Irumudi Day 17 Collections: బాక్సాఫీసు వద్ద ఇరుముడి సునామీ.. లాభాల్లో రవితేజ సినిమా రికార్డు

Published : Sep 07, 2026, 08:28 AM IST

రవితేజ నటించిన `ఇరుముడి` మూవీ ఇప్పుడు అన్‌ స్టాపబుల్‌గా రన్‌ అవుతోంది. ఈ చిత్రాన్ని ఆడియెన్స్ తెగ చూస్తున్నారు. మూడో వారంలోనూ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. అదివారం అత్యధిక వసూళ్లని రాబట్టింది.

PREV
14
బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టిస్తోన్న రవితేజ ఇరుముడి

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో `ఇరుముడి` మూవీ రూపొందింది. ఇందులో రవితేజకి జోడీగా ప్రియా భవానీ శంకర్‌ నటించగా, ఆయన కూతురిగా బేబీ నక్షత్ర చేసింది. వీరితోపాటు సాయికుమార్‌, అజయ్‌ ఘోష్‌, రమేష్‌ ఇందిరా, కొమురం, లక్ష్మణ్‌ వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించింది. అయ్యప్ప భక్తుల కథ, తండ్రీ కూతుళ్ల మధ్య బాండింగ్‌ నేపథ్యంలో అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలను బేస్‌ చేసుకొని ఈ మూవీని రూపొందించారు. ఆగస్ట్ 21న విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో బాక్సాఫీసు వద్ద ఇది రచ్చ చేస్తోంది.

24
ఇరుముడి మూవీ 17 రోజు అత్యధిక వసూళ్లు

`ఇరుముడి` మూవీ విడుదలై 17 రోజులవుతుంది. మూడో వారంలోనూ అదిరిపోయే వసూళ్లని రాబడుతోంది. మూడో ఆదివారం ఈ సినిమాకి అత్యధిక కలెక్షన్లు రావడం విశేషం. మొదటి వీకెండ్‌ పక్కన పెడితే, రెండో ఆదివారం కంటే మూడో ఆదివారం కలెక్షన్లు పెరగడం మరో విశేషం. ఈ మూవీని జనం ఒక పండగలా భావించి చూస్తున్నారు. సినిమాని సెలబ్రేట్‌ చేస్తున్నారు. దీంతో ఇది బాక్సాఫీసు వద్ద తగ్గేదెలే అనిపించుకుంటోంది. మరి 17 రోజుల్లో ఈ సినిమాకి ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే.

34
ఇరుముడి వరల్డ్ వైడ్‌ కలెక్షన్లు

`ఇరుముడి` మూవీ ఈ ఆదివారం ఏడు కోట్లకుపైగా గ్రాస్‌ కలెక్షన్లు సాధించింది. రూ.6.75కోట్ల నెట్‌ రావడం విశేషం. ఓవర్సీస్‌లో కేవలం పది లక్షలు వచ్చాయి. ఇండియాలో, అది కూడా తెలుగు స్టేట్స్ లో ఇది దుమ్ములేపుతోంది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 215.40కోట్లు గ్రాస్‌ కలెక్షన్లు వచ్చాయి. ఇది రవితేజ కెరీర్‌లోనే అత్యధికం కావడం విశేషం. దీంతో బాక్సాఫీసు వద్ద తన రేంజ్‌ ఏంటో చూపించారని చెప్పొచ్చు. అయితే ఇది ఇప్పటికీ స్ట్రాంగ్‌గా రన్‌ అవుతుంది. ఎంత వరకు వెళ్తుందనేది ఊహించడం కష్టమనే అని చెప్పొచ్చు. ఈ నెల కూడా ఈ సినిమా జోరు కొనసాగబోతుంది. రూ.300కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదు.

44
లాభాల్లో రవితేజ మూవీ సరికొత్త రికార్డు

ఇక `ఇరుముడి` మూవీకి బడ్జెట్‌ రూ.40కోట్లు, థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.20కోట్లు. రూ.21కోట్ల బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్ తో ఈ సినిమా విడుదల కాగా.. ఇప్పుడు నిర్మాతలకు, బయ్యర్లకి ఊహించని లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమా ద్వారా దాదాపు రూ.90కోట్ల వరకు లాభాలు రావడం విశేషం. ఇటీవల కాలంలో ఈ రేంజ్‌లో లాభాలు తెచ్చిపెట్టిన మూవీ లేదు. ఈ విషయంలో రవితేజ సినిమా సరికొత్త రికార్డు సృష్టించిందని చెప్పొచ్చు. అయితే దీనికి సీక్వెల్‌ కూడా ఉండబోతుందట. ఆ మధ్య ప్రెస్‌ మీట్‌లో నిర్మాతలు వెల్లడించారు. మరి అది ఎప్పుడు ఉంటుందనేది చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories