`కాలమేగా కరిగింది` మూవీ రివ్యూ, రేటింగ్‌

kaalamega karigindhi movie review :  వినయ్‌ కుమార్‌ శ్రావణి మజ్జరి, అరవింద్‌ ముదిగొండ, నోమిన తార హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ `కాలమేగా కరిగింది` ఈ శుక్రవారం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

kaalamega karigindhi movie review in telugu arj
kaalamega karigindhi movie review

వినయ్‌ కుమార్‌, శ్రావణి మజ్జరి, అరవింద్‌ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ `కాలమేగా కరిగింది`. శింగర క్రియేటివ్‌ వర్క్స్ పతాకంపై మరే శివ శంకర నిర్మిస్తున్నారు. శింగర మోహన్‌ దర్శకత్వం వహించిన మూవీ ఇది. పొయెటిక్‌ లవ్‌ స్టోరీగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా శుక్రవారం(మార్చి 21)న విడుదలైంది. మరి సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

kaalamega karigindhi movie review in telugu arj
kaalamega karigindhi movie review

కథః 
ఫణి, బిందు(వినయ్ కుమార్-శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ-నోమిన తార) చిన్నప్పట్నుంచి ప్రేమించుకుంటారు. స్కూల్‌ స్టేజీలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ప్రపంచాన్ని మర్చిపోయి లవ్‌ చేసుకుంటారు. స్టడీస్‌లోనూ వీరు టాపే ఉంటారు. అయితే వీరి ప్రేమ మరింత ముదురుతుంది. ఒకరికొకరు కవితాత్మకమైన ప్రేమ వ్యాఖ్యలు చెప్పుకుంటూ డీప్‌ లవ్‌లోకి వెళ్తారు.

ఈ విషయంలో ఒకరినొకరు పోటీ పడుతుంటారు. అదే సమయంలో టీనేజ్‌లో చేసే పనులన్నీ చేస్తుంటారు. అయితే టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాయి. కానీ ఫణి టాపర్‌గా రావాలనుకునే కల చెదిరిపోతుంది. దీంతో కొంత కాలం తన ప్రియురాలు బిందుకి దూరంగా ఉండాలనుకుంటాడు. తనకు కొన్ని గోల్స్ ఉన్నాయి, ఇలా మనం కలిసి ఉంటే వాటిని రీచ్‌ కావడం కష్టం.

అందుకే కొంత కాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. వీరిద్దరు ఆ సమయంలో విడిపోతారు.  ఫణి సెటిల్‌ అయ్యాక తిరిగి ఊరు వస్తాడు. ఆ సమయంలో తన బిందుని కలవాలనుకుంటాడు. మరి అప్పటికే ఆమె మ్యారేజ్‌ అయ్యిందా? ఫణి కోసం అలానే ఉండిపోయిందా? ఆమె ఎక్కడుండి? ఆ తర్వాత తన జర్నీ ఎలా సాగింది? తమ జ్ఞాపకాలేంటి? అనేది మిగిలిన కథ. 


kaalamega karigindhi movie review

విశ్లేషణః 
సినిమా పొయెటిక్‌ లవ్‌ స్టోరీ. గతాన్ని గుర్తు చేసుకోవడం, స్కూల్‌ డేస్‌ని గుర్తు చేసుకోవడమే ఈ మూవీ. అప్పుడు చేసిన అమాయకపు పనులు, ప్రేమ కబుర్లు తెలియజేసే మూవీ. కేవలం ప్రేమికుల జంట జర్నీనే తెలియ చేస్తుంది. ఇందులో మరో పాత్రకు స్కోప్‌ లేదు. వాళ్లు చెప్పుకున్న కబుర్లు, వారి అలకలు, ధైర్యాన్ని ఇచ్చుకోవడం, బాధని పంచుకోవడం  వంటివి చూపించారు.

తమ మనసులోని ప్రేమ భావాలను కవితల రూపంలో చెప్పడమే ఈ మూవీ. స్వచ్ఛమైన తెలుగు భాషని ఉపయోగించి రూపొందించారు. పాత్రలు తీరుతెన్నులు, సన్నివేశాలు కూడా అంతే పొయెటిక్‌గా ఉంటాయి. ప్రేమ కోసం కవితలు, అచ్చ తెలుగు పదాలు పోటీ పడ్డట్టుగా దీన్ని తెరకెక్కించారు. వెండితెరపై కవితాత్మకమైన ప్రేమ కథని ఆవిష్కరించారు. తెలుగు డైలాగ్‌లు సినిమాకి పెద్ద హైలైట్‌. ఇంగ్లీష్‌ వర్డ్స్ ఉపయోగించకుండా రాయడమే పెద్ద సాహసం.

 ఆ విషయంలో దర్శకుడి కమిట్‌మెంట్‌కిది నిదర్శనమని చెప్పొచ్చు. అదే సమయంలో సినిమాలో మ్యూజిక్‌ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇంకా చెప్పాలంటే మ్యూజికే సినిమాకి ప్రాణం. అది లేకపోతే సినిమానే లేదు. డైలాగులు, సంగీతం సినిమాకి ఆయువు పట్టులా నిలిచాయి. సన్నివేశాల్లోనూ అంత దమ్ము లేదు. కానీ వాటిని ఆర్‌ఆర్‌ నిలబెట్టిందని చెప్పాలి.

అయితే సినిమా మొత్తం చాలా స్లోగా సాగుతుంది. చాలా సన్నివేశాలు రిపీటెడ్‌గా వస్తాయి. చూపించినవే చూపించారు. మరోవైపు ఆధునిక ప్రపంచంలో మనిషి పరుగులు పెడుతున్నాడు. కానీ ఈ మూవీ ద్వారా కవిత్వం చెప్పడం, ప్రేమ కవిత్వం చెప్పడం కామెడీగా అనిపిస్తుంది. ప్రేమలోనూ డెప్త్ చూపించాల్సింది. మరింత ఇంటెన్సిటీతో తెరకెక్కించాల్సింది. కాస్త వేగంగా కథనాన్ని నడిపిస్తే బాగుండేది. 
 

kaalamega karigindhi movie review

నటీనటులు, టెక్నీషియన్లుః 
సినిమాలో పెద్దగా పాత్రలు లేవు. హీరో హీరోయిన్‌ నాలుగు పాత్రలే కీలకం. ఇందులో టీనేజ్‌లో అరవింద్‌, నోమిన తారలు కనిపించారు. పెద్దయ్యాక వినయ్‌ కుమార్‌, శ్రావణి మజ్జరి కనిపిస్తారు. టీనేజ్‌ ఎపిసోడే ఎక్కువగా ఉంటుంది. ఆయా పాత్రల్లో అరవింద్‌, నోమిన బాగా చేశారు. సహజంగా నటించి మెప్పించారు. ఇంకా బాగా చేయాల్సింది.

వినయ్‌ కుమార్‌ కూడా సెటిల్‌గా ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రలు జస్ట్ ఓకే. టెక్నీకల్‌గా మూవీ మ్యూజిక్‌ సినిమాకి మెయిన్‌ అసెట్‌. దర్శకుడు డైలాగ్‌ హైలైట్‌. ఫీల్‌ గుడ్‌, ఎమోషనల్‌ సీన్ల విషయంలో బాగా వర్క్ చేయాల్సింది. వాటిని రక్తికట్టించేలా, ఆయా సీన్లు పండితే సినిమా మరింత బాగుండేది. 

ఫైనల్‌గాః  కమర్షియల్‌ ఎలిమెంట్లతో బోల్డ్ కంటెంట్‌ తో పరుగులుపెడుతున్న ఈ కాలంలో ఈ కవితాత్మకమైన ప్రేమకథని అందించడం ఓ సాహసమనే చెప్పాలి. ఇదొక కొత్త ప్రయోగం. 
 

Latest Videos

vuukle one pixel image
click me!