Karthika Deepam 2 Today Episode: జ్యోకు కార్తీక్ వార్నింగ్- జైల్లోనే కాశీ- శ్రీధర్ పై పారు ఫైర్

Published : Dec 31, 2025, 08:03 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (డిసెంబర్ 31వ తేదీ)లో జ్యోకు వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. బావతో ఛాలెంజ్ చేస్తుంది జ్యో. బెయిల్ పై బయటకు వస్తాడు శ్రీధర్. అల్లుడిపై ఫైర్ అవుతుంది పారు. అడ్డుకుంటారు దీప, దశరథ. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

PREV
19
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో కారులో పోలీస్ స్టేషన్ కి వెళ్తుంటారు కార్తీక్, జ్యోత్స్న. కార్తీక్ కారు మధ్యలో ఆపి దిగమంటాడు. నువ్వు సైలెంట్ గా ఉన్నప్పుడే ఇలాంటిది ఏదో ఉంటుంది అనుకున్నాను అని మనసులో అనుకుంటూ కారు దిగుతుంది జ్యోత్స్న. 

కాశీ, వైరాలతో తప్పు చేయించింది నువ్వే కదా అంటాడు కార్తీక్. మా నాన్నను సీఈఓ పదవి నుంచి దింపడానికి వైరాతో కలిసి కుట్ర చేశావు. ఫుడ్ కల్తీ చేయించావు. కాశీకి జాబ్ ఇప్పించావు. ఇవన్నీ చేసింది నువ్వేనని నాకు తెలుసు అంటాడు కార్తీక్. నేను కాశీ కాల్ లిస్ట్ తీస్తే అంతా బయటపడుతుంది అంటాడు.

29
నువ్వు ప్రూఫ్ చేయగలవా?

తప్పు చేయాల్సిన అవసరం తనకు లేదు అంటుంది జ్యోత్స్న. తాను కూర్చొన్న కొమ్మను తానే నరుక్కునే వాడిని మూర్ఖుడు అంటారు. నువ్వు వైరాతో చేతులు కలిపావంటే నువ్వేంటో నీకే అర్థం కావాలి అంటాడు కార్తీక్. నేను వాళ్లతో ఉన్నానని నువ్వు ప్రూఫ్ చేయగలవా అంటుంది జ్యోత్స్న. నేను శివన్నారాయణ ఆస్తి మొత్తానికి వారసురాలిని. వాడితో కలవాల్సిన అవసరం నాకేంటి అంటుంది జ్యోత్స్న.

ఆస్తి మొత్తం వారసురాలిదే. కానీ నువ్వు కాదు కదా అన్నట్లు మాట్లాడుతాడు కార్తీక్. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడ్తా.. పదా అంటూ కారు ఎక్కుతాడు. బావ నిజం తెలిసి మాట్లాడుతున్నాడా? లేక అనుమానంతో మాట్లాడుతున్నాడా? నా జీవితం మొత్తం ఈ భయంతోనే బతకాల్సి వస్తోంది అనుకుంటూ కారు ఎక్కుతుంది జ్యోత్స్న.

39
ఇరికించావు కదే..

పోలీస్ స్టేషన్ కి వెళ్తారు కార్తీక్, జ్యోత్స్న. శ్రీధర్ కి బెయిల్ ఇచ్చి... కాశీ, వైరాలను సెల్లో వేస్తారు పోలీసులు. ఇరికించావు కదే అని మనసులో అనుకుంటాడు వైరా. నేను మాత్రం తప్పించుకున్నాను అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. నువ్వు తప్పించుకొని.. నన్ను జైలుకి పంపించావు అని మనసులో అనుకుంటాడు కాశీ.

49
నిన్ను జీవితంలో క్షమించను

అవసరమైనప్పుడు స్టేషన్ కి రావాల్సి ఉంటుంది అని శ్రీధర్ తో చెప్తాడు ఎస్సై. ఓకే చెప్పి బయల్దేరుతాడు శ్రీధర్. బయటకు వస్తూ కాశీ దగ్గరకు వెళ్తాడు. నిన్ను నేను కొడుకుగా అనుకున్నాను కాబట్టే.. ఆరోజు నువ్వు ఆక్సిడెంట్ చేసి జైలుకు వెళ్తే డబ్బు కట్టి విడిపించాను. పని నేర్చుకుంటావని నా పక్కనే పెట్టుకున్నాను. కానీ నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. జీవితంలో నిన్ను క్షమించను అంటాడు శ్రీధర్. మామయ్య గారు అని కాశీ ఏదో చెప్పబోతుండగా పట్టించుకోకుండా బయటకు వస్తాడు.

59
మామ కాళ్ల మీదపడ్డ శ్రీధర్

తండ్రిని తీసుకొని తాత ఇంటికి వస్తాడు కార్తీక్. నన్ను క్షమించండి మామయ్య గారు నేను మీ గౌరవాన్ని నిలబెట్టలేకపోయాను అని శివన్నారాయణ కాళ్ల మీద పడతాడు శ్రీధర్. నాకు సీఈఓగా ఉండే అర్హత లేదు అని బాధపడతాడు. నువ్వు ఏ తప్పు చేయలేదు అని శ్రీధర్ ని ఓదారుస్తాడు శివన్నారాయణ.

69
కార్తీక్ ని మెచ్చుకున్న తాత

వైరా మీడియా ముందుకు వచ్చేవరకూ మాకు గందరగోళంగానే ఉంది. కానీ నీ కొడుకు ఉన్నాడు కదా మనల్ని కాపాడటానికి అని కార్తీక్ ని మెచ్చుకుంటాడు శివన్నారాయణ. ఈ సంఘటన వల్ల మనకు ఎంతమంది శత్రువులు ఉన్నారో తెలిసింది. ఇప్పటి నుంచి ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. కానీ నీ అల్లుడు ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు అంటాడు శివన్నారాయణ.

79
శ్రీధర్ పై పారు సీరియస్

వాడు మోసపోయే రకం.. కానీ మోసం చేసేవాడు అని కాశీని సమర్థిస్తుంది పారు. వాడు బయటే ఆగిపోయాడేమో ఇంట్లోకి రమ్మనండి అంటుంది. వాడు బయటలేడు. లోపలే ఉన్నాడు అంటాడు కార్తీక్. అంటే వాడ్ని మీరు విడిపించలేదా అంటుంది పారు. వాడు కూడా తప్పు చేశాడు అందుకే జైలుకు వెళ్లాడు అంటాడు కార్తీక్. వాడు కాదు మీ నాన్న చేశాడు. వాడి మానాన వాడ్ని వదిలేస్తే ఏదో ఒక పని చేసుకునేవాడు అని శ్రీధర్ పై సీరియస్ అవుతుంది పారు.

89
కాశీకి తెలియకుండానే ఇదంతా జరిగిందా?

ఎవరిని పిన్ని నువ్వు సమర్థించేది అంటాడు దశరథ. కాశీకి తెలియకుండానే ఫుడ్ కల్తీ జరిగిందా? మన అదృష్టం కొద్దీ ఆ ఫుడ్ తిన్నవాళ్లకు ఏం కాలేదు. ఒకవేళ ఏదైనా అయితే పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా అని పారుతో గట్టిగా వాదిస్తాడు దశరథ. అంటే నా మనుమడిని అలాగే వదిలేస్తారా.. వాడికి ఎవ్వరూ లేరు అని అంటుంది పారు. కాశీ నీకు మనుమడు అయితే నాకు అల్లుడు. నా కూతురి భర్త. వాడు చేసిన పనికి నేనేంత బాధపడాలి అంటాడు శ్రీధర్. పారు ఇంకా శ్రీధర్ పై రెచ్చిపోతుంటే.. దీప అడ్డుకుంటుంది.

99
పారు నోరుమూయించిన దీప

కాశీ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినా మా మామయ్య గారు కాశీని ఏం అనలేదు. అర్థరాత్రి నా ఆడపడుచు ఇంటికి వచ్చి భర్త గురించి చెప్తే.. బాధపడ్డామే తప్ప కాశీ చెడ్డవాడని చెప్పలేదు. ఇక్కడ ఎవరి బాధలు వాళ్లకు ఉన్నాయి. మీరు కాస్త ఊరుకుంటే మంచిది అంటుంది దీప.

పారు ఏదో చెప్పబోతుండగా.. వాడు ఎంత చెండాలం చేయాలో అంత చెండాలం చేశాడు. చేసిన పనికి శిక్ష పడితే అన్ని పైత్యాలు వదిలిపోతాయి. ఇంకోసారి వాడిని ఈ ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వను అంటాడు శివన్నారాయణ. మీరు ఇంటికి వెళ్లండని కార్తీక్ తో చెప్తాడు. 

నా మనుమడిని మోసం చేసి.. వాడు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం ఈ జ్యోత్స్ననే. దీనికి నా చేతిలో ఉంటుంది చూడు అని పారు మనసులో అనుకుంటుంది. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories