ఫ్యామిలీ మెంబర్సే పతనాన్ని కోరుకుంటున్నారు.. అయినా మనోజ్‌ `భైరవం` సినిమా ఆడాలని కోరుకున్న మంచు విష్ణు

Published : May 26, 2025, 04:30 PM IST

మంచు విష్ణు, మంచు మనోజ్‌ మధ్య ఫ్యామిలీ వివాదం నడుస్తుంది. ఈ క్రమంలో తాజాగా తమ్ముడు మంచు మనోజ్‌ నటించిన `భైరవం` సినిమా ఆడాలని అన్న మంచు విష్ణు కోరడం విశేషం. 

PREV
16
చర్చనీయాంశం అయిన మంచు ఫ్యామిలీ వివాదం

మంచు విష్ణు ఫ్యామిలీలో చాలా రోజులుగా గొడవలు నడుస్తున్నాయి. మంచు మనోజ్‌కి, మోహన్‌బాబు, విష్ణులకు మధ్య కాలేజీల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. మోహన్‌బాబు యూనివర్సిటీలో, స్కూల్స్ లో అవకతవకలు జరుగుతున్నాయని మనోజ్‌ ఆరోపిస్తున్నారు. వారి విద్యా సంస్థల బయట ఉన్న విద్యార్థులను మోహన్‌బాబు, విష్ణు మనుషులు ఇబ్బందులు పెడుతున్నారని మనోజ్‌ పలు మార్లు ఆరోపణలు చేశారు.

26
కేసుల వరకు వెళ్లిన మోహన్‌ బాబు, మంచు మనోజ్‌

ఈ క్రమంలో మనోజ్‌ని తన ఇంటికి రానివ్వడం లేదు మోహన్‌ బాబు. అడ్డదారులు తిరుగుతున్నాడని, ఎంత చెప్పినా వినడం లేదని మోహన్‌బాబు ఆరోపించారు. ఈ క్రమంలో వీరు కొట్టుకునే స్థాయికి వెళ్లారు. కేసులు కూడా పెట్టుకున్నారు. అటు మోహన్‌ బాబుపై మనోజ్‌, ఇటు మనోజ్‌పై మోహన్‌ బాబు కేసులు పెట్టుకున్నారు. ఇప్పుడు అంతా సైలెంట్‌ అయ్యారు. అడపాదడపా మంచు మనోజ్‌ పరోక్షంగా సెటైర్లు వేస్తున్నారు.

36
కుటుంబ సభ్యులే పతనాన్ని కోరుకుంటున్నారు, అలాంటిది ప్రభాస్‌

ఈ పరిణామాల నేపథ్యంలో మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్‌ గురించి మాట్లాడుతూ, సొంత కుటుంబ సభ్యులు తమ పతనాన్ని కోరుకుంటున్న ఈ సమయంలో ఎలాంటి సంబంధం లేని ప్రభాస్‌ తమ కోసం `కన్నప్ప` సినిమా చేశాడని, అడగ్గానే నటించేందుకు ఒప్పుకున్నారని తెలిపారు. ప్రభాస్‌ రాకతో `కన్పప్ప` సినిమా స్థాయి పెరిగిందని, ఆడియెన్స్ థియేటర్‌కి రప్పించే పవర్‌ ఆయనలో ఉందని,  ప్రభాస్‌కి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు మంచు విష్ణు.

46
ప్రభాస్‌, మోహన్‌లాల్‌కు రుణపడి ఉంటాను

ప్రభాస్‌ ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్. ఇప్పటి వరకు ఆయన ఏ సినిమాలోనూ గెస్ట్ రోల్‌ చేయలేదు. అలాంటిది మా కోసం, నాన్నగారు అడగ్గానే నటించారని తెలిపారు మంచు విష్ణు. అంతేకాదు పారితోషికం కూడా తీసుకోలేదని ఇలాంటి వ్యక్తులు ఉంటారా? అని ప్రశ్నించారు మంచు విష్ణు. ఆయనకు రుణపడి ఉంటామని తెలిపారు. ప్రభాస్‌ రాకతో సినిమా రేంజ్‌ మారిపోయిందన్నారు. అలాగే మోహన్‌లాల్‌ కూడా అడగ్గానే మరో మాట లేకుండా చేశారని, ఆయన కూడా పారితోషికం తీసుకోలేదని తెలిపారు విష్ణు. వీరికి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుతుందన్నారు. 

56
మంచు మనోజ్‌ నటించిన `భైరవం` సినిమా ఆడాలి

ఈ సందర్భంగా తమ్ముడు మంచు మనోజ్‌ నటించిన `భైరవం` చిత్రం గురించి స్పందించారు మంచు విష్ణు. త్వరలో `భైరవం` మూవీ రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో దానిపై మీ స్పందన ఏంటని యాంకర్ రోషన్‌ అడగ్గా, ఆ సినిమా కూడా బాగా ఆడాలన్నారు. సినిమా ఏదైనా బాగా ఆడాలని, దాన్ని ఆడియెన్స్ ఆదరించాలని తెలిపారు. 

66
తమ్ముడి సినిమాపై మంచు విష్ణు కామెంట్స్ వైరల్‌

ఇప్పుడు సినిమాలు ఆడటం కష్టంగా మారింది. దానిపై నిర్మాత, దర్శకులు, నటీనటులు, టెక్నీషియన్లు ఎంతో మంది ఆధారపడి ఉంటారని, వారంతా బతకాలి, సినిమాలు ఆడాలని, అందులో భాగంగానే `భైరవం` మూవీ కూడా పెద్ద హిట్‌ కావాలని కోరుకున్నారు మంచు విష్ణు. 

సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు. ఓ వైపు మంచు హీరోల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో తమ్ముడి సినిమాపై మంచు విష్ణు కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories