నల్లగా ఉన్నావ్.. నువ్వు హీరోయిన్ ఏంటీ అన్నారు.. ఇండస్ట్రీనే ఏలి చూపించింది.. ఎవరా బ్యూటీ..?

First Published | Aug 6, 2024, 10:57 PM IST

నువ్వు హీరోయిన్ ఏంటి.. నల్లగా లావుగా ఉన్నావు.. నీకెవరు అవకాశం ఇచ్చది అని ఎగతాళి చేశారు. దాంతో పట్టుపట్టి హీరోయిన్ అయ్యి.. ఇండస్ట్రీని ఏలి చూపించింది  స్టార్ హీరోయిన్..? ఇంతకీ ఎవరామె..?

Kajol Journey from Being Body-Shamed to Bollywood Queen JMS

ఇండస్ట్రీలో చాలామంది హీరోలు.. హీరోయిన్లు  స్టార్లుగా ఎదిగారు.. ఎదుగుతూనే ఉన్నారు. కాగా చాలామంది ఎన్నో అవమానాలు ఎదుర్కొని.. ఈ స్థాయికి వస్తుంటారు. స్టార్లుగా ఎదిగే క్రమంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, అవమానాలు ఫేస్ చేసి ఉంటారు. అలాను ఓ స్టార్ హీరోయిన్ ఎన్నో మాటలు పడి.. ఇండస్ట్రీని ఏలే స్థాయికి ఎదిగింది. స్టార్ హీరోను పెళ్ళాడి. హ్యాపీలా లైఫ్ లీడ్ చేస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్..? 

రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..? మోహన్ బాబు మాత్రం కాదు.. సూపర్ స్టార్ రహస్యంగా వెళ్లి ఏం చేస్తారంటే..?

ఆమె ఎవరో కాదు బాలీవుడ్ ప్రేమ పావురం కాజోల్. అవును ఆమె ఒకప్పుడు బాలీవుడ్ ను ఊపు ఊపి వదిలిపెట్టింది. ప్రేమికుల ఆరాధ్య దేవతగా మారిపోయింది. షారుఖ్, సల్మాన్ లాంటి  స్టార్ హీరోల సరసన ఆడి పాడింది. కోట్ల మంది అభిమానులను సంపాధించుకుంది కాజోల్. అయితే ఈ పొజిషియన్  ఆమెకు  అంత ఈజీగా రాలేదు. ఎన్నో కష్టాలు పడి ఈస్థాయికి వచ్చింది కాజోల్. 

పవన్ కళ్యాణ్ పై చియాన్ విక్రమ్ క్రేజీ కామెంట్స్.. అలా అన్నాడేంటి....?


తాజాగా  50వ పుట్టినరోజు జరుపకుంది కాజోల్. దాదాపు  32 ఏళ్లుగా సినిమాల్లో తన హవా చూపిస్తోంది సీనియర్ బ్యూటీ. కాజోల్ ఇప్పుడు కాస్త జోరు తగ్గించింది కాని..  ఒకప్పుడు బాలీవుడ్‌లో స్టార్ గా వెలుగు వెలిగింది. ఆతరువాత అవకాశాలు తగ్గుతున్న టైమ్ లో  సూపర్ స్టార్ అజయ్ దేవగన్‌ ను ప్రేమించి పెల్ళాడింది కాజోల్.  అజయ్ తో పెళ్ళికి ముందు  ఆమె  బాలీవుడ్‌లోని నంబర్ వన్ హీరోయిన్స్ లో ఒకరుగా ఉన్నారు. 
 

రాజమౌళి ‌- రమా లవ్ స్టోరీ.. ముందు ఎవరు ప్రపోజ్ చేశారో తెలుసా..?

అయితే కెరీర్ తొలినాళ్లలో సినిమా కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. దీంతో చాలా సినిమాల అవకాశాలను కోల్పోవాల్సి వచ్చింది. ఆమె కలర్ కారణంగా  ఆమెతో పనిచేయడానికి  చాలామంది హీరోలు వెనుకాడేవారట.5 ఆగస్టు 1974న ఇప్పటి మహారాష్ట్ర.. అప్పటి బొంబాయి లో పుట్టింది కాజోల్. ఆమె తల్లి,తండ్రి కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినవారే. దివంగత నిర్మాత-దర్శకుడు సోము ముఖర్జీ ,  నటి తనూజల కుమార్తె. కాజోల్ 32 ఏళ్ల క్రితం 1992లో ‘బేఖుది’ సినిమాతో తెరంగేట్రం చేసింది. 

17 సంవత్సరాల వయస్సులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కాజోల్..  మొదటి సినిమా ప్లాప్ అయ్యింది. అయితే ఆతరువాత సినిమాహిట్ అవ్వడంతో ఇండస్ట్రీలో తిరుగులేని కెరీర్ ను కొనసాగించిందికాజోల్..? గతంలో ఇచ్చిన ఓ  ఇంటర్వ్యూలో, కాజోల్ మాట్లాడుతూ, కొంత మంది తనను  నల్లగా ఉన్నానని, లావుగా ఉన్నానని  ఎగతాళి చేసేవారన్నారు. అలా తనను అవమానించినప్పుడు, తాను చాలా బాధపడ్డానని చెప్పింది. 

ఆ సమయంలో తన ఆత్మవిశ్వాసం  కూడా కోల్పోయిందట కాజోల్.  అందరు తనను అవమానిస్తుంటే.. భరించలేక.. జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించిందట. దాంతో తన గ్లామర్ లోమార్పు రావడం.. అందరు ఆశ్చర్యపోయారని. నేను స్కిన్  ట్రీట్మెంట్ కాని.. సర్జరీ కాని చేసుకున్నానని అంతా అనుకున్నారు. కాని నేను జాగ్రత్తలు మాత్రమే తీసుకున్నాను అని ఆమె అన్నారు. ఇలా తన జీవితంలో పడినఅవమానాలు కొన్నింటిని ఆమె వెల్లడించారు. 

Latest Videos

click me!