Coolie Movie Trailer Review: రజనీకాంత్‌, నాగార్జున ఊచకోత.. `కూలీ` ట్రైలర్‌ ఎలా ఉందంటే?

Published : Aug 02, 2025, 07:30 PM IST

లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌, నాగార్జున, అమీర్‌ ఖాన్‌ వంటి భారీ స్టార్ట్ కాస్ట్ తో వస్తోన్న `కూలీ` మూవీ ట్రైలర్‌ వచ్చేసింది. ఈ ట్రైలర్‌ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

PREV
16
`కూలీ` ట్రైలర్‌ వచ్చేసింది

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న మూవీ `కూలీ`. నాగార్జున, అమీర్‌ ఖాన్‌, ఊపేంద్ర, శృతి హాసన్‌, సత్యరాజ్‌ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. అంచనాలకు ఆకాశమే హద్దుగా మారింది. సన్‌ పిక్చర్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ శనివారం సాయంత్రం విడుదలైంది. నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్ అధికారిక సామాజిక మాధ్యమాల విడుదల చేసింది. భారీ యాక్షన్‌, ఎలివేషన్ల ప్రధానంగా ట్రైలర్‌ సాగింది.

26
నాగార్జున డైలాగ్‌తో `కూలీ` ట్రైలర్‌ ప్రారంభం

`ఒకడు పుట్టగాడే, వాడి చావు ఎవరి చేతిలో ఉంటదో తలమీద రాసి పెట్టి ఉంటది` అని నాగార్జున డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. `ఒక మనిషిని ఈ లోకం నుంచి ట్రైసే లేకుండా తుడిచేయగలమంటే ఇది పెద్ద డిజాస్టర్‌` అని మరో వ్యక్తి చెప్పడం, `కేవలం ఈ నెట్ వర్క్ తోనే వీళ్లు ఇంత పెద్ద వాళ్లు అయ్యారంటే నేను నమ్మలేను సర్‌` అని మరో వ్యక్తి చెప్పగా, అమీర్‌ ఖాన్‌ ఎంట్రీ ఇచ్చారు. `ఎవరికీ తెలియకుండా వాళ్లు ఇంకేదో చేస్తున్నారు సర్‌` అని చెప్పగా, అమీర్‌ యాక్షన్‌లోకి దిగారు. అంతకు ముందే నాగార్జున యాక్షన్‌ స్టార్ట్ చేశారు. 

36
అదిరిపోయేలా అమీర్‌, నాగ్‌, ఉపేంద్ర ఎంట్రీ

ఇక్కడ ఉన్న 14 400 మంది నాకు కావాల్సింది ఆ ఒక్క కూలీ అని మలయాళ నటుడు చెప్పగా, మరో విలన్‌ వచ్చి అన్ని గదుల్లో బాంబులు పెట్టండ్రా దెబ్బకి బూడిదైపోవాలి అని చెప్పగా,   నవ్వుతూ రజనీకాంత్‌ వాయిస్‌ వినిపించింది.  ఒక పెద్ద గోడౌన్‌లో రజనీకాంత్‌ ఎంట్రీ ఇచ్చారు. 

46
ఎమోషనల్‌గా రజనీ, శృతి హాసన్‌ మధ్య కన్వర్జేషన్‌

మొదట ఆయన సీన్లు ఎమోషనల్‌గా సాగాయి. `నిన్నెవర్రా ఇక్కడికి రమ్మన్నది` అని రజనీకాంత్‌కి సత్యరాజ్‌ వార్నింగ్‌ ఇవ్వడం, ఎవరు తోడు లేకుండా బతకడం అలవాటు అయిపోయిందని, ఆయన మీకు కేవలం ఫ్రెండేసార్‌, కానీ మాకు మా నాన్న అని శృతి హాసన్‌ చెప్పడం ఎమోషనల్‌గా ఉంది. కానీ నవ్వుతూ రజనీ చెప్పే డైలాగ్‌లు అదిరిపోయాయి. వాడు మీకు నాన్న, కానీ నాకు ప్రాణ స్నేహితుడు అని చెప్పిన రజనీ యాక్షన్‌లోకి దిగారు. 

56
యాక్షన్‌తో రెచ్చిపోయిన రజనీకాంత్‌

వరుసగా నాగార్జున, అమీర్‌ ఖాన్‌, ఉపేంద్ర, చివరికి రజనీకాంత్‌ యాక్షన్‌తో రెచ్చిపోయారు. అదిరిపోయే యాక్షన్‌తో గూస్‌ బంమ్స్ తెప్పించారు.  ఊచకోత అయిపోయాక ఈ దేవా గురించి తెలిసీ కూడా గేమ్స్ ఆడతావ్‌ రా అని రజనీ చెప్పడం అదిరిపోయింది. చివర్లో పోర్ట్ వద్ద విలన్లకి ధమ్కీ ఇచ్చిన తీరు వాహ్‌ అనేలా ఉంది. ఇందులో గతంలో ఎప్పుడూ చూడని రజనీకాంత్‌ని చూపించబోతున్నారు లోకేష్‌ కనగరాజ్‌. ఆయన యాక్షన్‌ విషయంలో రాజీపడబోనని వెల్లడించారు. ట్రైలర్‌ చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌ అదిరిపోయింది. ముఖ్యంగా బీజీఎం ఇరగదీశారు. సినిమా స్థాయిని పెంచేశారు.

66
గోల్డ్ వాచ్‌ స్మగ్లింగ్‌తో సాగే `కూలీ`

సినిమా కథేంటో ఇప్పటికే దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ వెల్లడించారు. ఇది స్మగ్లింగ్‌ ప్రధానంగా సాగుతుందని అన్నారు. అలాగే రకరకాల నేపథ్యాలు వినిపించాయి. కానీ గోల్డ్ వాచ్‌ల స్మగ్లింగ్‌ని, అత్యంత ఖరీదైన చేతిగడియరాల అక్రమ రవాణాని ఇందులో చూపించబోతున్నారు లోకేష్‌ కనగరాజ్‌. ఇదే విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.  దీంతో ఆ క్యూరియాసిటీ మరింతగా పెరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోన్న ఈ సినిమాని స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ 14న విడుదల చేయనున్నారు. భారీ పాన్‌ ఇండియా మూవీగా దీన్ని విడుదల చేస్తున్నారు. అయితే అదే రోజు బాలీవుడ్‌ మూవీ `వార్‌ 2` రిలీజ్‌ కానుంది. ఈ రెండు బాక్సాఫీసు వద్ద పోటీ పడబోతున్నాయని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories