Killer Artiste Movie Review: `కిల్లర్‌ ఆర్టిస్ట్` మూవీ రివ్యూ, రేటింగ్‌

Killer Artiste Movie Review: ప్రభాకర్‌, బిగ్‌ బాస్‌ ఫేస్‌ సోనియా ఆకుల ప్రధాన పాత్రల్లో, సంతోష్‌ కల్వచెర్ల, క్రిషేక పటేల్‌ జంటగా నటించిన మూవీ `కిల్లర్‌ ఆర్టిస్ట్` ఈ శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

Killer artiste movie review in telugu arj
killer artiste review

Killer Artiste Movie Review: సంతోష్‌ కల్వచెర్ల, క్రిషేక పటేల్‌, సోనియా ఆకుల, ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ `కిల్లర్ ఆర్టిస్ట్`. రతన్‌ రిషి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని ఎస్‌ జేకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జేమ్స్ వాట్‌ కొమ్ము నిర్మించారు.

ఈ మూవీ శుక్రవారం(మార్చి 21)న విడుదలైంది. ఈవారం అన్ని చిన్న చిత్రాలే రిలీజ్‌ అవుతున్నాయి. అందులో భాగంగా ఈ మూవీ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మరి  క్రైమ్‌ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

Killer artiste movie review in telugu arj
killer artiste movie review

కథః 
సైకో కిల్లర్‌ పిచ్చి రవి(ప్రభాకర్‌) పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతాడు. అతను వరుసగా ఆడవారిపై దాడి చేసి అత్యాచారం చేసి అతికిరాతకంగా చంపుతున్నాడు. ఇక విక్కీ(సంతోష్‌ కల్వచెర్ల) జాను(క్రిషేక పటేల్‌) లవ్‌లో ఉంటారు. ఘాటుగా ప్రేమించుకుంటారు. తమ ప్రేమని జాను ఇంట్లో చెబుతుంది. తండ్రి రవీంద్ర(వినయ్‌ వర్మ) ఒప్పుకుంటాడు.

కానీ తల్లి ఆలోచిస్తుంటుంది. అబ్బాయిలు మొదట్లో బాగానే ఉంటారని, తర్వాత వాళ్ల నిజ స్వరూపం బయటపడుతుందని చెబుతుంది. విక్కీని చూసి, మాట్లాడాక డిసైడ్‌ చేస్తానని చెబుతుంది. ఓ రోజు విక్కీ.. జాను వాళ్ల ఇంటికి వస్తారు. కానీ జాను అమ్మ మాట్లాడకుండా అవమానిస్తుంది. మరోవైపు టీవీలో పిచ్చి రవి కి సంబంధించిన బ్రేకింగ్‌ వస్తుంది. అది చూసి బాధపడుతూ  అక్కడి నుంచి వెళ్లిపోతాడు విక్కీ.

దీంతో విక్కీ లైఫ్‌లో జరిగిందేంటో అమ్మకి చెబుతుంది జాను. విక్కీకి అమ్మా నాన్న లేరు. తన చెల్లితోనే ఉంటాడు. చెల్లి తనని అమ్మలా చూసుకుంటారు. చెల్లిని తాను నాన్నలా చూసుకుంటాడు. అలాంటి చెల్లిని పిచ్చి రవి అతికిరాతకంగా చంపేస్తాడు. ఆ బాధలో తాగుడికి బానిసవుతాడు విక్కీ. దాన్నుంచి బయటపడేసే ప్రయత్నం జాను చేస్తుంది. కానీ బయటపడలేకపోతాడు.

పిచ్చి రవిని చంపేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఈ క్రమంలో విక్కీకి తెలిసిన షాకింగ్‌ నిజాలేంటి? తన చెల్లి హత్యలో ఉన్నది ఎవరు? పిచ్చిరవిని జాను ఫ్యామిలీనీ ఎందుకు టార్గెట్‌ చేశాడు? అతను వాళ్లింట్లో సృష్టించిన మరణహోమం ఏంటి? పిచ్చి రవిని విక్కీ ఎలా ఎదుర్కొన్నాడనేది మిగలిన కథ. 
 


killer artiste movie review

విశ్లేషణః 
డిఫరెంట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. అమ్మాయిలను టార్గెట్‌ చేస్తూ అతికిరాతకంగా చంపే సైకో కిల్లర్‌ కథని తెలియజేస్తుంది. దీనికి హీరో కుటుంబం ఎలా బలయ్యింది. సైకో కిల్లర్‌కి, తన ప్రేమకి ఉన్న సంబంధం ఏంటనేది `కిల్లర్‌ ఆర్టిస్ట్` స్టోరీ. దీనికితోడు ఇందులో ఆర్టిస్ట్ ప్రతీకారాన్ని చూపించారు. కళాకారులు విభిన్నరకాలుగా ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కో కళ ఉంటుంది.

అలానే హత్యలు చేసేవాడు కూడా ఆర్టిస్టే అని ఈ మూవీలో చెప్పే ప్రయత్నం చేశారు. విలన్‌ పాత్ర ద్వారా చెప్పిన ఈ పాయింట్‌ కొత్తగా అనిపిస్తుంది. కానీ దాన్ని ఇంత వాయిలెంట్‌గా చెప్పడమే షాకిచ్చేలా ఉంటుంది. సినిమా ఫస్టాఫ్‌ అంతా ఏదో సస్పెన్స్ తో సాగుతుంది. కాస్త స్లోగా రన్‌ అవుతుంది. హీరోహీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్‌, రొమాన్స్ ఇంటెన్సిటిటీ ఉంటుంది.

అదే సమయంలో అన్నా చెళ్లెలు మధ్య అనుబంధాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది. ఇటీవల కాలంలో ఈ సెంటిమెంట్‌తో మూవీస్‌ రాలేదు. ఇందులో ఆ పాయింట్‌ కొత్తగా అనిపిస్తుంది. ఫ్రెష్‌ ఫీలింగ్‌ని కలుగుతుంది. ఫస్టాఫ్‌ ఎంత సేపు అక్కడక్కడే తిరిగిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఇక హీరో హీరోయిన్‌ ఇంటికి వెళ్లాక అసలు కథ స్టార్ట్ అవుతుంది.

విక్కీ ఎందుకు డల్‌గా ఉన్నాడు? ఎందుకు బాధపడుతున్నాడనే విషయాలను రివీల్‌ చేస్తుంటారు. చెల్లి సెంటిమెంట్‌ ఎమోషనల్‌గా అనిపిస్తుంది. కానీ ఆమెని హత్యకు గురైన ఎపిసోడ్‌ అత్యంత కిరాతకంగా అనిపిస్తుంది. గుండె బరువెక్కించేలా ఉంటుంది. 
 

killer artiste movie review

సెకండాఫ్‌లో విలన్‌ ని పట్టుకునే ప్రయత్నాలు, అతన్ని కలిసేందుకు చేసే ప్రయత్నాలు ఎంగేజ్‌ చేస్తాయి. ఆసుపత్రిలో సీఐ కిడ్నాప్‌ ఎపిసోడ్‌ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. కాస్త హిలేరియస్‌గా ఉంటుంది. ఆ తర్వాత సాగే కథనం కూడా కొంత స్లోగానే అనిపిస్తుంది. కానీ పిచ్చి రవి హీరోయిన్‌ ఇంట్లో చేసే మరణకాండ భయం పుట్టించేలా ఉంటుంది.

ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంటుంది. ఆ ఎపిసోడ్‌ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. ఇందులో కొంత ఫన్‌ ఉంటుంది. మరికొంత పైసాచికత్వం ఉంటుంది. హత్య చేసే తీరు కూడా కొత్తగా చూపించడం, ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తుంది. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అదిరిపోయింది. అదే ఈ మూవీకి హైలైట్‌గా చెప్పాలి. హీరోయిన్‌ తండ్రిలోని మరో షేడ్‌ షాకిస్తుంది.

కథని మలుపు తిప్పిన తీరు ఆకట్టుకుంటుంది. ఈ ఎపిసోడ్‌లో ధనికులు, పేద వారి మధ్య వ్యత్యాసాలను తెలియజేస్తుంది. అయితే సినిమా చాలా వరకు నెమ్మదిగా సాగుతున్నట్టు ఉంటుంది. కానీ కథనాన్ని పరుగులు పెట్టించాల్సింది. దీనికితోడు థ్రిల్లర్‌ ఎలిమెంట్లని బాగా జోడించాలి? ట్విస్ట్ లు మరింత కిక్‌ ఇచ్చేలా డిజైన్‌ చేయాల్సింది. కథని కూడా మరింత బలంగా రాసుకోవాల్సింది. అంతే బాగా కథనాన్ని డ్రైవ్‌ చేస్తే ఇంకా బాగుండేది. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది.
 

killer artiste movie review

నటీనటులుః 
విక్కీ పాత్రలో సంతోష్‌ కల్వచెర్ల ఎమోషనల్‌ సీన్లలో బాగా చేశాడు. చెల్లితో సెంటిమెంట్‌ సీన్లలోనూ అదరగొట్టాడు. సినిమా మొత్తం అదే జోరు చూపించాల్సింది. ఓవరాల్‌గా ఫర్వాలేదు. ఇక జానుగా క్రిషేక పటేల్‌ బాగా చేసింది. చాలా చోట్ల హీరో కంటే తనే డామినేట్‌ చేసింది. పిచ్చి రవిగా ప్రభాకర్‌ మైండ్‌ బ్లాక్‌ చేశాడు. సినిమాలో అతని పాత్రనే ఎక్కువగా ఉంటుంది.

సైకో కిల్లర్‌గా తన రాక్షసత్వం చూపించాడు. పాత్రని రక్తికట్టించాడు. నవ్వించాడు, భయపెట్టించాడు. ఇక ఆయన అసిస్టెంట్‌గా భద్రం సైతం బాగా చేశాడు. హీరోయిన్‌ తండ్రి రవీంద్రగా వినయ్‌ వర్మ ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. ఆయన పాత్రలో ట్విస్ట్ అదిరిపోయింది. సీఐగా సత్యం రాజేష్‌ అదరగొట్టాడు. డిఫరెంట్‌ షేడ్స్ చూపించారు. జబర్దస్త్ కమెడియన్లు బాగానే అలరించారు. 
 

killer artiste movie review

టెక్నీషియన్లుః 
సినిమాకి సురేష్‌ బొబ్బిలి మ్యూజిక్‌ బాగుంది. పాటలతోపాటు ఆర్‌ఆర్‌ కూడా బాగా కుదిరింది. కిల్లర్‌ సీన్లలో మాత్రం బీజీఎం ఎలివేట్‌ అయ్యింది. చందు ఏజే కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ అందంగా ఉన్నాయి. మరోవైపు ఆర్‌ ఎం విశ్వనాథ్‌ కుంచనపల్లి ఎడిటింగ్‌ పరంగా బాగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. దర్శకుడు రతన్‌ రిషి ఎంచుకున్న కథ బాగుంది. ట్విస్ట్ లు బాగున్నాయి.

కథని నడిపించే విధానంలో మరింత కేర్‌ తీసుకోవాల్సింది. కానీ కిల్లర్‌ సీన్లు చూస్తుంటే తనలో ఎంత కసి ఉందో అర్థమవుతుంది. ఇందులో ఓ సందేశం కూడా ఉంటుంది. ప్రేమికులను చంపేసి పాపం మూటగట్టుకోవడంలో ప్రయోజనం లేదు. ఇకనైనా మారాలని, ప్రేమికులను అర్థం చేసుకోవాలని చెప్పిన విధానం బాగుంది. 

ఫైనల్‌గాః చంపడం కూడా ఒక ఆర్ట్. ఈ ఆర్టిస్ట్ రివేంజ్‌ చూస్తే వణుకు పుట్టాల్సిందే. 

రేటింగ్‌ః 2.5 
 

Latest Videos

vuukle one pixel image
click me!