చిరంజీవి ప్రేమ కథ
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు ఓ హీరోయిన్‌ను ప్రాణంగా ప్రేమించారట. అయితే అది వన్ సైడ్ లవ్ గానే మిగిలిపోయిందని సమాచారం. ఆ హీరోయిన్ ఎవరో కాదు సుమలత. మెగాస్టార్ చిరంజీవితో స్వయంకృషిలాంటి సినిమాల్లో నటించిన సుమలతను ఆయన ప్రేమించారని, పెళ్లి కూడా చేసుకోవాలి అని అనుకున్నారంటూ రూమర్ ఒకటి వైరల్ అయ్యింది. కాని ఇది రూమర్ గానే మిగిలిపోయింది.
చిరంజీవి తన కెరీర్ లో రాధిక, విజయశాంతి, రాధ, సుమలత వంటి హీరోయిన్లతో ఎక్కువగా నటించారు. వీరిలో సుమలతతో చిరు మంచి స్నేహాన్ని కొనసాగించారు. చాలా సినిమాల్లో కలిసి నటించారు కూడా. ఈ క్రమంలో వీరి స్నేహాన్ని ప్రేమగా అప్పట్లో ప్రచారం జరిగింది.