Kishkindhapuri - Bellamkonda Srinivas: కిష్కింధపురి సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ కిష్కింధపురి సినిమా చూసేటప్పుడు ఫోన్ పట్టుకుంటే ఇండస్ట్రీని వదిలేస్తానంటూ ఛాలెంజ్ విసిరారు.
భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించడం కాదు. ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించడం పెద్ద ఛాలెంజ్‌గా మారింది. ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. కాస్త మిక్స్‌డ్ టాక్ వస్తే చాలు.. ఆశించిన కలెక్షన్లు రాబట్టలేకపోతారు. ఇక మిడియం రేంజ్ హీరోల సినిమా కష్టాలు మాములుగా ఉండవు.. కాస్త స్లో టాక్ వస్తే.. థియేటర్లలో ప్రేక్షకులే కనిపించరు. ఎంతో యువ హీరోల సినిమాలు ఇలానే కనీస వసూళ్లు సాధించకపోయాయి.
25
నిర్మాతల వ్యాఖ్యలు – ప్రమోషన్లలో కొత్త ట్రెండ్
చిన్న సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో మూవీ మేకర్స్ ప్రేక్షకులను ఆకర్షించేందుకు విభిన్న రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉదాహరణకు ఇటీవల కోర్ట్ సినిమా ప్రమోషన్స్‌లో నిర్మాత నాని మాట్లాడుతూ – “ఈ సినిమా నచ్చకపోతే, నా సినిమాలు చూడకండి” అంటూ సవాల్ విసిరారు. అదే తరహాలో నాగవంశీ కూడా వార్ 2 ప్రమోషన్స్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా మూవీ మేకర్స్ షాకింగ్ కామెంట్స్ చేస్తూ.. సినిమాలపై క్యూరియసిటీ పెంచేస్తున్నారు. ప్రమోషన్లలో ఈ కొత్త ట్రెండ్ పాటిస్తూ.. ప్రేక్షక దేవుళ్లను థియేటర్లకు రప్పిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలే యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చేశారు.
35
కిష్కింధపురి కథ – థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన కిష్కింధపురి సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది. హర్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కౌషిక్ పెగల్లపాటి దర్శకత్వంలో రూపొందిన కిష్కింధపురి కథ 1989లో జరిగిన సంఘటనల చుట్టూ తిరుగుతుంది. సువర్ణమాయ అనే భవనంలోకి దెయ్యాలపై రీసెర్చ్ చేసేందుకు వెళ్లిన హీరో, హీరోయిన్, వారి ఫ్రెండ్స్ ఎదుర్కొన్న సవాళ్లు కథలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. థ్రిల్లింగ్ సన్నివేశాలు, చైతన్ భరద్వాజ్ అందించిన బీజీఎం ఈ సినిమాకు ప్లస్ అవుతాయని యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
కిష్కింధపురి సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ, “సినిమా అంటే మనం టైమ్ మరిచిపోయి లీనం కావాలి. కిష్కింధపురి సినిమా ఆ థ్రిల్ ఇస్తుందని నేను నమ్ముతున్నా. ఒకవేళ సినిమా మొదలయ్యాక 10 నిమిషాల తర్వాత ఎవ్వరైనా ఫోన్ పట్టుకుంటే, నేను ఫిల్మ్ ఇండస్ట్రీని వదిలేస్తా. కథ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఆడియన్స్‌కి మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి మా టీమ్ చాలా కష్టపడింది” అని కామెంట్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గత సినిమా భైరవం మూవీపెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో కిష్కింధపురిని హిట్ చేయాలని బెల్లంకొండ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
55
భారీ అంచనాలు – హిట్ కావాలనే ఆశ
‘రాక్షసుడు’ వంటి హిట్‌తో మంచి పేరు తెచ్చుకున్న బెల్లంకొండ, అనుపమ పరమేశ్వరన్ కలసి నటించడం వల్ల ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గార్లపాటి నిర్మించిన ఈ చిత్రానికి చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫీ అందించారు. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో బెల్లంకొండ చేసిన ఈ సంచలన కామెంట్స్ సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఎంత హర్రర్ థ్రిల్లర్ అయినా రెండున్నర గంటల పాటు ఫోన్ పట్టుకోకుండా చేయడం అసాధ్యం అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దీంతో రిలీజ్ తర్వాత ట్రోలింగ్ తప్పదని అభిమానులు అంటున్నారు.