Mahavatar Narsimha Movie Collections: బడ్జెట్‌ రూ.15కోట్లు, 8 రోజుల్లోనే 4రెట్లు లాభాలు తెచ్చిన యానిమేషన్‌ మూవీ

Published : Aug 02, 2025, 09:25 PM IST

`సలార్‌` ఫేమ్‌ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేషన్‌ ఫిల్మ్ `మహావతార్‌ నరసింహ` బాక్సాఫీసుని షేక్‌ చేస్తుంది. ఇది భారీ వసూళ్లని రాబట్టడం విశేషం. 

PREV
15
కాసుల వర్షం కురిపిస్తోన్న `మహావతార్‌ నరసింహ`

చిన్న సినిమాలు భారీ విజయం సాధించడం మనం చూస్తుంటాం. హాలీవుడ్‌ యానిమేషన్‌ మూవీస్‌ కూడా మన ఇండియాలో మంచి వసూళ్లని రాబడుతుంటాయి. కానీ ఇండియాకి చెందిన యానిమేషన్‌ మూవీ ఇప్పుడు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలకు షాకిస్తోంది. కలెక్షన్ల పరంగా అందరికి మతిపోయేలా చేస్తుంది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. పెట్టిన బడ్జెట్‌కి నాలుగు రెట్లు ఎక్కువ కలెక్షన్లని రాబట్టి లాభాల పంటపండిస్తోంది. ఆ సినిమానే `మహావతార్‌ నరసింహ`.

DID YOU KNOW ?
ఫస్ట్ డే కలెక్షన్లు
`మహావతార్‌ నరసింహ` మొదటి రోజుల రూ.1.7కోట్లు వస్తే, ఎనిమిదో రోజులు ఏకంగా 7.7కోట్లు రాబట్టడం విశేషం.
25
`హరి హర వీరమల్లు`కి పోటీగా వచ్చిన `మహావతార్‌ నరసింహ`

`కేజీఎఫ్‌`, `సలార్‌` వంటి చిత్రాలతో పాపులర్‌ అయిన హోంబలే ఫిల్మ్స్ `మహావతార్‌ నరసింహ` మూవీని సమర్పించింది. అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వం వహించగా, క్లీం ప్రొడక్షన్స్ పతాకంపై శిల్పా ధావన్‌, కుశాల్‌ దేశాయ్‌, చైతన్య దేశాయ్‌ నిర్మించారు. ఈ మూవీ జులై 25న విడుదలైంది. పవన్‌ కళ్యాణ్‌ నటించిన `హరి హర వీరమల్లు` రిలీజ్‌ అయిన ఒక రోజు తర్వాత ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చింది. పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడంతో మొదట్లో దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. మొదటి రోజు కేవలం కోటిన్నర కలెక్షన్లని మాత్రమే రాబట్టింది.

35
రోజు రోజుకి పుంజుకుంటోన్న `మహావతార్‌ నరసింహ`

కానీ నెమ్మదిగా పుంజుకుంది. `హరి హర వీరమల్లు`కి నెగటివ్‌ టాక్‌ ప్రారంభం కావడంతో ఆడియెన్స్ ఈ సినిమా వైపు టర్న్ తీసుకున్నారు. పబ్లిక్‌ టాక్‌ బాగుండటం, రివ్యూలు కూడా పాజిటివ్‌గా ఉండటంతో సినిమాకి ఆడియెన్స్ నుంచి ఆదరణ పెరిగింది. చిన్నపిల్లలు చూడగలిగే సినిమా కావడంతో కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఈ సినిమా భారీ వసూళ్ల దిశగా రన్‌ అవుతుంది. మొదటి వీకెండ్‌తో పోల్చితే రెండో వారం మరింతగా పుంజుకుంది.

45
8 రోజుల్లో 62కోట్లు వసూలు చేసిన `మహావతార్‌ నరసింహ`

తాజాగా విడుదలైన ఎనిమిది రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ.62 కోట్లు వసూలు చేయడం విశేషం. రూ.15 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించారు. ఇప్పుడు దానికి నాలుగు రెట్లు కలెక్షన్లని రాబట్టింది. నిర్మాతలు, బయ్యర్లకి లాభాల పంటపండిస్తుంది. తెలుగులోనే ఇది రూ. 13కోట్లు రాబట్టినట్టు సమాచారం. హిందీలో రూ.38కోట్లు రాబట్టింది. తెలుగులో, నార్త్ లో మూవీ దుమ్మురేపుతుంది. ఈ సినిమాని తెలుగు స్టేట్స్ లో అల్లు అరవింద్‌ తన గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్‌ పతాకంపై విడుదల చేశారు.

55
విష్ణువు భక్తుడు ప్రహ్లాద కథతో `మహావతార్‌ నరసింహ`

మహావిష్ణువు పది అవతారాల్లో ఒక అవతారమైన నరసింహ స్వామి కథని ఆధారంగా చేసుకుని ఆయన పరమ భక్తుడైన ప్రహ్లాదుని గొప్పతనాన్ని, పరమభక్తిని ప్రధానంగా చేసుకుని ఈ చిత్రాన్ని యానిమేషన్‌లో రూపొందించారు. క్లైమాక్స్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. అంతేకాదు ఇండియాలో ఇంతటి క్వాలిటీతో యానిమేషన్‌ చిత్రాలు రాలేదు. దీంతో మన ఆడియెన్స్ సినిమాని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories