వరుసగా హిట్లు కొడుతూ వస్తున్న బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్ మీద కన్నేశాడు. అందుకోసం పక్కా ప్లాన్ తో వెళ్తున్నాడు. ఈక్రమంలో బాలయ్య కోసం తన సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్నాడట బోయపాటి. ఇంతకీ ఏం చేయబోతున్నాడు.
ఇప్పటికే హ్యాట్రిక్ హిట్టు కొట్టి డబుల్ హ్యాట్రిక్ వైపు దూసుకుపోతున్నాడు నందమూరి నట సింహం బాలకృష్ణ. గతంలో వరుసగా ప్లాప్ సినిమాలు చూసిన బాలయ్య. అఖండ సినిమానుంచి మంచి ఫామ్ లోకి వచ్చాడు. వరుసగా హిట్లు కొడుతున్నాడు. ఇప్పటికే నాలుగు సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బ్లాస్ట్ అయ్యాయి. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూమహరాజ్ ఇలా వరుసగా హిట్ మీద హిట్ కొడుతున్నాడు నటసింహం.
ఇక ప్రస్తుతం బోయపాటి కాంబినేషన్ లో అఖండ 2 సెట్స్ మీద ఉంది. ఈసినిమాను అంతకు మించి అనేలా ప్లాన్ చేశాడట బోయపాటి. వీరిద్దరి కాంబోలో ఇప్పటి వరకూ వచ్చిన సినిమా ఏది ప్లాప్ అవ్వలేదు. సో అఖండ2 పై భారీగా అంచనాలుఉన్నాయి. ఈసినిమా గురించి రోజుకో న్యూస్ బయటకు వస్తుంది. ఇక ఈమూవీలో తన సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్నాడట బోయపాటి.
ఇంతకీ అది ఏంటంటే.. బోయపాటి సినిమా ద్వారా హీరోగా ఉన్న ఆది పినిశెట్టిని పవర్ ఫుల్ విలన్ గా చూపించాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు సినిమాలో ఆది రోల్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. ఆ సినిమా ఎంత హిట్ అయ్యిందో కూడా అందరికి తెలుసు. సో ఆది విలన్ గా కలిసి వచ్చాడు కాబట్టి. ఆ సెంటిమెంట్ ను అఖండ2 కోసం ఉపయోగించబోతున్నాడట బోయపాటి. బాలయ్య సినిమాలో ఆదిపినిశెట్టి దాదాపు కన్ ఫార్మ్ అయినట్టే అంటున్నారు.
అఫీషియల్ గా పోస్టర్ ఎప్పుడు వేస్తారా అని ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. హీరోగా ఎంత అద్భుతమైన సినిమాలు ఇచ్చాడో. విలన్ గా కూడా అంతే అద్భుతంగా నటిస్తున్నాడు ఆది పినిశెట్టి. ఇక ఈ పవర్ ఫుల్ విలన్ బాలయ్యతో తలపడే సన్నివేశాల కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అటు హిందూపురం ఎమ్మెల్యేగా కూడా హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య.
పొలిటికల్ కెరీర్ లోను..ఇటు సినినిమా కెరీర్ లోను దూసుకుపోతున్నాడు. ఇక అఖండ 2 ఎలా ఉంటుందో చూడాలి. ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా నడుస్తోంది. ఈసినిమాను ఈ ఏడాది చివరి కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. డిసెంబర్ లో చేస్తారేమో చూడాలి. అన్ని కలిసొస్తే దసరాకు కాని. దీపావళికి కాని రిలీజ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు.