Krishnam Raju: ఎంతో ఇష్టపడి ప్రభాస్ తండ్రితో కలిసి కృష్ణంరాజు చేసిన సినిమా.. ఇండియా మొత్తం ఆయనవైపే చూసింది

Published : Dec 31, 2025, 09:00 AM IST

కృష్ణంరాజు సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి బాలీవుడ్ లో కూడా రీమేక్ అయింది. ఆ సినిమాతో ఇండియన్ మూవీ ఇండస్ట్రీ మొత్తం తమ వైపు చూసింది అని కృష్ణంరాజు అన్నారు. 

PREV
15
రెబల్ స్టార్ కృష్ణంరాజు

రెబల్ స్టార్ కృష్ణంరాజు నటనకి, ఆయన రెబల్ పెర్ఫార్మెన్స్ కి అభిమానులు ఉన్నారు. కృష్ణంరాజు చెప్పే డైలాగులు అప్పట్లో ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించేవి. ప్రభాస్ హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా రాణించారు. గోపికృష్ణ మూవీ అనే బ్యానర్ స్థాపించి తన సోదరుడు, ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజుతో కలిసి అనేక సినిమాలు నిర్మించారు. 

25
బొబ్బిలి బ్రహ్మన్న మూవీ 

అలా కృష్ణంరాజు సొంత బ్యానర్ లో నిర్మించి నటించిన సూపర్ హిట్ చిత్రాలలో బొబ్బిలి బ్రహ్మన్న ఒకటి. 1984లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. బొబ్బిలి బ్రహ్మన్న చిత్రం అద్భుతమైన వసూళ్లు సాధించి ఘనవిజయం అందుకుంది. టాలీవుడ్ మొత్తం నివ్వెరపోయేలా ఈ చిత్రానికి వసూళ్లు దక్కాయి. 

35
అదే కాన్సెప్ట్ తో చాలా చిత్రాలు 

బొబ్బిలి బ్రహ్మన్న విజయం సాధించడంతో ఈ తరహా కాన్సెప్ట్ ని అనేక చిత్రాల్లో ఉపయోగించారు. చిరాయుడు, పెదరాయుడు, బొబ్బిలి సింహాసనం లాంటి సినిమాల్లో ఇదే కాన్సెప్ట్ ఉపయోగించారు. ఊరికి ఒక పెద్ద ఉండడం, ఆయన తీర్పులు చెప్పడం అనేది అనేక చిత్రాల్లో వచ్చింది. 

45
హిందీలో రీమేక్ 

బొబ్బిలి బ్రహ్మన్న చిత్రం విజయం సాధించడంతో ఈ చిత్రాన్ని కృష్ణంరాజు హిందీలో కూడా రీమేక్ చేశారు. కాకపోతే హిందీలో దిలీప్ కుమార్ హీరోగా నటించారు. కృష్ణంరాజు, సూర్యనారాయణ రాజు హిందీ రీమేక్ ధర్మ అధికారి చిత్రాన్ని నిర్మించారు. అక్కడ కూడా ఈ చిత్రం విజయం సాధించింది. దిలీప్ కుమార్ షూటింగ్స్ కి ఆలస్యంగా వస్తారని, ఆయన సినిమాల షూటింగ్ నెమ్మదిగా ఉంటుందని బాలీవుడ్ లో టాక్ ఉండేది. 

55
ఇండియా మొత్తం మా వైపు చూసింది 

కానీ ఈ చిత్రాన్ని తాము వేగంగా కేవలం 9 నెలల్లోనే పూర్తి చేసినట్లు కృష్ణంరాజు తెలిపారు. ఆయన షూటింగ్ కి కరెక్ట్ టైం కి వచ్చేవారని, ధర్మ అధికారి సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం తమవైపు చూసింది అని కృష్ణంరాజు అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories