మనవడిని చూసి మురిసిపోతున్న మెగా స్టార్, వరుణ్ తేజ్ కొడుకు ఫోటోలు చూశారా?

Published : Sep 10, 2025, 06:40 PM IST

మెగా ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది. ఈ కుటుంబలోకి మరో వారసుడు అడుగు పెట్టడంతో పట్టరాని సంతోషంలో ఉన్నారు. ఈక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మనవడిని చూసి మురిసిపోయారు. ఎమోషనల్ పోస్ట్ కూడా షేర్ చేశారు.

PREV
16

మెగా ఫ్యామిలీలోకి వరో వారసుడు వచ్చాడు. ఈ శుభవార్త ప్రస్తుతం అభిమానుల మధ్య పట్టరాని సంతోషాన్ని నింపుతోంది. మెగా ఫ్యామిలీ ఇప్పుడు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. టాలీవుడ్ హీరో, మెగా బ్రదర్ తనయుడు, మెగా ప్రిన్స్, వరుణ్ తేజ్ (Varun Tej) , నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) దంపతులు తల్లీ తండ్రలు అయ్యారు. వారికి సెప్టెంబర్ 10, 2025 న హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

26

ఈ శుభవార్త తలసరి తెలియగానే మెగాస్టార్ చిరంజీవి తన షూటింగ్ కార్యక్రమాలను మధ్యలోనే వదిలేసి, తన సతీమణి సురేఖతో కలిసి నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ పుట్టిన శిశువును చూసి చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. వెంటనే మెగా వారసుడిని ఎత్తుకొని మురిసిపోయారు. బిడ్డను అలానే చూస్తే ఎమోషనల్ అయ్యారు. బాబును ఎత్తుకుని చిరంజీవి ఆడుకుంటున్న ఫోటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

36

చిరంజీవి ఈ ఫోటోలు తన ట్వీట్‌లో షేర్ చేస్తూ.. ఇలా రాసుకొచ్చారు.

“మా కుటుంబంలోకి అడుగుపెట్టిన ఈ చిట్టి తండ్రికి స్వాగతం, సుస్వాగతం. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మా నాగబాబు, పద్మజ తాత, నాన్నమ్మగా ప్రమోట్ అయ్యారు. ఈ బాబుకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలి. మీ ప్రేమాభిమానాలు చిన్నారికి దక్కాలని కోరుకుంటున్నాను.” అని ఆయన ట్వీట్ చేశారు.

46

ఈ ట్వీట్ చూసిన మెగా అభిమానులు కూడా ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి చూపిన ప్రేమను చూసి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. మెగా కుటుంబంలో ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టిన మగబిడ్డ కావడంతో ఈ ఆనందం రెట్టింపు అయింది. ఇక నాగబాబు కుటుంబం కూడా ఈ సమయంలో సంబరాల్లో మునిగిపోయింది. ఇటీవలే లావణ్య త్రిపాఠి కోడలుగా కుటుంబంలోకి అడుగుపెట్టిన వేళ, నాగబాబుకు ప్రభుత్వంలో MLC పదవి కూడా లభించింది. త్వరలో మంత్రి పదవిని కూడా చేపట్టే అవకాశం ఉందని సమాచారం.

56

ఇటు నాగబాబు కూతురు నిహారిక కూడా నిర్మాతగా విజయవంతంగా కొనసాగుతుండటంతో పాటు అవార్డులు కూడా అందుకుంటున్నారు. అయితే తమ ఇంట్లోకి కొత్తగా వచ్చిన నా ఫ్రెండ్ కు వెల్కం అంటూ.. నిహారిక కూడా ఓ పోస్ట్ ను సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేశారు.

66

ఇక వరుణ్ తేజ్ ఇటీవల చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఇప్పుడు వారసుడు వచ్చిన వేళా విషేషంలో వరుణ్ తేజ్ కూడా హిట్టు కొట్టడం ఖాయం అంటున్నారు మెగా ఫ్యాన్స్. వరుణ్ తేజ్ కెరీర్ తిరిగి ట్రాక్‌లోకి వస్తుందని ఆశిస్తున్నారు. మెగా ఫ్యామిలీకి కొత్త వారసుడు జన్మించిన సందర్భంగా, టాలీవుడ్ మొత్తం శుభాకాంక్షలతో నిండిపోయింది. సోషల్ మీడియా యూజర్లు, సినీ ప్రముఖులు, టాలీవుడ్ ప్రముఖులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories