అర్జున్ రెడ్డి అవార్డుని వేలంలో అమ్మేసిన విజయ్ దేవరకొండ.. రెమ్యునరేషన్ కంటే 5 రెట్లు ధర

Published : Aug 02, 2025, 06:26 PM IST

అర్జున్ రెడ్డి చిత్రానికి వచ్చిన అవార్డుని విజయ్ దేవరకొండ వేలం పాటలో పెట్టాడట. ఆ చిత్రానికి తాను తీసుకున్న రెమ్యునరేషన్ కి ఆ అవార్డు 5 రెట్లు ధర పలికినట్లు తెలిపారు. 

PREV
15
థియేటర్లలో కింగ్డమ్ 

విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడుతున్నాయి. గత చిత్రాల కంటే ఈ మూవీలో విజయ్ దేవరకొండ పరిణితితో నటించాడని అంటున్నారు.  

DID YOU KNOW ?
మండు వేసవిలో ఆ సీన్
కింగ్డమ్ మూవీలో హైలైట్ గా నిలిచిన షిప్ లాగే సన్నివేశాన్ని మండు వేసవిలో చిత్రీకరించినట్లు విజయ్ దేవరకొండ తెలిపారు. విపరీతమైన ఎండ ఉన్నప్పటికీ ఆ సన్నివేశం బాగా రావాలని కష్టపడ్డారట.
25
పెళ్లి చూపులు మూవీతో ఫస్ట్ హిట్ 

తాజాగా మీడియా ప్రతినిధులతో జరిగిన మీటింగ్ లో విజయ్ దేవరకొండ అన్ని విషయాలని పంచుకున్నారు. అర్జున్ రెడ్డి మూవీ నుంచి కింగ్డమ్ వరకు తన కెరీర్ విజయ్ గుర్తు చేసుకున్నారు. అర్జున్ రెడ్డి కంటే ముందుగా విజయ్ పెళ్లి చూపులు చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. కానీ అర్జున్ రెడ్డి మూవీ విజయ్ క్రేజ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళ్ళింది.

35
అర్జున్ రెడ్డి చిత్రానికి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా 

అర్జున్ రెడ్డి చిత్రానికి తాను రెమ్యునరేషన్ ఎంతో విజయ్ దేవరకొండ రీసెంట్ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. అర్జున్ రెడ్డి చిత్రానికి విజయ్ దేవరకొండ రూ.5 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఇప్పుడు కింగ్డమ్ చిత్రానికి విజయ్ రెమ్యునరేషన్ 30 కోట్లకు చేరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అర్జున్ రెడ్డి మూవీ గురించి విజయ్ దేవరకొండ మరో ఆసక్తికర విషయం రివీల్ చేశారు.  

45
అర్జున్ రెడ్డి అవార్డుకి వేలం పాటలో ధర 

విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా జీ సినీ అవార్డు, సైమా, ఫిలింఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఒక అవార్డుని వేలంలో పెడితే 25 లక్షలు ధర పలికిందట. ఈ చిత్రానికి విజయ్ తీసుకున్న రెమ్యునరేషన్ 5 లక్షలు.. అవార్డు వేలంలో పెడితే వచ్చింది 25 లక్షలు అంటే తన రెమ్యునరేషన్ కి 5 రెట్లు మొత్తం దక్కింది.

55
కింగ్డమ్ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ 

ఇదిలా ఉండగా కింగ్డమ్ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సంతోషంగా ఉందని విజయ్ తెలిపారు. కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా.. ఇతర రాష్ట్రాలలో, ఓవర్సీస్ లో విశేష స్పందన లభిస్తుంది. ముఖ్యంగా మలయాళంలో ఈ స్థాయి స్పందన ఊహించలేదు. మలయాళ వెర్షన్ విడుదల చేయకపోయినా.. అక్కడి ప్రేక్షకులు ఇంతటి ప్రేమ చూపించడం చాలా ఆనందంగా ఉంది అని విజయ్ దేవరకొండ అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories