నేను సాంగ్ షూటింగ్ కోసం రిహార్సల్స్ కూడా చేశాను. మరుసటి రోజు సాంగ్ షూటింగ్ ఉంది. ఉదయాన్నే షూటింగ్ కి వెళ్లాను. షూటింగ్ కి వెళ్ళగానే నాకు ఆశ్చర్యపోయే సంఘటన ఎదురైంది. నాలాగే మేకప్,కాస్ట్యూమ్స్ వేసుకొని ఒక వ్యక్తి కనిపించారు. ఏదో తేడాగా జరుగుతోందని నాకు అనుమానం మొదలైంది. ఎవరా వ్యక్తి నాలాగా మేకప్ వేసుకుని ఉన్నాడు అని అడిగాను. అతను ఎన్టీఆర్ గారి కొడుకు బాలకృష్ణ అని తెలిపారు. నా అనుమానం ఇంకా పెరిగింది.
ఏం జరిగిందని ఎవరిని అడుగుతున్నా సమాధానం చెప్పడం లేదు. కొంతసేపటికి నిర్మాత పితాంబరం నా దగ్గరికి వచ్చి సార్ మీరు ఇంటికి వెళ్లిపోండి సాయంత్రం మీతో నేను మాట్లాడతాను. చిన్న పొరపాటు జరిగింది అని అన్నారు. ఏం జరిగిందో చెప్పండి అని అడిగాను.. లేదు సార్ ఇంటికి వచ్చి నేనే చెబుతాను అని నన్ను పంపించేశారు. ఆరోజు సాయంత్రం పీతాంబరం నా దగ్గరికి వచ్చి పొరపాటు జరిగింది సార్.