Balakrishna: బాలయ్య మద్యం అలవాటు, సూటిగా ప్రశ్నించిన నారా భువనేశ్వరి..బాబోయ్ ఇలాంటి సమాధానమా..

Published : Feb 02, 2025, 03:04 PM IST

Nara Bhuvaneshwari and Nandamuri Balakrishna : కొత్త సంవత్సరంలో నందమూరి బాలకృష్ణని అన్నీ మంచి శకునాలే ఎదురవుతున్నాయి. సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం బాలయ్యకి పద్మ భూషణ్ అవార్డు కూడా ప్రకటించింది.

PREV
15
Balakrishna: బాలయ్య మద్యం అలవాటు, సూటిగా ప్రశ్నించిన నారా భువనేశ్వరి..బాబోయ్ ఇలాంటి సమాధానమా..
Nandamuri Balakrishna, Nara Bhuvaneshwari

Nara Bhuvaneshwari and Nandamuri Balakrishna : కొత్త సంవత్సరంలో నందమూరి బాలకృష్ణని అన్నీ మంచి శకునాలే ఎదురవుతున్నాయి. సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం బాలయ్యకి పద్మ భూషణ్ అవార్డు కూడా ప్రకటించింది. అఖండ 2 షూటింగ్ కూడా ప్రారంభం అయింది. బాలయ్యకి పద్మ భూషణ్ అవార్డు రావడంతో ఆయన సోదరి, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. 

25
Nandamuri Balakrishna

ఈ పార్టీకి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ పార్టీలో భువనేశ్వరి బాలయ్యని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఇంకెవరైనా చేసి ఉంటే పెద్ద వివాదం అయ్యేది. కానీ ఆమె బాలయ్య సోదరి కాబట్టి చనువుతో అడిగేశారు. బాలయ్య మద్యం సేవించే అలవాటు గురించి భువనేశ్వరి ప్రశ్నించారు. 

 

35

భువనేశ్వరి మాట్లాడుతూ నీకు, మ్యాన్షన్ హౌస్ కి సంబంధం ఏంటి.. వసుంధర కంటే నీకు మ్యాన్షన్ హౌస్ ఎక్కువైపోయింది.. ఎప్పుడు చూసిన చంకలో పెట్టుకుని తిరిగుతుంటావు అంటూ ముఖం మీదే అడిగేసింది. దీనితో అంతా షాక్ అయ్యారు. సరదాగా ప్రశ్నించిన సోదరికి బాలయ్య కూడా సరదాగానే సమాధానం ఇచ్చారు. కానీ బాలయ్య ఇచ్చిన ఆన్సర్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. 

45
Nara Bhuvaneshwari

నా జీవితంలో అన్నీ అనుకోకుండా జరిగాయి. మ్యాన్షన్ హౌస్ అలవాటు కూడానా అంతే. దానితో ప్రత్యేకంగా ఎలాంటి సంబంధం లేదు. మ్యాన్షన్ హౌసే నన్ను ప్రేమించింది. మ్యాన్షన్ హౌస్, వసుంధర ఇద్దరూ నాకు రెండు కళ్ళు అంటూ బాలయ్య మైండ్ బ్లోయింగ్ సమాధానం ఇచ్చారు. ఒకవైపు మద్యం, మరోవైపు భార్య రెండూ రెండు కళ్ళు అని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. అయితే బాలయ్య సరదాగా అలా అన్నారు. 

55
Balakrishna wife Vasundhara

అప్పట్లో తన తండ్రి ఎన్టీఆర్ బాలయ్యకి ఒక పెద్ద ఇల్లు కట్టించారట. ఆ ఇల్లు బాలయ్యకి మ్యాన్షన్ తో సమానం అని అందులో కూడా మ్యాన్షన్ హౌస్ ఉంటుందని చెప్పారు. మొత్తంగా బాలయ్య కోసం తన సోదరి నారా భువనేశ్వరి ఇచ్చిన పార్టీ చాలా గ్రాండ్ గా జరిగింది. 

Read more Photos on
click me!

Recommended Stories