100 కోట్లు ఇచ్చినా ఆ హీరో వద్దు, ఆ సినిమా చేయను, నయనతార రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?

Published : May 26, 2025, 03:57 PM IST

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న నటి నయనతార. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన నయన్.. 100 కోట్లు ఇచ్చినా కూడా ఓ హీరో పక్కన నటించనని స్పష్టంగా చెప్పేసిందట. ఇంతకీ ఎవరా హీరో? 

PREV
15

నయనతార ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించిన ‘జవాన్’ సినిమా 1000 కోట్లకుపైగా వసూలు సాధించగా, నయనతారకు ఆ సినిమాలో రూ. 12 కోట్లు పారితోషికంగా అందినట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె KGF హీరో యష్ తో కలిసి ‘టాక్సిక్’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో యష్ కు అక్కగా ఆమె నటిస్తున్నట్టు సమాచారం.

25

అయితే 2022లో విడుదలైన ‘ది లెజెండ్’ సినిమాలో నయనతార నటించాల్సి ఉంది. ఈ సినిమాలో హీరోగా నటించిన శరవణన్ తన సినిమా కోసం నయనతారను హీరోయిన్ గా తీసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఆమె ఇంటికి పలుమార్లు వెళ్లి ఒప్పించేందుకు ప్రయత్నించిన శరవణన్, రెమ్యూనరేషన్ కింద డబుల్‌ చెల్లిస్తానని కూడా చెప్పారట.

35

కానీ నయనతార మాత్రం “100 కోట్లు ఇచ్చినా అతనితో పనిచేయను” అంటూ తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తమిళ జర్నలిస్ట్ బాలు గతంలో మీడియాకు వెల్లడించారు. నయనతార ఇంటి ముందు ఒక సమయంలో రోల్స్ రాయిస్ కారు కనిపించేది. అది శరవణన్ కారు అని తర్వాత తెలిసిందని ఆయన అన్నారు. నయన్ ను ఒప్పించేందుకు చాలా సార్లు ఆయన నయన్ ఇంటికి వచ్చేవారని బాలు అన్నారు.

45

ఇక నయనతార రిజెక్ట్ చేయడంతో ‘ది లెజెండ్’ సినిమాకు నయనతార స్థానంలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటెలా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయింది. ఈ రకంగా ప్లాప్ మూవీ నుంచి ఆమె తప్పించుకుందనే చెప్పాలి.

55

ఇదిలా ఉండగా, నయనతార ప్రస్తుతం సినిమాలతో పాటు వ్యాపారాల్లో కూడా ఎంతో చురుకుగా ఉంటోంది. ఆమె భర్త విఘ్నేష్ శివన్ కూడా ఈ ప్రయాణంలో ఆమెకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. సినిమా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపారాలు ఇలా అన్ని వైపుల నుంచి కోట్లలో సంపాదిస్తోంది నయనతార. సౌత్ ఇండియాలోనే అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న హీరోయిన్లలో ముందు వరుసలో నయన్ ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories