Gunde Ninda Gudi Gantalu: రోహిణీ గతం తెలుసుకున్న బాలు, మీనా.. దెబ్బకు రోడ్డుమీద పడిన రోహిణీ

Published : Jan 05, 2026, 10:07 AM IST

 Gunde Ninda Gudi Gantalu: అనుకోకుండా చింటూ బర్త్ డే కి బాలు, మీనాలు వెళ్తారు. ఆల్రెడీ అక్కడికి రోహిణీ ఉంటుంది. మరి, ఈ రోజు ఎపిసోడ్ లో రోహిణీ వాళ్ల కంట పడుతుందో లేదో.. టీవీ కంటే ముందుగా మీ కోసం.. 

PREV
15
Gunde Ninda Gudi Gantalu

చింటూతో కేక్ కట్ చేయించడానికి బాలు, మీనా రెడీ అవుతారు. అయితే.. చింటూ అమ్మ కావాలి అని అడుగుతాడు. అమ్మ కాదు అత్త అని సుగుణమ్మ కవర్ చేస్తుంది. చింటూ కూడా అవును అత్తే అంటాడు. అయితే.. అదంతా చూసి.. బాలు.. సుగణమ్మను మాట్లాడాలి అని బయటకు తీసుకొని వెళతాడు. ‘ చింటూ వాళ్ల అత్త వస్తే బాగుండు అని కోరుకుంటున్నాడు.. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పుట్టిన రోజుకి అయినా వాళ్ల అత్త వస్తే బాగుండేది’ అని బాలు అంటాడు. అయితే.. అదంతా దూరం నుంచి చూస్తూ రోహిణీ తల బాదుకుంటుంది. ‘ నా కర్మ కొద్దీ వీళ్లు మా అమ్మకు పరిచయం అయ్యారు.ఎప్పుడూ ఏదో ఒకటి తవ్వుతూనే ఉంటారు’ అని రోహిణీ మనసులోనే అనుకుంటుంది.

ఇక బాలు, మీనా ఇద్దరూ చింటూ వాళ్ల అత్త గురించి మాట్లాడుతూనే ఉంటారు. ‘వాడు వాళ్ల అత్తలోనే అమ్మను చూసుకుంటున్నాడు.. ఈ ఒక్కరోజు అయినా రావాల్సింది’ అని మీనా అంటే.. ‘ తను రాలేని పరిస్థితిలో ఉంది’ అని సుగుణమ్మ అంటుంది. ‘ మా పార్లరమ్మ వాళ్ల నాన్నలాగా.. చింటూ వాళ్ల అత్త జైలుకి వెళ్లిందా? చింటూకి ప్రమాదం జరిగినప్పుడు రాలేదు, మీకు బాలేనప్పుడూ రాలేదు.. అసలు మీ గురించి పట్టించుకున్నట్లే లేదు.. ఒకసారి నెంబర్ ఇవ్వండి.. నేను మాట్లాడతాను.. ఒక పసివాడిని బాధ పెట్టే హక్కు ఆవిడకు ఎవరు ఇచ్చారు?’ అని బాలు అంటే.. అదంతా వదిలేయమని.. బర్త్ డే చేద్దాం రమ్మని సుగణమ్మ లోపలికి పిలుస్తుంది. ‘ ఈ వయసులో తల్లి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను తల్లి ఉండి దూరంగా బతికాను. వీడు తన కోసం ఎవరూ రారు అనే బాధలో బతుకుతున్నాడు. మాతృత్వం లేకపోయినా మానవత్వం అయినా ఉండాలి కదా.. ఇవ్వండమ్మా.. ఫోన్ నెంబర్ ఇవ్వండి.. నేను మాట్లాడతాను’ అని బాలు ఆవేశంగా మాట్లాడతాడు.సుగుణమ్మ సర్దిచెప్పాలని చూసినా బాలు వినకపోవడంతో.. చింటూని పంపించి.. సుగుణమ్మ నిజం చెప్పడం మొదలుపెడుతుంది.

25
రోహిణీ గతం బయటపెట్టిన తల్లి..

‘ ఇక్కడికి రావడం తనకు ఇష్టం లేదు బాలు’ అని చెబుతుంది. ఆ మాట విని రోహిణీ కూడా షాక్ అవుతుంది. ‘తన అన్న కొడుకును చూడటానికి ఆమెకు మనసు కూడా రావడం లేదా?’ అని మీనా అంటే.. ‘ అన్న కొడుకు కాదు.. కన్న కొడుకు’ అని నిజం చెప్పేస్తుంది. అది విని బాలు, మీనా షాకౌతారు. ‘ మరి ఇన్ని రోజులు అత్త అని ఎందుకు చెప్పారు?’ అని మీనా అడిగితే.. ‘ నేను చెప్పలేదు.. వాళ్ల అమ్మే అలా చెప్పమంది’ అని సుగుణమ్మ చెబుతుంది. ‘ తప్పలేదు.. నిజం ఎవరికీ చెప్పలేక.. అబద్దం వాడికి చెప్పలేక నరకం అనుభవిస్తున్నాను.’ నిజం మొత్తం ఎక్కడ చెబుతుందా అని రోహిణీ అక్కడి నుంచే బయపడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా చేసింది అని మీనా అడిగితే.. ‘ దానికి కారణం నేనే. చేతులారా తన జీవితాన్ని నేనే నాశనం చేశాను.మా ఇంటాయన చనిపోయేనాటికి మాకు చాలా అప్పులు ఉండేవి. అప్పుడు నా కూతురు డిగ్రీ చదువుతోంది. ఒక వయసులో ఉన్న అతను నా కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే.. అప్పులు తీరుస్తామని చెప్పాడు. ఒంటరి ఆడదాన్ని.. అంత అప్పు తీర్చలేక.. నా కూతురిని బలవంతంగా ఒప్పించి ఆ పెళ్లి చేశాను. కానీ, చంటి పుట్టిన కొద్ది రోజులకే అల్లుడు చనిపోయాడు. తన జీవితం నాశనం చేశాను అనే కోపంతో నా కూతురు నా మీద కోపంతో ఉంది. చదువు పేరుతో దూరంగా ఉంది. చదువు పూర్తి అయ్యాక... చింటూని నా దగ్గర వదిలేసి దుబాయి వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయిపోయింది. అందుకే.. ఇక్కడికి రావడానికి ఇష్టపడటం లేదు’ అని సుగుణమ్మ రోహిణీ పేరు, ఆమె రెండో పెళ్లి గురించి చెప్పకుండా మిగిలిన విషయాలు మాత్రం చెబుతుంది. అదంతా విని బాలు, మీనా నిజం అని నమ్మేస్తారు.

‘నిజంగా మీ అమ్మాయికి అన్యాయమే జరిగింది..’ అని మీనా అంటే.. ‘ మరి వాళ్ల అమ్మ చింటూకి అన్యాయం చేయలేదా?’ అని బాలు ప్రశ్నిస్తాడు. ‘ తన తప్పు ఎంత ఉంది అనేది తెలీదు.. అక్కడికి వెళ్లాక దాని సుఖం అది చూసుకుంది. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా చింటూని నేనే పెంచుతున్నాను’ అని సుగుణమ్మ చెబుతుంది. అయితే.. మీరు తప్పు చేశారని.. చిన్న పిల్లాడిని ఎందుకు బాధ పెట్టడం ? అని మీనా అడిగితే.. ‘ ఇప్పుడు చింటూని తీసుకువెళ్లి.. తన కొడుకు అని చెబితే.. తాను కోరుకున్న జీవితం దొరకదు కదా.. అందుకే.. కొడుకు ఉన్నట్లు ఎవరికీ చెప్పుకోవడం లేదు’ అని సుగుణమ్మ చెబుతుంది. ‘ అందరికీ అందరు బాగానే ఉన్నారు.. అప్పు చేసి మరీ.. తప్పు చేసి ఆమె.. మధ్యలో చింటూ బాధపడుతున్నాడు’ అని బాలు అంటాడు. ‘ ప్రపంచంలో ఏ తల్లి అయినా కొడుకు బాగుంటే చాలు అని అనుకుంటుంది కానీ, తను మాత్రమే బాగుండాలని అనుకోదు. మీరు ఏమైనా అనుకోండి.. మీ కూతురికి ఇంత స్వార్థం పనికి రాదు.. శాపం తగులుతుంది.ఆ పసివాడిని అనాథను చేసిన పాపం తగలకపోదు. ఆమె కోరుకున్న జీవితం ఆమెకు దక్కకుండా పోతుంది.’ అని మీనా శాపనార్థాలు పెడుతుంది. అది విని రోహిణీ ఇంకా ఎక్కువ షాక్ అవుతుంది.

35
నడి రోడ్డుపై రోహిణీ..

‘ అమ్మ ఉన్నా లేనట్లు బతకడం చాలా కష్టం. మీరు ఇంతా చెప్పాక.. మీ కూతురితో నాకు ఇంకా మాట్లాడాలనే అనిపిస్తుంది. నెంబర్ ఇవ్వండి’ అని బాలు అడిగితే.. సుగుణమ్మ వద్దు అని చెబుతుంది. ‘ ఇప్పుడిప్పుడే దాని తల్లి మనసు మెత్తపడుతోంది. చింటూని దూరం చేసుకున్నందుకు బాధ మొదలైంది. ఏమో.. మనసు మార్చుకొని చింటూని తొందరల్లోనే తీసుకెళ్తుందేమో’ అని సుగుణమ్మ చెబితే.. ‘ మీరు అనుకుంటున్నారు. నాకు మాత్రం ఆ నామ్మకం లేదు. అసలు ఆమె ఏం అనుకుంటుందో తెలుసుకోవాలి కదా.. నాలాంటివారు గడ్డి పెడితే కానీ బుద్ధి మారదేమో’ అని బాలు ఆవేశపడతాడు. అతని ఆవేశాన్ని మీనా కూల్ చేస్తుంది.‘ ఈ నిజం నేను ఎవరికీ చెప్పలేదు.. మీరు చింటూని ఇంత ప్రేమిస్తున్నారు కాబట్టి.. చెప్పాను’ అని ఆమె అనడంతో.. సరే అని లోపలికి వెళ్లి.. చింటూ బర్త్ డే సెలబ్రేట్ చేస్తారు.

అయితే.. కొడుకు బర్త్ డే దగ్గర నుంచి సెలబ్రేట్ చేయలేకపోయినందుకు రోహిణీ చాలా బాధపడుతుంది. దూరం నుంచే చూస్తూ ఏడుస్తుంది. బాలు, మీనా మాత్రం కేట్ కట్ చేయించి చింటూకి తినిపిస్తారు. తమ సొంత కొడుకు బర్త్ డే చేయించినట్లుగా బాలు, మీనా సంతోషిస్తే.. చింటూ మాత్రం.. పక్కన వాళ్ల అమ్మ లేదని ఫేస్ దిగాలుగా పెట్టుకుంటాడు. ఏమైందని బాలు అడిగితే.. చింటూ నిజం చెప్పడు. దీంతో.. బాలు, మీనా ఆ బుడ్డోడిని సంతోషపెట్టడానికి చాలా ప్రయత్నిస్తారు. దీంతో.. వాడు కూడా నవ్వేస్తాడు. ఇక.. రోహిణీ అక్కడి నుంచి బ్యాగ్ తీసుకొని వెళ్లిపోతుంది. రోహిణీ వెళ్లడం చూసిన సుగుణమ్మ ఆమెకు ఫోన్ చేస్తుంది.

‘ ఎక్కడున్నావ్’ అని సుగుణమ్మ అడగుతుంది. ‘ నడి రోడ్డు మీద నిలపడ్డాను. నువ్వు చేసే పనులకు ఏదో ఒక రోజు ఇలానే నడి రోడ్డు మీద అన్నీ వదిలేసి నిలపడాల్సి వస్తుంది. పంపించేయ్ వాళ్లను’ అని రోహిణీ చాలా గట్టిగానే ప్రశ్నిస్తుంది. ‘ వాడి మీద అంత ప్రేమ చూపించేవాళ్లను.. వాడికి కోసం దుస్తులు తెచ్చే వాళ్లని ఎలా వెళ్లమని చెప్పాలే?’ అని సుగుణమ్మ దిగాలుగా అడుగుతుంది. ‘ అయితే.. నన్ను పొమ్మంటావా? నాకే సమస్య లేదు.. ఇప్పుడే వెళ్లిపోమ్మంటే వెళ్లిపోతాను’ అని రోహిణీ బెదిరిస్తుంది. ‘ వద్దు.. ఏదో ఒకటి చెప్పి.. వాళ్లను ఇక్కడి నుంచి పంపేస్తాను’ అని సుగుణమ్మ చెబుతుంది. ‘ పంపించేయ్.. మళ్లీ నేను టైమ్ కి మా అత్తగారి ఇంటికి వెళ్లాలి లేదంటే.. మా అత్త నా నెత్తిమీద డ్యాన్స్ చేస్తుంది’ అని రోహిణి అంటుంది. సుగుణమ్మ సరే అని బదులిస్తుంది. వాళ్లు వెళ్లాక ఫోన్ చేస్తాను అని చెబుతుంది.

45
తల్లిని తిట్టిన రోహిణీ..

బాలు, మీనా లను పంపించాలని వస్తుంది. కానీ.. వాళ్లు మాత్రం వెళ్లకుండా.. ఇంకా చింటూ తల్లి గురించే మాట్లాడతారు. తర్వాత బయలుదేరతారు. వాళ్లు వెళ్లగానే.. రోహిణీ ఎంట్రీ ఇస్తుంది. చింటూని హత్తుకొని కేక్ తినిపిస్తుంది. తర్వాత ఆ బుడ్డోడిని బయట ఆడుకోమని చెప్పి పంపిస్తుంది. ఇక చింటూ వెళ్లగానే తల్లిపై సీరియస్ అవుతుంది. ‘ ఏం చేయాలి అనుకుంటున్నావ్? నా జీవితం ఏం చేద్దాం అనుకుంటున్నావ్? నా కాపురం ఏమైపోవాలి అనుకుంటున్నావ్? వాళ్లు ఎందుకు వచ్చారు? వాళ్ల దృష్టిలో నువ్వు ఎవరు?’ అని రోహిణీ ప్రశ్నిస్తుంది. ‘ నేను మనిషిని. ఒక తల్లిని.. నువ్వు నీ బిడ్డను వదిలేసి వెళ్లిపోతే.. అష్టకష్టాలు పడుతూ పెంచుతున్న ఒక అనాథని’ అని సుగుణమ్మ చెబుతుంది. ‘ ఓహో.. అయితే నా కథ అంతా చెప్పేస్తావా.. నన్ను ఓ స్వార్థపరురాలిగా మార్చేస్తావా? నా భవిష్యత్తు నాశనం చేస్తావా?’ అని అడుగుతుంది.‘ నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే లేదు.. నా చేతుల్లో ఏముంది? అబద్ధం ఎప్పుడు బయటపడుతుందా అని నువ్వే ప్రతి క్షణం భయపడుతున్నావ్ . వాడు పుట్టిన రోజు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు కానీ నువ్వు హాజరు వేసుకోవడానికి మాత్రమే వచ్చావ్ ’ అని సుగుణమ్మ కూతురిపై సీరియస్ అవుతుంది. ‘ వాళ్లు వస్తారని నాకు మాత్రం ఏం తెలుసు?’ అని రోహిణీ అంటే.. ‘ వాళ్లు వస్తారని నేను కూడా ఊహించలేదు.. కానీ వాళ్లు వెళ్లిపోయాక.. నన్ను తిట్టడానికి ఎదురు చూస్తున్నావ్ తప్ప.. నీ కొడుకుతో కాస్త సమయం గడపాలని అనుకోవడం లేదు’ అని రోహిణీని ఆమె తల్లి తిడుతుంది. ‘ అసలు.. వాళ్లకు మన ఇంటి విషయాలు ఎందుకు చెప్పాలి? నా గురించి ఎందుకు చెప్పాలి? ’ అని రోహిణీ అడిగితే.. ‘ వాళ్లు చింటూ గురించి ఆలోచించే నువ్వు కాస్త కూడా పట్టించుకోవడం లేదు. వాళ్లు పదే పదే నీతో మాట్లాడాలి అనుకుంటున్నారు.. మాట్లాడించనా?’ అని అడుగుతుంది. అయితే.. నా పేరు కూడా చెప్పకపోయావా అని రోహిణీ సీరియస్ అయితే.. నీ గురించి చెప్పలేదు కదా అని ఆమె నచ్చచెబుతుంది. కానీ.. రోహిణీ మాత్రం..బాలుకి ఎక్కడ తానే చింటూ తల్లి అని తెలుస్తుందా అని భయపడుతుంది.ఇంకోసారి బాలు, మీనా ఇక్కడికి రాకుండా చెయ్యమని తల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

55
చింటూ దత్తత..

బాలు, మీనా ఇంటికి వెళ్తూ.. చింటూ తల్లి గురించి ఆలోచిస్తూ ఉంటారు. చింటూని దత్తత తీసుకోవాలని మీనా, బాలు అనుకుంటారు. అందుకోసం ఇంట్లో అందరినీ ఎలా ఒప్పించాలి అని కాసేపు మాట్లాడుకుంటారు. ఇక.. తమ నిర్ణయం కరెక్టో కాదో.. దేవుడిని అడగడానికి గుడికి వెళతారు. అక్కడ చీటీలు వేస్తారు. కమింగప్ లో.. చింటూని దత్తత తీసుకోవడం గురించి తమ నిర్ణయం చెబుతారు.

Read more Photos on
click me!

Recommended Stories