తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి బిజినెస్.. అంచనాలు భారీగా పెంచేస్తున్న కన్నడ సినిమా..

Published : Sep 10, 2025, 07:50 PM IST

Kantara Chapter 1: మల్టీ టాలెంట్ యాక్టర్ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్ 1 అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ  పాన్ ఇండియా సినిమా తెలుగు రైట్స్‌ రూ.100 కోట్ల అమ్ముడైయ్యాయి.

PREV
15
కాంతార సక్సెస్

కాంతార ఓ సెన్సేషన్.. మూడేళ్ల క్రితం వచ్చిన కాంతార సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కేవలం రూ.15 కోట్ల తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ చిత్రం ఏకంగా రూ.400 కోట్ల వసూళ్లు సాధించింది. ఇండియన్ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచింది. 

కర్ణాటక తుళు సంస్కృతి, సంప్రదాయాలను ఎమోషనల్‌గా చూపించిన రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సక్సెస్ తరువాత, ప్రీక్వెల్‌గా వస్తున్న కాంతార చాప్టర్ 1 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

25
భారీ అంచనాలు – గ్రాండ్ విజువల్స్

రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంతో తెరకెక్కించిన అవైటెడ్ మూవీ “కాంతార చాప్టర్ 1” పై పాన్ ఇండియా లెవెల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. బడ్జెట్ పరంగా కాంతార చాప్టర్ 1 తన ముందున్న సినిమా కంటే ఐదు నుంచి ఆరు రెట్లు ఎక్కువ బడ్జెట్ తో రూపొందుతోంది. 

హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా పని చేయడంతో విజువల్స్ మరింత గ్రాండియర్‌గా ఉండనున్నాయి. అజనీష్ లోకనాథ్ సంగీతం, అగ్రశ్రేణి సినిమాటోగ్రఫీతో ఇప్పటికే టీజర్, పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. 

35
తెలుగు రైట్స్ – రూ.100 కోట్ల రికార్డు డీల్

కాంతార చాప్టర్ 1 తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్  రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. కాంతార తెలుగు రైట్స్ ఏకంగా రూ. 100 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇప్పటివరకు తెలుగులోకి డబ్ అవుతున్న నాన్-తెలుగు సినిమాలకు అత్యధిక ధర పెట్టడం ఇదే తొలిసారి.

45
ప్రాంతాల వారీగా డిస్ట్రిబ్యూషన్ రైట్స్

కాంతార చాప్టర్ 1 తెలుగు పంపిణీ హక్కులు ప్రాంతాల వారీగా ఈ డీల్ ఇలా జరిగింది..

నిజాం: మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్

ఉత్తరాంధ్ర: విఘ్నేశ్వర డిస్ట్రిబ్యూటర్స్

తూర్పు & పశ్చిమ గోదావరి: అల్లు అరవింద్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్

గుంటూరు: వారాహి చలనచిత్రం

కృష్ణా: OKSN టెలి ఫిలిమ్స్

నెల్లూరు: ఎస్.వి. శ్రీ వెంగమాంబ సినిమాస్

సీడెడ్: శిల్పకళా ఎంటర్‌టైన్‌మెంట్స్

ఈ డిస్ట్రిబ్యూషన్ మోడల్ ద్వారా తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి.

55
రికార్డు స్థాయి బిజినెస్ – గ్లోబల్ రిలీజ్

మరోవైపు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కేరళ హక్కులను సొంతం చేసుకున్నారు. గతంలో కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార సినిమాల కేరళ రైట్స్ కూడా ఆయన కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా హోంబాలే ఫిల్మ్స్‌తో ఆయన భాగస్వామ్యం కొనసాగుతోంది.

ఇక భారత్‌లోనే కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మరిన్ని దేశాల్లో కూడా భారీ స్థాయిలో సినిమా విడుదల కాబోతోంది. హోంబాలే ఫిల్మ్స్ విదేశీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను కూడా రికార్డు స్థాయిలో విక్రయించినట్లు సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories