రష్మిక మందన్న ప్రస్తుతం నిర్మాతలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. పుష్ప 2, యానిమల్, ఛావా లాంటి చిత్రాలతో రష్మిక వరుస విజయాలు అందుకుంది. ఈ చిత్రాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద వేలకోట్లు వసూలు చేశాయి. రీసెంట్ గా రష్మిక కుబేర చిత్రంతో కూడా మంచి విజయం అందుకుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక సిగరెట్ స్మోకింగ్ సీన్లపై చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు. సాధారణంగా కమర్షియల్ చిత్రాలలో నటించే రష్మిక, స్క్రిప్ట్ ఎంపికలో కొన్ని స్పష్టమైన నియమాలను పాటిస్తానని పలు సందర్భాల్లో వెల్లడించారు. ముఖ్యంగా, ధూమపానం చేసే పాత్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయనని ఆమె తెలిపారు.