Bigg Boss 20 : బిగ్ బాస్ 20 ఇంట్లోకి బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా పంపిన ప్రత్యేక వీడియో మేసేజ్ హౌస్‌మేట్స్‌కు హెచ్చరికగా నిలిచింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన బాక్సింగ్ లెజెండ్
బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్' 20వ సీజన్ చాలా గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఆదివారం ప్రారంభమైన ఈ షోకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సీజన్‌లో అందరినీ ఆశ్చర్యపరిచేలా భారత బాక్సింగ్ దిగ్గజం, ఒలింపిక్ విజేత మేరీ కోమ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టారు. రింగ్‌లో ఎందరో ప్రత్యర్థులను పంచ్‌లతో పడగొట్టిన మేరీ కోమ్, ఇప్పుడు 105 రోజుల పాటు బిగ్ బాస్ ఇంట్లో సరికొత్త సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు.
25
కొడుకులతో వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చిన మేరీ కోమ్
మేరీ కోమ్ హౌస్‌లోకి రావడం ఈ సీజన్‌కే పెద్ద హైలైట్‌గా మారింది. సెట్‌కి ఆమె ఒంటరిగా రాలేదు. ఆమె కుమారులు రెచుంగ్‌వర్, ఖుప్నేవర్ తమ తల్లికి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి బిగ్ బాస్ సెట్‌కు వచ్చారు. తల్లి కొత్త ప్రయాణాన్ని చూసి వారు ఎంతో ఉత్సాహపడ్డారు. హౌస్‌లోకి వెళ్లే ముందు మేరీ కోమ్ తన వ్యక్తిత్వం గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. "ఇంట్లో తల్లిగా ఉండటం నా వ్యక్తిత్వంలో ఒక భాగం. స్పోర్ట్స్‌పర్సన్‌గా రింగ్ లోపల గెలవాలనే పట్టుదల నా మరో రూపం. ఇప్పుడు ఈ బిగ్ బాస్ ఇంట్లో ప్రేక్షకులు నాలోని అనేక కొత్త కోణాలను చూస్తారు" అని ఆమె పేర్కొన్నారు.
మేరీ కోమ్ ఎంట్రీని మరింత స్పెషల్‌గా మార్చేందుకు హోస్ట్ సల్మాన్ ఖాన్ ఒక సర్ ప్రైజ్ వీడియో ప్లే చేశారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మేరీ కోమ్ కోసం ఒక ప్రత్యేక వీడియో మెసేజ్ పంపారు. ఇందులో మేరీకి శుభాకాంక్షలు తెలుపుతూనే, మిగతా కంటెస్టెంట్లకు సరదాగా హెచ్చరిక చేశారు. "ఆమె ఇచ్చే నాకౌట్ పంచ్ చాలా భారంగా ఉంటుంది. మేరీ, మీరు ఎలా ఉంటారో హౌస్‌లో కూడా అలాగే ఉండండి. మీ జర్నీ చూడటానికి నేను చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. చాలా చాలా ప్రేమతో" అని ప్రియాంక ఆ వీడియోలో పేర్కొన్నారు.
ప్రియాంక చోప్రా, మేరీ కోమ్ మధ్య చాలా ఏళ్లుగా మంచి స్నేహబంధం ఉంది. 2014లో దర్శకుడు ఒముంగ్ కుమార్ తెరకెక్కించిన 'మేరీ కోమ్' బయోపిక్ చిత్రంలో ప్రియాంక చోప్రానే మేరీ కోమ్ పాత్రలో నటించారు. సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా, 62వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో 'ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం'గా జాతీయ అవార్డును గెలుచుకుంది. అప్పటి నుండి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం కొనసాగుతోంది.
55
105 రోజుల సుదీర్ఘ పోరు.. టైమింగ్స్ ఇవే
మేరీ కోమ్ ఇప్పటివరకు ఆరుసార్లు వరల్డ్ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచి ప్రపంచ రికార్డు సృష్టించారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకాలు సాధించారు. 2020లో ఆమెకు పద్మవిభూషణ్ లభించింది. రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించిన ఆమె, ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో 105 రోజులు ఉండబోతున్నారు. ఈ సీజన్ జియోహాట్‌స్టార్‌లో రాత్రి 9 గంటలకు, కలర్స్ టీవీలో రాత్రి 10:30 గంటలకు ప్రసారం అవుతోంది. ఈ సీజన్‌లో మేరీ కోమ్‌తో పాటు ఆసిఫ్ ఖాన్, కనికా మన్, స్కౌట్ ఓపి (తన్మయ్ సింగ్), ఆమ్రపాలి దూబే, మహీ విజ్, యంగ్ డీఎస్ఏ, ఖాజీ తౌకీర్, అరీష్ఫా ఖాన్, రోహెద్ ఖాన్, ఇషా రిఖీ, గుల్లు (కుశాల్ తన్వర్) తదితరులు పోటీపడుతున్నారు.