సుమకు స్టేజి పైనే ముద్దు పెట్టిన నటుడు .. స్టార్ యాంకర్ రియాక్షన్ ఏంటో తెలుసా

First Published | Aug 6, 2024, 9:55 PM IST

సుమకి థాంక్స్ చెబుతూ సడన్ గా సుమ చేతిపై కిస్ చేశాడు. దీంతో సుమ ఒక్కసారిగా షాక్ అయింది. ఆ తరువాత తేరుకుని ఓరి నయనో .. దేవుడా ఈరోజు నేను ఇంటికి వెళ్తానా .. రాజా .. ఈయన మా అన్నయ్య. రాఖీ పండగ వస్తుంది కదా .. అన్నయ్య సన్నిధి అంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ నెట్టింట వైరల్ గా మారింది. ఇది చుసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.  

Suma Kanakala

యాంకర్ సుమ కనకాల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో లీడ్ యాంకర్ గా రాణిస్తుంది. ఈవెంట్ ఏదైనా గల  గలా మాట్లాడుతూ స్పాంటేనిస్ పంచులతో నవ్వులు పూయిస్తుంటుంది సుమ.  ప్రీ రిలీజ్ ఫంక్షన్స్  నుంచి టీవీ ప్రోగ్రామ్స్ వరకు అన్ని కవర్ చేస్తుంది. అయితే తాజాగా సుమ కి షాకింగ్ సంఘటన ఎదురైంది. తంగాలన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు చేసిన పనికి సుమ అవాక్కయింది. ఆ తర్వాత తేరుకుని కవర్ చేసే ప్రయత్నం చేసింది. 

చిన్న సినిమాల నుంచి స్టార్ హీరో మూవీస్ వరకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే సుమ యాంకరింగ్ ఉండాల్సిందే. కేరళకు చెందిన సుమ తెలుగులో అనర్గళంగా మాట్లాడుతుంది. సుమ కామెడీ టైమింగ్ కి ఫ్యాన్స్ ఉన్నారు. సినీ స్టార్స్ ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్స్ అలాగే బుల్లితెర పై సుమ అడ్డా వంటి షో లు చేస్తుంది. అయితే తాజాగా సుమ కి ఓ ఊహించని సంఘటన ఎదురైంది. ఓ నటుడు స్టేజి పైనే సుమకు ముద్దు ఇచ్చాడు. దీంతో సుమ షాకైంది. 


కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ  ' తంగాలన్ '. పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పీరియాడిక్ హర్రర్ డ్రామా గా తెరకెక్కింది. ఆగస్టు 15న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. మాళవిక మోహన్, పార్వతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే తాజాగా ' తంగాలన్ ' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ప్రోగ్రాం ని సుమ హోస్ట్ చేశారు. 

Suma Kanakala

ఈ క్రమంలో తంగాలన్ లో నటించిన ఒక్కో నటుడిని స్టేజి పైకి పిలిచి సుమ మాట్లాడించారు. ఇందులో కీలక పాత్రలో నటించిన హాలీవుడ్ నటుడు డేనియల్ ని సుమ వేదిక పైకి ఆహ్వానించింది. అతనితో తెలుగులో మాట్లాడించే ప్రయత్నం చేసి నవ్వించింది. ఇక చివరిగా ఇక్కడ ఉన్న అందరి అమ్మాయిల్లో సుమ అందంగా ఉంది అని డేనియల్ తో చెప్పించింది. బాగా చెప్పినందుకు సుమ ఆ నటుడికి షేక్ హ్యాండ్ ఇచ్చింది. 

అయితే అతను సుమకి థాంక్స్ చెబుతూ సడన్ గా సుమ చేతిపై కిస్ చేశాడు. దీంతో సుమ ఒక్కసారిగా షాక్ అయింది. ఆ తరువాత తేరుకుని ఓరి నయనో .. దేవుడా ఈరోజు నేను ఇంటికి వెళ్తానా .. రాజా .. ఈయన మా అన్నయ్య. రాఖీ పండగ వస్తుంది కదా .. అన్నయ్య సన్నిధి అంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ నెట్టింట వైరల్ గా మారింది. ఇది చుసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.  
 

Latest Videos

click me!