ఆమెఎవరో కాదు మధుబాల. బాలీవుడ్ కు ఆమె ఒక ఐకాన్. తరాలు మారినా గుర్తు పెట్టుకోగలిగే తార. మధుబాల అంటే ఇప్పటికీ చెమర్చే కళ్ళు చాలా ఉన్నాయి. ఆమెను తలుచుకుని మనసు బరువయ్యే అభిమానులు ఉన్నారు.
ఆమె జీవితం ఒడిదుడుకులకు, ఎత్తు పల్లాలకు, చేదుతీపికి ఉదాహరణ. మధుబాల 1950ల్లో టాప్ హీరోయిన్‌గా వెలిగిపోయింది. దాదాపు 20 ఏళ్ల పాటు బాలీవుడ్‌ను ఏలింది. 70 సినిమాల్లో నటించి మెప్పించింది. అన్ని రకాల పాత్రలతో అద్భుతం చేసింది.
Also Read: 50 వేల కోట్ల ఆస్తి ఉన్న హీరో, చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంటాడు కారణం ఏంటి..?