కానీ మంచు విష్ణు అలాంటి నియమాలు పాటించడం లేదు. ఆయన ఇప్పటికే నలుగురుపిల్లల్ని కన్నారు. విష్ణు, విరానిక జంటకి మొదట కవలలు అరియానా, వివియానా జన్మించారు. ఆ తర్వాత కొడుకు అవ్‌రమ్ జన్మించాడు. చివరగా కూతురు ఐరా విద్యా పుట్టింది. ఇంకా కనాలని ఉందని అంటున్నారు. తనకు పిల్లలంటే చాలా ఇష్టమట.
ఇంకా కనాలని ఉందని తెలిపారు. తాజాగా ఆయన అంజి టాక్స్ లో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. యాంకర్ అంజి ఏంటి మీకు కుటుంబ నియంత్రణ అనేది వర్తించదా? దాన్ని పాటించరా అని ప్రశ్నించగా, అది వ్యక్తిగతం. ఎవరి ఇష్టం వాళ్లది అని చెప్పాడు మంచు విష్ణు.