రాజాసాబ్ నుంచి పరాశక్తి వరకు.. ఇప్పటి వరకు వచ్చిన సంక్రాంతి సినిమాల ట్రైలర్స్ లో ఏది బెస్ట్ ?

Published : Jan 05, 2026, 09:38 AM IST

చిరంజీవి, ప్రభాస్, దళపతి విజయ్ ఇలా అగ్ర హీరోలు నటించిన సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన సంక్రాంతి సినిమాల ట్రైలర్స్ లో ఏది బెస్ట్ అనిపించేలా ఉందో ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
Sankranti Movies

సంక్రాంతి సీజన్ ని క్యాష్ చేసుకునేందుకు వెండితెర పందెం కోళ్లు సిద్ధమవుతున్నాయి. తెలుగులో ది రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. వీటిలో ఇప్పటికే రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు చిత్రాల నుంచి ట్రైలర్స్ కూడా వచ్చేశాయి. తమిళం నుంచి విజయ్ జన నాయకుడు, శివకార్తికేయన్ పరాశక్తి సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. ఆ చిత్రాల ట్రైలర్స్ కూడా వచ్చేశాయి. ఇప్పటి వరకు రిలీజైన సంక్రాంతి సినిమాలు ట్రైలర్స్ లలో ఏది బెస్ట్ గా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. 

25
ది రాజాసాబ్

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ రెండవ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. తొలి ట్రైలర్ పర్వాలేదనిపించింది. కానీ రెండవ ట్రైలర్ సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసింది. ట్రైలర్ లో మారుతి ప్రజెంట్ చేసిన విజువల్స్ కి అంతా షాక్ అయ్యారు. ప్రభాస్ ని ప్రజెంట్ చేసిన విధానం, విజువల్ ఎఫెక్ట్స్, హారర్ ఎలిమెంట్స్ ఇలా అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తంగా రాజాసాబ్ రెండవ ట్రైలర్ కట్ ది బెస్ట్ అనిపించేలా ఉంది. 

35
మన శంకర వరప్రసాద్ గారు 

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఇది. నయనతార హీరోయిన్. ముందు నుంచి సంక్రాంతికి పండక్కి సరైన సినిమా అంటూ అంచనాలు పెంచుతూ వచ్చారు. ఈ సినిమాలో వింటేజ్ మెగాస్టార్ కనిపిస్తారని, పండక్కి కావలసిన వినోదం ఈ చిత్రంలో ఉందని చెబుతూ వచ్చారు. ఆ అంచనాలకు తగ్గట్లుగానే మన శంకర వరప్రసాద్ ట్రైలర్ కట్ ఉంది. చిరంజీవి స్టైల్, స్వాగ్, కామెడీ టైమింగ్ అన్నీ ట్రైలర్ లో బాగా కుదిరాయి. ఈ ట్రైలర్ కూడా బావుంది. 

45
జన నాయకుడు 

హెచ్ వినోత్ దర్శకత్వంలో దళపతి విజయ్ నటించిన జన నాయకుడు చిత్రం జనవరి 9న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది రీమేక్ కాదని చిత్ర యూనిట్ చెబుతున్నప్పటికీ.. బాలయ్య భగవంత్ కేసరి చిత్రానికి రీమేక్ అని ట్రైలర్ ద్వారా తెలిసిపోతోంది. ట్రైలర్ లో దర్శకుడు వినోత్.. విజయ్ ఎలివేషన్స్ కి, పొలిటికల్ డైలాగులకు ప్రాధాన్యం ఇచ్చారు. భగవంత్ కేసరి చిత్రాన్ని ఇంకాస్త గ్రాండియర్ గా తెరకెక్కించినట్లు అనిపించింది. ట్రైలర్ బాగానే ఉంది కానీ రీమేక్ కాబట్టి ఈ సినిమా ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. 

55
పరాశక్తి 

నేషనల్ అవార్డు గెలుచుకున్న ఆకాశం నీ హద్దురా చిత్ర దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రం తెరకెక్కుతోంది. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ పీరియడ్ డ్రామాలో రవి మోహన్, అథర్వ, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆదివారం రోజు ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయింది. తెలుగు ట్రైలర్ ఇంకా రిలీజ్ కాలేదు. 1964 బ్యాక్ డ్రాప్ లో రియల్ సంఘటనల ఆధారంగా సుధా కొంగర ఈ చిత్రాన్ని రూపొందించారు. అప్పట్లో జరిగిన హిందీ వెర్సెస్ తమిళ్ భాషల వార్ నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. ట్రైలర్ చూస్తుంటే సుధా కొంగర ప్రతిభ అర్థం అవుతోంది. కానీ ఈ ఎమోషనల్ పీరియడ్ డ్రామా సంక్రాంతికి ఎలాంటి మ్యాజిక్ చేస్తుంది అనేది పెద్ద ప్రశ్న.  

Read more Photos on
click me!

Recommended Stories