Anasuya Comments: ఫుడ్‌ లాగే అది కూడా ప్రాథమిక అవసరం, బల్లగుద్ది చెప్పిన అనసూయ.. ట్రోలర్స్ కి మైండ్‌ బ్లాక్‌

Published : Feb 02, 2025, 03:24 PM IST

Anasuya bold statement:అనసూయ తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఆమె ఎక్కువగా ట్రోలింగ్‌కి గురవుతుంటుంది. కానీ ఇప్పుడు ట్రోలర్స్ కి మైండ్‌ బ్లాక్‌ అయ్యే స్టేట్‌మెంట్‌ ఇచ్చింది.   

PREV
15
Anasuya Comments: ఫుడ్‌ లాగే అది కూడా ప్రాథమిక అవసరం, బల్లగుద్ది చెప్పిన అనసూయ.. ట్రోలర్స్ కి మైండ్‌ బ్లాక్‌

Anasuya bold statement:యాంకర్‌ అనసూయ ఇప్పుడు యాంకరింగ్‌ మానేసి సినిమాలు చేస్తుంది. మొన్నటి వరకు వరుసగా సినిమాల్లో మెరిసిన ఆమె ఇప్పుడు ఆ మూవీస్‌లోనూ తక్కువగానే కనిపిస్తుంది. జబర్దస్త్ కామెడీ షోని వదిలేయడంతో ఆమె క్రేజ్‌ కూడా తగ్గింది. ఆమెని సోషల్‌ మీడియా జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో అనసూయ వైరల్‌గా మారడం తగ్గిపోయింది. 

25

ఈ క్రమంలో తానే కంటెంట్‌ క్రియేట్‌ చేస్తుంది. ఒకప్పుడు తెలియకుండా సోషల్‌ మీడియాకి స్టఫ్‌ ఇచ్చిన అనసూయ ఇప్పుడు తన మనుగడ కోసం కంటెంట్‌ని క్రియేట్‌ చేస్తుంది. క్రియేట్‌ అయ్యేలా మాట్లాడుతుంది. అందులో భాగంగా తాజాగా ఆమె `సెక్స్` గురించి చేసిన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. భోజనం, బట్టలు, ఇళ్లు మాదిరిగానే సెక్స్ కూడా బేసిక్‌ నీడ్‌ అని తెలిపింది అనసూయ. 
 

35

అనసూయ లేటెస్ట్ గా యూట్యూబర్‌, యాంకర్‌ నిఖిల్‌తో చిట్‌ చాట్‌ చేసింది. ఇందులో ఓ క్రేజీ ప్రశ్న అడిగాడు నిఖిల్‌. ఇప్పుడు 20-25 ఏజ్‌ ఉన్న కుర్రాళ్లంతా 35 ప్లస్‌ ఉన్న ఆంటీలను ఇష్టపడుతున్నారు, వారిపై క్రష్‌ పెంచుకుంటున్నారని, తాజాగా ఓ సర్వేలో స్పష్టమైందని తెలిపారు.

దీనిపై మీ స్పందన ఏంటని అనసూయని అడిగాడు. దానికి అనసూయ అందులో తప్పేముంది అని తెలిపింది. ఫుడ్‌, షెల్టర్‌, క్లాత్స్ మాదిరితోనే సెక్స్ కూడా బెసిక్‌ నీడ్‌(ప్రాథమిక అవసరం) అని చెప్పి షాకిచ్చింది అనసూయ. 
 

45

తన డ్రెస్‌ గురించి మాట్లాడుతూ, తాను బికినీ వేసుకున్నా, బట్టలిప్పి తిరిగినా అది నా ఇష్టం. మనుషులు కాదా మీరు? ఛీ ఛీ ఇద్దరు పిల్లల తల్లి ఇలాంటి బట్టలు వేసుకుందేంటి? అని ఎవడో అంటే వాడి దృష్టిని తప్పుపట్టరు, అనసూయని తప్పుపడతారు.

అది ఎంత వరకు కరెక్ట్. నేను నా పని చేసుకుంటా. ఎవడో కోన్‌ కిస్కా గొట్టం గాడు, వాడి నోటి దూలకి ఏదో వాగాడు, వాడిని ఎందుకు హైలైట్‌ చేస్తున్నారంటూ రెచ్చిపోయింది అనసూయ.  ఓ రకంగా అనసూయ తనలోని మాస్‌ని చూపించారు. 
 

55

ఇటీవల అనసూయ `పుష్ప 2`లో నటించింది. ఇందులో దాక్షాయణి పాత్రలో మెరిసింది. నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో తనదైన స్టయిల్‌లో ఆకట్టుకుంది. సోషల్‌ మీడియాలో గ్లామరస్‌గా మెరిసే ఆమె ఈ మూవీలో మాత్రం ఊరమాస్‌ లుక్‌లో అదరగొట్టింది. ప్రస్తుతం అనసూయ వద్ద తమిళంలో రెండు సినిమాలున్నాయి. తెలుగులోనూ బిజీగానే ఉంది.

అయితే ఇంకా ఏదీ ప్రకటించలేదు. దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు తగ్గాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై ఇటీవల అనసూయ మాట్లాడుతూ, ప్రస్తుతం సినిమాలన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయని ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వస్తాయని చెప్పింది. తాను బిజీగానే ఉన్నట్టు తెలిపింది. 

read  more: లో దుస్తులు కనిపించేలా కూర్చో, అలా చేస్తేనే ఆడియెన్స్ చూస్తారు.. సంచలన విషయం బయటపెట్టిన ప్రియాంక చోప్రా

also read: Chiranjeevi next movie: `పూనకాలు లోడింగ్‌`.. చిరంజీవి నెక్ట్స్ సినిమా టైటిల్‌, మరో బ్లాక్‌ బస్టర్‌ లోడింగ్‌
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories