైగా వసూలు చేసింది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈసినిమా   గత ఏడాది వినాయక చవితికి విడుదలైంది.

Also read: నయనతార సర్‌ప్రైజ్, మాజీ ప్రియుడు శింబు బర్త్ డే రోజే ప్రకటన

45
లక్కీ భాస్కర్ లో మీనాక్షి చౌదరి

తర్వాత మీనాక్షి హిట్ లిస్ట్‌లో చేరిన చిత్రం 'లక్కీ భాస్కర్'. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన నటించింది మీనాక్షి చౌదరి. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి.. బాక్సాఫీస్ దగ్గర ₹100 కోట్లకు పైగా వసూలు చేసింది. 

Also read: పాకిస్థాన్ లో అల్లు అర్జున్ కు ఇంత క్రేజ్ ఉందా..?

55
సంక్రాంతికి వస్తున్నాం

ఇక సంక్రాంతి కానుకగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది మీనాక్షి.  టాలీవుడ్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో మీనాక్షి చౌదరి నటించిన  సినిమా సంక్రాంతికి వస్తున్నాం'. ఈ సినిమాలో వెంకటేష్ సరసన నటించింది మీనాక్షి. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన  ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ₹300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇలా నాలుగు నెలల్లో 3 బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో ₹850 కోట్లకు పైగా వసూలు చేసి లక్కీ ఛామ్‌గా వెలుగొందుతుంది మీనాక్షి చౌదరి.

 

Read more Photos on
click me!

Recommended Stories