Bigg Boss 10 Mukesh Gowda: రిషిగా బుల్లితెరని ఊపేశాడు, ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌజ్‌ షేక్‌.. ముఖేష్‌ గౌడ గ్రాండ్‌ ఎంట్రీ

Published : Sep 07, 2026, 07:55 AM IST

`గుప్పెడంత మనసు` ఫేమ్‌ రిషి సార్‌ అలియాస్‌ ముఖేష్‌ గౌడ బిగ్‌ బాస్‌ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చాడు. టీవీలో రచ్చ చేసిన ఆయన ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌజ్‌ని షేక్‌ చేసేందుకు రావడం విశేషం.

PREV
14
బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి ముఖేష్‌ గౌడ గ్రాండ్‌ ఎంట్రీ

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ముఖేష్ గౌడ . సూపర్ హిట్ సీరియల్ 'గుప్పెడంత మనసు'లో 'రిషి సార్'గా కోట్లాదిమంది మహిళా అభిమానుల మనసు దోచుకున్న ఈ కన్నడ హ్యాండ్సమ్ హంక్, ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన 'బిగ్ బాస్' రియాలిటీ షో హౌస్‌లోకి అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. లాస్ట్ కంటెస్టెంట్‌గా ఆయన బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెట్టారు. తనదైన పర్‌ఫెర్మెన్స్ తో అలరించారు. ముఖేష్‌ ఎంట్రీతో బిగ్‌ బాస్‌ షోకి ఊపు వచ్చిందని చెప్పొచ్చు.

24
రెండుసార్లు బిగ్ బాస్ ఆఫర్‌ను తిరస్కరించిన ముఖేష్

నిజానికి ముఖేష్ గౌడకి బిగ్ బాస్ ఆఫర్ రావడం ఇది మొదటిసారేమీ కాదు. గతంలోనే రెండుసార్లు బిగ్ బాస్ నిర్వాహకులు ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. కానీ, ఆ సమయాల్లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'గుప్పెడంత మనసు' సీరియల్ షూటింగ్‌తో అత్యంత బిజీగా ఉండటం, ఆ క్యారెక్టర్‌కి ఉన్న ఇంపార్టెన్స్ కారణంగా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు ఆయన సున్నితంగా 'నో' చెప్పారు. సీరియల్ ప్రొడ్యూసర్లు, ప్రేక్షకులకు ఇచ్చిన కమిట్‌మెంట్ కోసమే రెండుసార్లు వచ్చిన క్రేజీ ఆఫర్‌ను వదులుకున్నారు.

34
ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో 'రిషి సార్' హంగామా!

'గుప్పెడంత మనసు' సీరియల్ ముగియడం, సరైన సమయం కుదరడంతో ఈసారి బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్‌కు ముఖేష్ గౌడ పచ్చజెండా ఊపారు. గ్రాండ్ లాంచ్ స్టేజ్‌పై తనదైన క్లాసీ అండ్ డాషింగ్ లుక్‌లో మెరిసిపోయిన ముఖేష్, బిగ్ బాస్ హౌస్‌లోకి గ్రాండ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు.

44
బిగ్‌ బాస్‌ హౌజ్‌లో సత్తా చాటుతాడా?

బుల్లితెరపై కేవలం సైలెంట్ అండ్ క్లాస్ హీరోగా కనిపించిన ముఖేష్, రియల్ లైఫ్‌లో ఎలా ఉంటారు? ఆయన మైండ్ గేమ్‌లు ఎలా ఆడబోతున్నారు? తన గ్లామర్‌తో హౌస్‌లోని లేడీ కంటెస్టెంట్స్‌ను, బయట ఉన్న అభిమానులను ఎలా ఆకట్టుకోబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీరియల్‌తో ఊహించని రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ముఖేష్, బిగ్ బాస్ హౌస్‌లోనూ టైటిల్ ఫేవరెట్‌గా నిలవడం ఖాయమని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఎంత వరకు ఎంటర్‌టైన్‌ చేస్తారనేది చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories