Krishna Vamsi: తెలుగు పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి రమ్యకృష్ణ. ఇక గొప్ప దర్శకుడు కృష్ణ వంశీ. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరు విడాకులు తీసుకున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. దీనిపై కృష్ణవంశీ క్లారిటి ఇచ్చారు.
రమ్యకృష్ణ అంటే తెలుగు సినిమా అభిమానులకు ఎంతో ఇష్టం. ఆమె చేసిన ప్రతి సినిమాను గుర్తు పెట్టుకుంటారు. ఇప్పటికీ రమ్యకృష్ణకు ఫ్యాన్ బేస్ ఎక్కువే. బాహుబలిలో శివగామితో అభిమానుల సంఘం ఇంకా పెద్దదైపోయింది. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు దర్శకుడు కృష్ణవంశీ. దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి కలిగిన వ్యక్తి ఈయన. గ్రామీణ నేపథ్యంలో, సహజమైన పాత్రలతో, భావోద్వేగాల నిండిన కథలతో ఆయన సినిమాలు తీస్తారు. దర్శకత్వంతో పాటు రచనల విషయంలో ఆయనకు మంచి పేరు ఉంది. వీరిద్దరి ప్రేమ పెళ్లి గురించి అందరికీ తెలిసిన విషయమే.
24
వీరిద్దరి ప్రేమపెళ్లి
అందమైన రమ్యకృష్ణ.. దర్శకుడు కృష్ణవంశీని పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనమే సృష్టించింది. స్నేహం ప్రేమగా మారి ఇద్దరి కుటుంబాల అంగీకారంతో వీరి ప్రేమ పెళ్లి జరిగింది. 2003లో వీరిద్దరు వివాహ బంధంలో అడుగుపెట్టారు. పెళ్ళికి ఎలాంటి ఆర్భాటం లేకుండా సంప్రదాయ పద్ధతిలో చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా రమ్యకృష్ణ తన సినిమా ప్రయాణాన్ని కొనసాగించింది. కృష్ణవంశీ కూడా మంచి సినిమాలను చేస్తూ ఉన్నారు.ఈయన సినిమాలకు, రమ్యకృష్ణకు కూడా అభిమానులు ఎంతో మంది.
34
ఇద్దరి మధ్య విడాకులు?
వీరికి రమ్యకృష్ణ, కృష్ణవంశీలకు ఒక కొడుకు రిత్విక్ ఉన్నాడు. అయితే వీరిద్దరూ కూడా తమ జీవితాన్ని చాలా ప్రైవేటుగానే ఉంచడానికి ఇష్టపడతారు. సినిమాల హడావిడి వారి ఇంట్లో కనిపించదు. రమ్యకృష్ణ కూడా ఇంటర్వ్యూలో కుటుంబమే తనకు బలమని చెబుతూ ఉంటుంది. కృష్ణవంశీకి కూడా తన కుటుంబమే మొదటి ప్రాధాన్యమని ఎన్నోసార్లు వివరించాడు. అయితే రమ్యకృష్ణ, కృష్ణవంశీ విడాకులు తీసుకున్నారని గత ఐదేళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై రమ్యకృష్ణ కానీ, కృష్ణవంశీ గాని పెద్దగా స్పందించలేదు. వినీ విననట్టు వదిలేశారు .అయితే ఇప్పుడు కృష్ణవంశీ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
తామిద్దరం విడాకులు తీసుకోలేదని చెప్పారు కృష్ణవంశీ. చెన్నైలో ఆమె, హైదరాబాదులో తాను ఉండటం వల్ల ఎంతో మంది అలా భావించారని వివరించారు. తాము విడాకులు తీసుకున్నట్టు వార్తలు వచ్చినప్పుడు తాను, తన భార్య రమ్యకృష్ణ చాలా నవ్వుకున్నామని అన్నారు. ఇక తన కొడుకు గురించి చెబుతూ ప్రస్తుతం లండన్ లో చదువుకుంటున్నాడని, సినిమాలు పై ఎలాంటి ఆసక్తి తన కొడుకు రిత్విక్ కు లేదని వివరించారు. ఇక కృష్ణవంశీ తనకు ఇష్టమైన హీరోయిన్ రమ్యకృష్ణ అని చెప్పారు. అవకాశం ఉన్నప్పుడు రమ్యకృష్ణ హైదరాబాద్ వస్తుందని, వాళ్లను చూడాలనిపిస్తే తాను వెంటనే చెన్నై వెళ్ళిపోతానని అన్నారు. తామిద్దరం కలిసి ఎలాంటి సినిమా పార్టీలకు, సినిమా ఫంక్షన్లకు హాజరవ్వమని... అందుకే ఎంతోమంది తాను విడిపోయామని భావిస్తూ ఉంటారని తెలిపారు. అంతే తప్ప తమ పెళ్ళిలో ఎలాంటి సమస్యలు లేవని ఇద్దరి మధ్య గౌరవం, ప్రేమ అలాగే ఉన్నాయని వివరించారు కృష్ణవంశీ.