
మంచు విష్ణు హీరోగా రూపొందిన `కన్నప్ప` మూవీ గత శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి భారీ కాస్టింగ్‌తో రూపొందిన మూవీ కావడంతో ఈ చిత్రానికి మంచి హైప్ వచ్చింది.
అది తొలి రోజు కలెక్షన్ల పరంగానూ హెల్ప్ అయ్యింది. ఈ మూవీ ఫలితం విషయంలో మంచు విష్ణు కూడా హ్యాపీ అయ్యారు. చాలా ఏళ్ల తర్వాత హిట్ రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
`కన్నప్ప` మూవీ ఫస్ట్ వీకెండ్ మంచి వసూళ్లని రాబట్టింది. ఆదివారం వరకు కలెక్షన్లు బాగున్నాయి. కానీ వీక్ డేస్‌లో ఇది డల్ అయ్యింది. సాధారణంగా సోమవారం నుంచి కలెక్షన్లు తగ్గిపోతాయి.
కానీ మండే కలెక్షన్లని హోల్డ్ చేయగలిగినా చిత్రాలు మాత్రమే సక్సెస్ అవుతాయి. `కన్నప్ప` చిత్రానికి సోమవారం కలెక్షన్లు పడిపోయాయి. సోమవారంతో పోల్చితే మంగళవారం మరికాస్త తగ్గినట్టు తెలుస్తోంది.
అయితే ఇటీవల సినిమాలు కేవలం మూడు రోజులకే పరిమితమవుతుంది. శుక్రవారం, శనివారం, ఆదివారం మాత్రమే ఆడుతున్నాయి. ఆ తర్వాత ఆ స్థాయిలో కలెక్షన్లని రాబట్టలేకపోతున్నాయి.
ఇప్పుడు ఆడియెన్స్ థియేటర్‌కి వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఫ్యామిలీ ఆడియెన్స్ ఇంట్లో నుంచి కదలడం లేదు. దీంతో అది సినిమాలపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది.
`కుబేర` మూవీ విషయంలో అదే జరిగింది. పాజిటివ్ టాక్ వచ్చినా, కలెక్షన్లు రాలేదు. ఇప్పుడు `కన్నప్ప` విషయంలోనూ అదే జరుగుతుంది. సోమవారం నుంచి దీనికి కూడా వసూళ్లు తగ్గాయి.
ఇక ఐదు రోజుల్లో ఈ మూవీ ఎంత వసూళు చేసిందనేది చూస్తే ఇప్పటి వరకు రూ.32కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తుంది. అరవై కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇది మంచు విష్ణు కెరీర్‌లోనే అత్యధికమైనా, ఈ మూవీకి అవి సరిపోవు.
`కన్నప్ప` సినిమాకి సుమారు వంద కోట్ల బడ్జెట్ అయ్యింది. సినిమా మొత్తాన్ని సొంతంగానే విడుదల చేశారు. దీంతో నిర్మాతలు సేఫ్ కావాలంటే రెండు వందల కోట్ల కలెక్షన్లు రావాలి. కానీ ఈ మూవీ ఆస్థాయి వసూళ్లని రాబట్టడం కష్టమే అని చెప్పొచ్చు.
కానీ ఓటీటీ, శాటిలైట్ రూపంలో మాత్రం భారీగానే వచ్చేలా ఉంది. హిందీ శాటిలైట్ రూపంలో `కన్నప్ప` చిత్రానికి ఇరవై కోట్ల వరకు వచ్చినట్టు సమాచారం. ఇతర లాంగ్వేజెస్ రైట్స్ అమ్ముడు పోవాల్సి ఉంది, అలాగే ఓటీటీ డీల్ కూడా సెట్ కావాల్సి ఉంది.
దీనికి కూడా భారీగానే ఆశిస్తున్నారు. యాభై కోట్లకుపైగానే డీల్ కుదిరితే నిర్మాతలు సేఫ్ అవుతారు, లేదంటే కొంత నష్టాపోవాల్సి వస్తుంది. మరి అది ఎంతకు సెట్ అవుతుందో చూడాలి.
ఇక `కన్నప్ప` మూవీ స్టోరీ ఏంటనేది చూస్తే.. శ్రీకాళహస్తిలో జన్మించిన తిన్నడికి దేవుడంటే నమ్మకం లేదు. శివలింగాన్ని రాయిగానే భావిస్తాడు. కానీ తన భార్య తప్పిపోవడంతో ఆయనలో మార్పు వస్తుంది.
రుద్ర ఆయనలో మార్పు తీసుకొస్తాడు. శివుడి గొప్పతనం తెలియజేస్తాడు. ఆ తర్వాత శివ భక్తుడిగా మారడమే ఈ మూవీ కథ. ఇందులో కన్నప్పగా మంచు విష్ణు నటించారు. తిన్నడిలో దైవభక్తి తెప్పించే రుద్రపాత్రలో ప్రభాస్ నటించారు.
కీరాత(శివుడు) పాత్రలో మోహన్‌లాల్ నటించగా, శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ నటించారు. పూజారి మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు నటించారు. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన `కన్నప్ప` చిత్రాన్ని మోహన్ బాబు సుమారు వంద కోట్లతో నిర్మించారు.