పవన్ కళ్యాణ్ పై చియాన్ విక్రమ్ క్రేజీ కామెంట్స్.. అలా అన్నాడేంటి....?

First Published | Aug 6, 2024, 10:07 PM IST

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఏం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు తమిళ స్టార్ హీరో విక్రమ్. ఆయన ఏమన్నారంటే..?  
 

Pawan Kalyan

దాదాపు పదేళ్లు రాజకీయాల్లో ఎన్నో అవమానాలు.. మాటలు పడి.. ఎట్టకేలకు డిప్యూటీ సీఎం హోదాను సాధించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రెండు పెళ్ళిల్లు అంటూ.. అవమానించిన వారికి తగిన బుద్ది చెప్పారు. ప్రస్తుతం అభివృద్ధి మీద దృష్టి పెట్టిన పవర్ కళ్యాణ్.. తన పెడ్డింగ్ సినిమాలు ఎప్పుడు కంప్లీట్ చేస్తారా అని ఫ్యాన్స్ అంతా ఎదరు చూస్తున్నారు. 

రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..? మోహన్ బాబు మాత్రం కాదు.. సూపర్ స్టార్ రహస్యంగా వెళ్లి ఏం చేస్తారంటే..?

కాగా పవన్ సాధించిన ఘనతను ప్రసంశిస్తూ.. ఎంతో మంది స్టార్స్.. అభినందించారు. అన్ని భాషల నుంచి స్టార్స్ పవర్ స్టార్ కృషిని అభినందిస్తూ వచ్చారు.  ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇలా ఎదిగినందకు సంతోషించారు.ఇప్పటికే అనేకమంది సినీ సెలబ్రిటీలు పవన్ పై  స్పందించగా.. తాజాగా తమిళ స్టార్ హీరో విక్రమ్ కూడా పవన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

రాజమౌళి ‌- రమా లవ్ స్టోరీ.. ముందు ఎవరు ప్రపోజ్ చేశారో తెలుసా..?


విక్రమ్ నటించిన తంగలాన్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో స్పెషల్ గా  ప్రెస్ మీట్ నిర్వహించగా.. విక్రమ్  మీడియాతో ముచ్చటించారు. ఈక్రమంలోనే ఆయనకు రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి.. అందులో భాగంగా ..మీడియా ప్రతినిధి పవన్ కళ్యాణ్ గురించి అడగడంతో విక్రమ్ స్పందించారు. 

రోజాకు జబర్థస్త్ లో నో ఛాన్స్.... సంచలన నిర్ణయం తీసుకున్న మాజీ మంత్రి..? ఏం చేయబోతుంది..?
 

విక్రమ్ ఏమన్నారంటే.. నిజంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి... ఆయన చేసింది ఒక చరిత్ర అవుతుంది. అతని వర్క్ అంటే నాకు ఇష్టం. రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లు కష్టపడి, స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వడమంటే అది మామూలు విషయం కాదు. చాలా పెద్ద విషయం. అది చూసి నాకు కూడా ట్రై చేయాలని ఉంది కానీ చేయనని విక్రమ్  అన్నారు.

ప్రయోగాలకు పెట్టిందిపేరుగా ఉన్నారు విక్రమ్. ఇప్పటికే ఆయన శివపుత్రుడు, అపరిచితుడు, ఐ, మల్లన్న, లాంటి ప్రయోగాత్మక సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ క్యారెక్టర్ తో రాబోతున్నారు. తంగలాన్ లో విక్రమ్ అసలు ఏమాత్రం గుర్తు పట్టలేనంత కొత్తగా.. డీ గ్లామర్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమా ఆయనకు హిట్ ఇస్తుందా లేదా అనేది చూడాలి. 

Latest Videos

click me!