Kannappa 11 days Collections: `కన్నప్ప` 11 రోజుల కలెక్షన్లు, మంచు విష్ణు హిట్‌ కొట్టాడా? లాభమా నష్టమా?

Published : Jul 08, 2025, 08:58 PM ISTUpdated : Jul 08, 2025, 09:01 PM IST

`కన్నప్ప` మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. సినిమా బాగుందనే ప్రచారం జరిగింది. చాలా మంది పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. కానీ సినిమాకి డబ్బులు వచ్చాయా? 

PREV
15
భారీ కాస్టింగ్‌తో వచ్చిన `కన్నప్ప`

ప్రభాస్, మంచు విష్ణు, మోహన్‌లాల్‌, అక్షయ్‌ కుమార్‌, మోహన్‌ బాబు, కాజల్‌, శరత్‌ కుమార్‌, బ్రహ్మానందం, శివబాలాజీ వంటి భారీ కాస్టింగ్‌తో రూపొందిన `కన్నప్ప` చిత్రం రెండు వారాల క్రితం ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 

హిందీ దర్శకుడు ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దీన్ని రూపొందించారు. మోహన్‌ బాబు నిర్మించారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ కాస్టింగ్‌ ఉండటంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అలాంటి అంచనాల మధ్య జూన్‌ 27న సినిమా విడుదలైంది.

25
`కన్నప్ప`కి అన్ని వర్గాల నుంచి పాజిటివ్‌ టాక్‌

ప్రారంభం నుంచే సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఆడియెన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి. సాధారణంగా మంచు హీరోల సినిమాలకు నెగటివ్‌ టాక్ వస్తుంటుంది. చాలా ట్రోల్స్ నడుస్తుంటాయి. 

కానీ ఈ మూవీ విషయంలో ఎలాంటి నెగటివ్‌ టాక్‌ లేదు, ట్రోల్స్ లేవు. అంతా పాజిటివ్‌ రియాక్షన్‌ రావడం విశేషం. అయితే మరి ఆ టాక్‌ కలెక్షన్ల పరంగా ప్రభావం చూపించిందా? సినిమా హిట్‌ అయ్యిందా? లేదా అనేది చూస్తే.

35
`కన్నప్ప` 11 రోజుల కలెక్షన్లు

తాజాగా `కన్నప్ప` మూవీ 11 రోజుల కలెక్షన్ల రిపోర్ట్ వచ్చింది. ఈ మూవీ ఇప్పటి వరకు రూ.46కోట్ల(గ్రాస్‌) వసూళ్లని రాబట్టినట్టు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఈ రేంజ్‌ వసూళ్లని రాబట్టింది. 

ఇక ఇండియాలోనే సుమారు రూ.33కోట్ల సాధించినట్టు తెలుస్తోంది. షేర్‌ పరంగా ఈ చిత్రం రూ.23 కోట్ల వరకు రాబట్టింది. సినిమాకి ఎనబై కోట్లకుపైగా కలెక్షన్లు వస్తే సేఫ్‌. ఇంకా యాభై కోట్లకుపైగా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సినిమా థియేట్రికల్‌గా ఫ్లాప్‌ అనే చెప్పాలి.

45
`కన్నప్ప` నిర్మాతలు సేఫ్‌? ఎందుకంటే

ఇదిలా ఉంటే ఈ మూవీకి నాన్‌ థియేట్రికల్‌ బాగానే వర్క్ అయినట్టు సమాచారం. హిందీ శాటిలైట్‌ ద్వారానే ఇరవై కోట్లకుపైగా వచ్చాయని టాక్‌. సౌత్‌ శాటిలైట్‌ కూడా ఉంది. 

మరోవైపు ఓటీటీ రూపంలోనే భారీగానే పలికిందని అంటున్నారు. టీమ్‌ నుంచి తెలుస్తోన్న సమచారం మేరకు గట్టిగానే ఓటీటీ రూపంలో సెటిల్‌ అయ్యిందని, దీంతో ప్రొడక్షన్‌ పరంగామూవీ సేఫ్‌ అని అంటున్నారు. 

మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ థియేట్రికల్‌గా ఈ మూవీ ఆశించిన స్థాయిలో వసూళ్లని రాబట్టలేకపోయింది. ఫ్యామిలీ ఆడియెన్స్ కదిలి వస్తే మూవీ పెద్ద రేంజ్‌కి వెళ్లేది. కానీ అది జరగలేదు. అదే ఈ చిత్రానికి మైనస్‌గా చెప్పొచ్చు.

55
`కన్నప్ప` కథ ఇదే

`కన్నప్ప` మూవీ స్టోరీ ఏంటనేది చూస్తే.. శ్రీకాళహస్తిలో జన్మించిన తిన్నడికి దేవుడంటే నమ్మకం లేదు. శివలింగాన్ని రాయిగానే భావిస్తాడు. కానీ తన భార్య కారణంగా ఆయనలో మార్పు వస్తుంది.

 రుద్ర ఆయనలో మార్పు తీసుకొస్తాడు. శివుడి గొప్పతనం తెలియజేస్తాడు. ఆ తర్వాత తిన్నడు శివ భక్తుడిగా మారడం, తిన్నడు కన్నప్పగా మారడమే ఈ మూవీ కథ. ఇందులో కన్నప్పగా మంచు విష్ణు నటించారు. 

తిన్నడిలో దైవభక్తి తెప్పించే రుద్రపాత్రలో ప్రభాస్‌ నటించారు. కీరాత(శివుడు) పాత్రలో మోహన్‌లాల్‌ నటించగా, శివుడిగా అక్షయ్‌ కుమార్‌, పార్వతిగా కాజల్‌ నటించారు. పూజారి మహదేవ శాస్త్రిగా మోహన్‌ బాబు నటించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories