వెంకటేష్ హీరోగా వచ్చిన `నువ్వు నాకు నచ్చావ్` మూవీ జనవరి 1న రీ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా త్రివిక్రమ్‌కి సంబంధించిన షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు నిర్మాత స్రవంతి రవి కిశోర్.
వెంకటేష్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన మూవీ `నువ్వే నాకు నచ్చావ్`. కే.విజయ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. దీనికి త్రివిక్రమ్ కథ, మాటలు అందించారు. స్రవంతి రవి కిశోర్ నిర్మించారు. ఈ మూవీ విడుదలై 25ఏళ్లు అవుతుంది. 2001 సెప్టెంబర్ 6న విడుదలైంది. అప్పట్లోనే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఏడు కోట్లతో రూపొందిన ఈ మూవీ రూ.18కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్‌ని సాధించింది. పెట్టినదానికి త్రిబుల్ లాభాలు తెచ్చిపెట్టింది. అప్పట్లోనే తెలుగు సినిమాల్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది.
25
వెంకటేష్ కెరీర్లోనే పీక్ కామెడీ ఫిల్మ్ `నువ్వు నాకు నచ్చావ్`
ఈ చిత్రం 93 సెంటర్లలో 50 రోజులు, 57 సెంటర్లలో వంద రోజులు, మూడు సెంటర్లలో 175 రోజులు పూర్తి చేసుకుంది. సక్సెస్ సెలబ్రేషన్ కూడా నిర్వహించారు. ఇది వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆయన కామెడీ టైమింగ్ ఇందులో పీక్‌లో ఉంటుందని చెప్పొచ్చు. వెంకీ చేసిన కామెడీ చిత్రాల్లో దీనికి ఫస్ట్ ప్లేస్ దక్కుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆర్తి అగర్వాల్ తో లవ్ ట్రాక్ కూడా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నవ్వులు పూయిస్తూనే చివరికి ఎమోషనల్‌కి గురి చేస్తుందీ మూవీ.
35
సినిమాలు వదిలేద్దామనుకున్న త్రివిక్రమ్
ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు నిర్మాత స్రవంతి రవికిశోర్. త్రివిక్రమ్ సినిమా చూశాక ఇక సినిమాలు వదిలేద్దామనుకున్నాడట. స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ, `నువ్వు నాకు నచ్చావ్` విడుదలైన మొదటి రోజుకి వచ్చిన టాక్ చూసి త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా డిజప్పాయింట్ అయ్యారు. అంతేకాదు ఆయన ఇక సినిమాలు వదిలేద్దామనే ఆలోచనకు వచ్చారు. అప్పుడు తాను శాంతి థియేటర్‌కి తీసుకెళ్లి ఆడియెన్స్ మధ్యలో త్రివిక్రమ్‌కి సినిమాని చూపించాను. వారి స్పందన చూసి ఆలోచనను మార్చుకున్నారు. ఆ రోజు త్రివిక్రమ్ ఆలోచననే మార్చేసింద`ని నిర్మాత తెలిపారు.
`నువ్వు నాకు నచ్చావ్` మూవీని ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. కొత్త ఏడాది స్పెషల్‌గా జనవరి 1న ఈ చిత్రాన్ని 4కే లోకి మార్చి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నిర్మాత స్రవంతి రవికిశోర్ ఈ విషయాన్ని చెప్పారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ, ఈ సినిమా క్రెడిట్ మొత్తం వెంకటేష్ దే అన్నారు. ఆయన స్క్రిప్ట్ విన్న వెంటనే మరో ఆలోచన లేకుండా ఓకే చేశారని, అలా ఓకే చేయడం ఫస్ట్ టైమ్ అని, ఆయన ఎలా రియాక్ట్ అవుతారో అని ముందుగా తాను చాలా టెన్షన్ పడ్డానని తెలిపారు త్రివిక్రమ్.
55
సినిమాలో ఇన్ వాల్వ్ అయి చేసిన వెంకటేష్
అంతేకాదు సినిమా షూటింగ్ టైమ్‌లో డైలాగ్ పేపర్స్ ముందుగానే తీసుకునే వారట. ఇది హీరో క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్ శ్రీను.. డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్, ముందే నాకు డైలాగ్ పేపర్స్ ఇవ్వు, వాటిని చదివి ఇంకా బెటర్ చేసుకుంటాను అని అడిగాడట వెంకటేష్. సినిమాలో చాలా ఇన్ వాల్వ్ అయి చేశాడని త్రివిక్రమ్ చెప్పారు. ఈ మూవీ రష్ మూడు 14 నిమిషాలు వచ్చిందని, చివరికి మూడు గంటల 9 నిమిషాలతో విడుదల చేసినట్టు తెలిపారు నిర్మాత స్రవంతి రవికిశోర్. మొత్తంగా 25ఏళ్ల తర్వాత ఆడియెన్స్ ముందుకు వస్తోన్న `నువ్వు నాకు నచ్చావ్` మూవీని ఈ జనరేషన్ ఆడియెన్స్ ఎలా ఆదరిస్తారో చూడాలి.